Download AP Budget 2019-20 in Telugu PDF – Live Updates from AP Assembly

8,811 total views, 8 views today

Download AP Budget 2019-20 in Telugu PDF and Watch Live Updates from AP Assembly on Budget Session.

2019-20 పూర్తిస్థాయి బడ్జెట్‌ నేడు





నవ్యాంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం నూతన పంథాలో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా దాదాపు రూ.2.18 లక్షల కోట్ల అంచనాలతో దీనికి రూపకల్పన చేస్తోంది. నవరత్నాలే తమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ చేయూత వంటివాటికి ప్రాధాన్యమిస్తూ సంక్షేమమే ప్రధానంగా కేటాయింపులు ఉంటాయని సమాచారం. ఎన్నికల హామీల్లో దేనిని ఎప్పటి నుంచి అమలు చేయాలో ఇప్పటికే నిర్దేశించారు. పింఛన్లకు రూ.15 వేల కోట్లపైనే అవసరమవుతాయని లెక్కించారు. ఎన్నికల ప్రణాళికలోని అంశాలకు రూ.65,000 కోట్ల నుంచి రూ.70,000 కోట్ల వరకు కేటాయింపులు ఉండబోతున్నాయని సమాచారం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శాసనసభలో, మండలిపక్ష నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ శాసనమండలిలో ప్రవేశపెడతారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 2,27,974.99 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు . వ్యవసాయానికి 28 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఎన్నికల హామీలు, మేనిఫెస్టో అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కీలకాంశాలుగా విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పన ఉండనుంది. 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే, 19.32శాతం పెరుగుదల. రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా అందరికీ ప్రభుత్వ పథకాలు. మహాత్ముని లక్ష్యం సాధించే దిశగా బడ్జెట్‌ రూపకల్పన.

గత ఐదేళ్లలో తెదేపా ప్రభుత్వం నికరంగా రూ.1,00,658.37 కోట్ల అప్పు చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. విభజన నాటికి రాష్ట్రంపై ఉన్న రుణ భారం? గత ఐదేళ్లలో ప్రభుత్వం తీసుకున్న రుణాలు? ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న రుణభారం ఎంత? అని ఎమ్మెల్యేలు పార్థసారథి, సుధాకర్‌బాబు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధామిచ్చారు. 2014 జూన్‌ నాటికి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,30,654.34 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయని, 2019 మే 30 నాటికి ఇది రూ.2,61,302.81 కోట్లకు చేరినట్లు వెల్లడించారు.

వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న బొత్స

వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మండలిలో పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టనున్నారు. సోదరుడి హఠాన్మరణంతో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోతున్నారు. నాలుగు నెలల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్టుకు గత ప్రభుత్వ హయాంలో ఆమోదం లభించింది. ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చేలా మిగిలిన 8 నెలల కాలానికి బడ్జెట్‌ను ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు.





బడ్జెట్ 2019-20 కీలక అంశాలు :

  • జీఎస్‌డీపీలో రెవెన్యూలోటు సుమారు 0.17శాతం .
  • రెవెన్యూలోటు రూ.1778.52కోట్లు.
  • ద్రవ్యలోటు సుమారు రూ.35,260.58కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94కోట్లు.
  • మూలధన వ్యయం రూ.32,293.39కోట్లు.
  • రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.100 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.100.05కోట్లు.
  • పాల సహకార సంఘాల అభివృద్ధికి రూ.100కోట్లు.
  • గిడ్డంగుల నిర్మాణానికి రూ.37.53కోట్లు.
  • గిడ్డంగులు, మౌలిక నిధి కింద రూ.200కోట్లు.
  • వైఎస్‌ఆర్‌ వ్యవసాయ ప్రయోగశాల కోసం రూ.109.28కోట్లు.
  • ఇంధన శాఖకు రూ.6,861.03కోట్లు.
  • పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ.573.60కోట్లు.
  • పారిశ్రామిక మౌలిక కల్పన కింద రూ.250కోట్లు.
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మౌలిక అభివృద్ధి వనరుల కోసం రూ.200కోట్లు.
  • పారిశ్రామిక కల్పన కింద రూ.250కోట్లు.
  • జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,455.80కోట్లు.
  • పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.1500కోట్లు.
  • మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077కోట్లు.
  • వైఎస్‌ఆర్‌ పాఠశాలల నిర్వహణ గ్రాంటు రూ.160కోట్లు
  • అక్షయపాత్ర ఫౌండేషన్‌ వంటశాలల నిర్మాణానికి రూ.100కోట్లు.
  • రాష్ట్ర అభివృద్ధి పథకాల అంచనా వ్యయం రూ.92,050.05కోట్లు
  • ఎస్సీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.15,000కోట్లు.
  • ఎస్టీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.4988.52కోట్లు.
  • బీసీ సబ్‌ ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.15,061.64కోట్లు.
  • ఆర్థిక రంగ సేవల కోసం రూ.86,105.63కోట్లు.
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677.08కోట్లు.
  • గ్రామీణాభివృద్ధికి రూ.29,329.98కోట్లు.
  • జలవనరుల కోసం రూ.13,139.05కోట్లు.
  • తాగునీరు, వరద నియంత్రణ కింద రూ.13,139.05కోట్లు.
  • విద్యుత్‌శాఖకు రూ.6,861.03కోట్లు.
  • ఖనిజాభివృద్ధి శాఖకు రూ.3,986.05కోట్లు
  • అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1150కోట్లు
  • కాపుల సంక్షేమానికి రూ.2000కోట్లు.
  • ఆటో డ్రైవర్ల ఆర్థికసాయం కింద రూ.400కోట్లు
  • చేనేత కార్మికులకు వైఎస్‌ఆర్‌ భరోసా కింద రూ.200కోట్లు.
  • వైఎస్‌ఆర్‌ గ్రాంట్స్‌ కింద మత సంస్థలకు సహాయం రూ.234కోట్లు
  • వైఎస్‌ఆర్‌ గృహ పథకానికి రూ.5వేల కోట్లు
  • బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌కు రూ.100కోట్లు.
  • న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు రూ.100కోట్లు.
  • న్యాయవాదుల ఆర్థిక సాయం కింద రూ.10కోట్లు.
  • బీసీలకు వైఎస్‌ఆర్‌ కల్యాణ కానుక కింద రూ.300కోట్లు.
  • ఎస్సీలకు వైఎస్‌ఆర్‌ కల్యాణ కానుక కింద రూ.200కోట్లు.
  • ఎస్టీలకు వైఎస్‌ఆర్‌ గిరి పుత్రిక కల్యాణ కానుక కింద రూ.45కోట్లు.
  • మైనార్టీలకు వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా కింద రూ.100కోట్లు.
  • పౌరసరఫరాలశాఖకు బియ్యం రాయితీ కింద రూ.3000కోట్లు .
  • బియ్యం తదితర సరకుల సరఫరాకు రూ.750కోట్లు.
  • పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఆర్థిక సాయం కింద రూ.384కోట్లు
  • గ్రామ సచివాలయాల కోసం రూ.700కోట్లు .
  • మున్సిపల్‌ వార్డు వాలంటీర్ల కోసం రూ.280కోట్లు.
  • మున్సిపల్‌ వార్డు సచివాలయాల కోసం రూ.180కోట్లు
  • ఏపీఎస్‌ ఆర్టీసీకి సహాయార్థం రూ.1000కోట్లు.
  • రాయితీల కోసం రూ.500కోట్లు.
  • ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.260కోట్లు.
  • పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణం కింద రూ.648కోట్లు
  • డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140కోట్లు
  • రైతు సంక్షేమం: ధరల స్థిరీకరణ నిధికి రూ.3000కోట్లు.
  • ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002కోట్లు .
  • వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి రూ.8,550కోట్లు.
  • రైతులకు ఉచిత విద్యుత్‌కు రూ.4,525కోట్లు
  • వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద బోర్ల తవ్వకానికి రూ.200కోట్లు
  • రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ.200కోట్లు.
  • వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం కింద రూ.100కోట్లు.
  • చేపల జెట్టీలు, హార్బర్ల కోసం రూ.100కోట్లు.
  • మత్స్యకారుల పడవలకు డీజిల్‌ రాయితీ కింద రూ.100కోట్లు.
  • మత్స్య సంపద అభివృద్ధి కోసం రూ.60కోట్లు.
  • ఎస్సీ మత్స్యకారుల సంక్షేమానికి రూ.50కోట్లు
  • ఎయిడ్స్‌ బాధితుల పెన్షన్‌ కోసం రూ.100కోట్లు.
  • ట్రాన్స్‌ జెండర్ల పెన్షన్లకు రూ.7కోట్లు
  • ఆశా వర్కర్లకు రూ.455.85కోట్లు.
  • వైఎస్సార్‌ రైతు బీమాకు రూ.1,163కోట్లు.
  • ప్రకృతి విపత్తుల నిధికి రూ.2002కోట్లు.
  • ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీకి రూ.475కోట్లు.
  • రైతులకు ఉచిత బోర్లకు రూ.200కోట్లు.
  • విత్తనాల పంపిణీకి రూ.200కోట్లు
  • ఉద్యానశాఖకు రూ.1532 కోట్లు కేటాయింపు
  • ఆయిల్‌ఫాం రైతులకు ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు అదనంగా రూ.80 కోట్లు కేటాయింపు.
  • ఆయిల్‌ఫాం తోటల సాగు ప్రోత్సాహానికి రూ.65.15కోట్లు.
  • సహకార రంగ అభివృద్ధికి రెవెన్యూ వ్యయం రూ. 174.64 కోట్లు.
  • సహకార రంగం అభివృద్ధికి పెట్టుబడి వ్యయం కింద రూ.60 కోట్లు కేటాయింపు
  • 2019-20లో రైతులకు సహకార స్వల్పకాలిక రుణాల కింద రూ.12వేల కోట్లు కేటాయింపు.
  • దీర్ఘకాలిక రుణాల కింద రూ.1500 కోట్లు.
  • 2019-20 ఆర్థిక సంవత్సరంలో కౌలు రైతుల కోసం రూ.1200 కోట్లు కేటాయింపు.
  • వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.12,500. దీని ద్వారా 65.07లక్షల మందికి ప్రయోజనం
    వైఎస్సార్‌ రైతుభరోసా కింద బోర్ల తవ్వకానికి రూ.200కోట్లు,
  • విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు, గిడ్డంగులు,
  • మౌలిక నిధుల కింద రూ.200 కోట్లు కేటాయింపు.
  • వైఎస్సార్‌ వ్యవసాయ ప్రయోగశాలల కోసం రూ.109.28 కోట్లు,
  • వ్యవసాయ యాంత్రీకరణకు రూ.100.05 కోట్లు కేటాయింపు.
  • రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.100 కోట్లు.
  • పాల సహకార సంఘాల అభివృద్దికి రూ.100 కోట్లు,
  • పశు అభివృద్ధి, దాణా కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం.
  • వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం కింద రూ.100 కోట్లు కేటాయించాం.
  • చేపల జెట్టీలు, హార్బర్ల కోసం రూ. 100 కోట్లు
  • మత్స్యకారుల పడవలకు డీజిల్‌ రాయితీ కింద రూ.100 కోట్లు,
  • మత్స్య సంపద అభివృద్ధికి రూ.60 కోట్లు కేటాయిస్తున్నాం.
Andhra Pradesh Budget 2019-20 Speech

Download PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.