Andhra Pradesh Special Status

Andhra Pradesh Special Status

Andhra Pradesh Special Status

Andhra Pradesh Special Status

ఆంధ్రప్రదేశ్..ప్రత్యేక హోదా కథాకమామీషు 

ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాలు, రాజకీయ పక్షాలు ఉద్యమిస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా కేంద్ర కేబినెట్‌లో ఉన్న ఇద్దరు టీడీపీ మంత్రులు అశోకగజపతిరాజు, సుజనాచౌదరి తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో రాష్ట్ర కేబినెట్‌లో వున్న ఇద్దరు బీజేపీ మంత్రులు మాణిక్యారావు, కామినేని శ్రీనివాస్‌లు సైతం తమ మంత్రి పదవులకు రాజీనామాు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గత కొన్ని రోజులగా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు ఇలా అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రజా సంఘాలు సైతం ముక్తకంఠంతో ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చేస్తున్న ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. గతంలో  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు ఏవిధంగా ఉద్యమం జరిగిందో… ఆ సందర్భాన్ని మళ్లీ గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కొరకు అదే స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసు ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదాకు కావసిన అర్హతలు ఏమిటి? ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలు ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు అడ్డంకిగా మారిన అంశం ఏమిటి? అసలు ప్రత్యేక హోదాను ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారు? తదితర అంశాల గురించి తెలుసుకుందాం…
ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్‌ భారతదేశంలో 1969లో ప్రారంభమైంది
వెనకబడిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి సాయం అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు
ప్రత్యేక హోదా వున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు ఇవ్వడంతో పాటు పన్నులు తగ్గిస్తారు. దీనీవల్ల సదరు రాష్ట్రానికి అదనపు లాభం చేకూర్చేలా ప్రయత్నిస్తారు

11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా

దేశంలో ప్రస్తుతం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది
ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వాలనేది నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ నిర్ణయిస్తుంది. ఈ కౌన్సిల్‌కు అధిపతి ప్రధాని. ఇతనితో పాటు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత అడ్మినిస్ట్రేటర్లు, నీతి ఆయోగ్‌ సభ్యులు ఉంటారు
భారతదేశంలో ముందుగా 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు
1. అస్సాం
2. నాగాలాండ్‌

3. జమ్ము కాశ్మీర్‌

Current Affairs Magazine March 2018
Telugu Monthly Current Affairs e-Magazine March-2018 Download as PDF FREE
తర్వాత మరో 8 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు
1. అరుణాచల్‌ప్రదేశ్‌
2. మణిపూర్‌
3. మేఘాలయ
4. మిజోరం
5. ఉత్తరాఖండ్‌
6. త్రిపుర
7. హిమాచల్‌ప్రదేశ్‌
8. సిక్కిం

ప్రత్యేక హోదాకు అర్హతలు:

  • రాష్ట్రంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం
  • తక్కువ జనాభా, గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఉండడం
  • రాష్ట్ర సరిహద్దులు ఇతర దేశాలతో కలసి ఉన్నపుడు
  • రాష్ట్రం ఆర్థికంగా, మౌలికంగా బాగా వెనకబడి వున్నపుడు
  • రాష్ట్రం లోటు బడ్జెట్‌లో వున్నపుడు

ప్రత్యేక హోదాతో లాభాలు:

  • సాధారణంగా ఏ రాష్ట్రానికైనా కేంద్రం నుంచి నిధులు 70 శాతం రుణంగా, 30 శాతంగా గ్రాంట్‌గా వస్తాయి. ప్రత్యేక హోదా వున్న రాష్ట్రాలకు మాత్రం 90 శాతం గ్రాంట్‌గా, 10 శాతం రుణంగా నిధులు వస్తాయి. గ్రాంట్‌గా వచ్చిన నిధులను తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు
  • ప్రత్యేక హోదా వున్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు ఎక్కువగా లభిస్తాయి. దీంతో వేల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటై లక్ష్లల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
  • ప్రత్యేక హోదా వున్న రాష్ట్ర పరిశ్రమలకు 100 శాతం ఎక్సైజ్‌ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఆదాయం పన్నులపై కూడా 100 శాతం రాయితీ లభిస్తుంది. పన్ను రాయితీలే కాకుండా గూడ్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌లకు రీఎంబర్స్‌మెంట్‌ లభిస్తాయి.
  • పరిశ్రమలకు కావలసిన మిషనరీ కొనడానికి కావలసిన పెట్టుబడుల్లో 30 శాతం రాయితీ లభిస్తుంది. కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలతో పాటు ప్రత్యేక హోదా ప్రకటన నాటికి వున్న పరిశ్రమలు విస్తరించే వారికి కూడా ఈ రాయితీలు వర్తిస్తాయి.
  • పరిశ్రమలకు సం॥ వరకు విద్యుత్‌ చార్జీలో 50 శాతం రాయితీ లభిస్తుంది. ఇన్సూరెన్స్‌, రవాణా వ్యయంపై కూడా రాయితీలు ఉంటాయి. ప్రభుత్వరంగ సంస్థలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • మామూలు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులకు కేంద్రం  25 నుంచి 50 శాతం నిధులు మంజూరు చేస్తాయి. ప్రత్యేక హోదా వున్న రాష్ట్రాలకు మాత్రం కేంద్రం నుంచి 90 శాతం నిధులు వస్తాయి.
  • పరిశ్రమల ఏర్పాటుకు రుణంగా తీసుకున్న వర్కింగ్‌ క్యాపిటల్‌కు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.
  • పరిశ్రమలకు ఎక్కువ రాయితీలు లభించడం వల్ల వస్తు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. దీంతో మార్కెట్‌లో చాలా వస్తువుల ధరలు బాగా తగ్గుతాయి. ఇలాంటి రాయితీలు ఉండడం వల్ల మిగతా రాష్ట్రాల నుంచి ఏపీకి చాలా కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. మధ్య, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇలాంటి రాయితీలు బాగా ఉపయోగపడతాయి.

ప్రత్యేక ప్యాకేజీ:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సాయం చెయ్యడానికి 4 ముఖ్యాంశాల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది.
1. 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం
2. 14వ ఆర్థిక సంఘం సూచనలు
3. 2014 ఫిబ్రవరి 20న న నాటి ప్రధాని పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు
4. 2015 డిసెంబర్‌ 1న నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు ఇచ్చిన నివేదిక

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు :

  1. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 46 చట్టం మేరకు 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన నిధుల అంశాన్ని కేంద్రం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక నిధులు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ లోని వెనుకబడిన రాయసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకంగా సాయం చేయాల్సి ఉంటుంది.
  2. సెక్షన్‌ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాల్సి ఉంటుంది.
  3. చట్టంలోని 93వ సెక్షన్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మౌలిక సదుపాయాల గురించి చెప్పడం జరిగింది.
  4. సెక్షన్‌ 94 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధి కోసం లోటు బడ్జెట్‌, పన్ను ప్రోత్సాహకాలను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు సామాజిక, సహజసిద్ధమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం మద్దతివ్వాల్సి ఉంది. ప్రత్యేక ఆర్థిక సాయంతోపాటు, కొత్త రాజధానిలో నిర్మించే రాజధాని, రాజ్‌భవన్‌, హైకోర్ట్‌, ప్రభుత్వ సచివాలయం, అసెంబ్లీ భవనాలతోపాటు ఇతర అవసరాలకు సంబంధించి మౌలిక వసతులు కల్పించాలి.

రాజ్యసభలో ప్రత్యేక హోదా ప్రకటన:

  • 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 5 సం॥ల పాటు ప్రత్యేక హోదాను కల్పించడంతోపాటు 2014-15 ఏడాదికి గాను రాష్ట్ర ప్రభుత్వ నిధుల లోటును కేంద్రం చెల్లిస్తుందని చెప్పారు.
  • ఎన్నికల నేపథ్యంలోనే ప్రత్యేక హోదా ప్రకటన చేశారనే ఆరోపణలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి

14వ ఆర్థిక సంఘం సూచనలతో ప్రత్యేక హోదాకు చెక్‌:

  • 2015 ఏప్రిల్‌ 1 నుంచి 14వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చింది.
  • 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ – డా॥ వై.వి.రెడ్డి
  • 14వ ఆర్థిక సంఘం పదవీ కాలం – 2015`20
  • 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ – ఎన్‌.కె.సింగ్‌
  • 15వ ఆర్థిక సంఘం పదవీ కాలం – 2020-25
  • పార్లమెంట్‌లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్న ఆరు అంశాల్లో ఐదు అంశాల్లో ఎలాంటి సమస్యా లేదు. ప్రత్యేక హోదా అంశం విషయమే సమస్యతోనే  తలెత్తుతుంది. 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదాకు అవకాశం లేదు.
  • రాష్ట్రాలు-కేంద్రాల ఆర్థిక సంబంధాల గురించి వచ్చే ఐదేళ్లకు సంబంధించి విషయాలను 14వ ఆర్థిక సంఘం నిర్వచించింది. ప్రత్యేక హోదా, సాధారణ హోదా అన్న అంశాను 14వ ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకోదు. రాష్ట్రాల ఆర్థిక వనరుల తేడాను పన్ను చెల్లింపుల ద్వారా పూడ్చుతుంది.
  • కేంద్ర పన్ను వాటాలో రాష్ట్రాలకు 42 శాతం చెల్లించాని 14వ ఆర్థిక సంఘం నిర్ణయించింది. పన్నుతో లోటు బడ్జెట్‌ పూడకపోయిన రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్ల ద్వారా లోటును పూడ్చడం జరుగుతుంది. ఇలా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కూడా రెవెన్యూ లోటు రాష్ట్రంగా కేంద్రం గుర్తించడం జరిగింది.
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ లోటును ఐదేళ్ల పాటు కేంద్రం భరించాలని 14వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఇందుకు గాను రూ. 22,113 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు.
  • ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అనేక అంశాలను పకడ్బందీగా అమలు చేసేందుకు నీతిఅయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా పలు సూచనలు చేశారు.
  • రాష్ట్ర వనరులకు సంబంధించి ఆయా రాష్ట్రాలు తమకు ఉన్న ఇబ్బందులను, ఖర్చుల వ్యవహారాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దగా ఆర్థిక కార్యకలాపాలు లేకపోవడంతో పాటు, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. దేశ సరిహద్దుల్లో ఉండటం, ఖర్చులను పరిగణనలోకి తీసుకొని వాటి లోటును పూడ్చడం జరుగుతుంది. రాష్ట్రాల వాటా కింద నిధుల కేటాయింపు చేసిన తర్వాత కూడా రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు నిధులను మంజూరు చేయడం జరుగుతుంది.
  • 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఇతర రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక హోదా ప్రతిపాదనను తీసివేయడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఐదేళ్లపాటు ప్రత్యేక సహాయం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. 2015-16 నుంచి 2019-20 వరకు ఈ చెల్లింపులు జరుగుతాయి. పలు ప్రాజెక్టులకు కేంద్రం చెల్లింపులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంటుంది.
  • ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంతోపాటు, 14వ ఆర్థిక సంఘంతోపాటు, 2014 ఫిబ్రవరి 20 నాటి ప్రధానమంత్రి చేసిన ప్రకటన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతుంది. కానీ, ప్రత్యేక హోదాపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
  • అన్ని వర్గాలు, పార్టీల వారు సంఘటితంగా ఉద్యమిస్తే ప్రత్యేక హోదా సాధించడం సాధ్యమేనంటున్నారు నిపుణులు. రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మాట మారిస్తే కేంద్రం తీవ్ర వ్యతిరేకతకు మూటగట్టుకోవాల్సి వస్తుందనే వాదన వినిపిస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కానప్పటికీ ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌కు వర్తింపజేయాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  • ఉమ్మడి రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో ఇబ్బందులతో పాటు రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్రం తప్పక ఆదుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
  • ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ తిరుపతిలో నిర్వహించిన సభలో మునికోటి ఆత్మాహుతికి పాల్పడ్డాడు

 Download PDF here