ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉచిత కోచింగ్

910 total views, 1 views today

Andhra Pradesh Government, in collaboration with the APSCHE, has decided to provide free online GATE coaching to 3rd and 4th year engineering students.

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు శుభవార్త
ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచితంగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ కోచింగ్ జేఎన్‌టీయూ (కాకినాడ, అనంతపురం) ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.

తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూ (అనంతపురం) జేఎన్‌టీయూ(కాకినాడ) యోగి వేమన విశ్వవిద్యాలయం (కడప) ఆధ్వర్యంలో గేట్‌కు ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వనున్నారు.
గేట్ పరీక్షలకు సంబంధించిన ప్రతి సబ్జెక్టును 12 సెషన్లలో 12 రోజుల పాటు బోధిస్తారు. ఒక్కో సెషన్ రెండు గంటల సేపు ఉంటుంది.
రోజుకు రెండు సబ్జెక్టుల చొప్పున, ఇద్దరు చొప్పున వేర్వేరు ఫ్యాకల్టీ బోధిస్తారు.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,4వ సంవత్సరాల విద్యార్థులకు అనుభవజ్ఞులు, నిపుణులతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 2, 2020
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మే 7, 2020
తరగతులు ప్రారంభం: మే 11, 2020

కో- ఆర్డినేటర్లు :

1. డాక్టర్ ఎస్.వి. సత్యనారాయణ, డెరైక్టర్ అకడమిక్ అండ్ ప్లానింగ్ జేఎన్‌టీయూ- మొబైల్: 9849509167
2. డాక్టర్ వి.శ్రీనివాసులు, డెరైక్టర్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ సెంటర్, జేఎన్‌టీయూకే-మొబైల్: 9701278555

రిజిస్ట్రేషన్‌కు వెబ్‌సైట్లు:
https://jntua.ac.in/gate-online-classes/registration/
https://jntua.ac.in/gate-online-classes/list-of-faculty/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.