Download APPSC Group 1 Syllabus 2018 in Telugu PDF. In this post, you also included the syllabus of APPSC Group 1 2018 in English. This post comprises of APPSC Group 1 Syllabus 2018 – Prelims (both Paper 1 & Paper 2) and Mains (Paper 1, Paper 2, Paper 3, Paper 4, & Paper 5). We also include APPSC Group 2 2018 Prelims and Mains (Paper 1, Paper 2, Paper 3) in Telugu.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 పోస్టులకు సంబందించిన సిలబస్ విడుదల కావటం జరిగింది. అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో సిలబస్ ను క్షుణంగా తెలుసుకోటానికి వీలుగా సిలబస్ ని తెలుగు లో ఇవ్వడం జరిగింది
ముందుగా గ్రూప్ 1 పరీక్షా విధానం చూసినట్లయితే ఈ పరీక్షా మొదటి విధానం ప్రిలిమ్స్
ప్రిలిమ్స్ లో రెండు పేపర్ లు ఉందును.
APPSC Group 1 పరీక్ష విధానం:-
* ప్రిలిమినరీ పరీక్ష
పేపరు | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు | సమయం (నిమిషాల్లో) |
పేపర్-1 | జనరల్ స్టడీస్ | 120 | 120 | 120 |
పేపర్-2 | జనరల్ ఆప్టిట్యూడ్ | 120 | 120 | 120 |
*మెయిన్స్ పరీక్ష:
పేపరు | సబ్జెక్ట్ | మార్కులు | సమయం (నిమిషాల్లో) |
ఇంగ్లిష్ | ఇంగ్లిష్ | 150 | 150 |
తెలుగు | తెలుగు | 150 | 150 |
పేపర్-1 | జనరల్ ఎస్సే | 150 | 150 |
పేపర్-2 | హిస్టరీ, కల్చర్ & జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ | 150 | 150 |
పేపర్-3 | పాలిటీ, రాజ్యాంగం, గవర్నెర్స్, లా మరిము ఎథిక్స్ | 150 | 150 |
పేపర్-4 | ఇండియా, ఏపీ ఎకానమీ & డెవలప్‌మెంట్ | 150 | 150 |
పేపర్-5 | సైన్స్ & టెక్నాలజీ | 150 | 150 |
APPSC Group 1 syllabus 2018 – ప్రిలిమనరీ పరీక్ష సిలబస్ 2018:
APPSC Group 1 Prelims Syllabus – Paper 1 2018
చరిత్ర, సంస్కృతి:
సింధూ నాగరికత:
- లక్షణాలు, ప్రదేశాలు, సమాజం, సాంస్కృతిక చరిత్ర, కళలు, మతం. వేదకాలం – మహాజనపథాలు, మతాలు – జైనమతం, బౌద్ధమతం.
– మగధ సామ్రాజ్యం, మౌర్యులు, విదేశీ దండయాత్రలు – వాటి ప్రభావం, కుషాణులు. శాతవాహనులు, సంగం యుగం, శుంగులు, గుప్త సామ్రాజ్యం – వారి పరిపాలన – సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు – కళలు, నిర్మాణశైలి, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం. - పుష్యభూతి వంశం (కనౌజ్), వారి సేవలు, దక్షిణ భారతదేశ రాజ్యాలు – బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, చోళులు, హోయసాలులు, కాకతీయులు, రెడ్డి రాజులు.
- ఢిల్లీ సుల్తానులు, విజయనగర సామ్రాజ్యం, మొగల్ సామ్రాజ్యం, భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం. పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సమాజం, మతం, సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం.
- భారత్‌లో యూరోపియన్ వర్తక సంఘాలు – బెంగాల్, బాంబే, మద్రాస్, మైసూరు, ఆంధ్ర, నిజాంలపై ప్రత్యేక దృష్టితో ఆధిపత్యం కోసం పోరాటం, గవర్నర్ జనరల్స్, వైస్రాయ్‌లు.
- 1857 భారత స్వాతంత్య్ర పోరాటం – పుట్టుక, స్వభావం, కారణాలు, పర్యవసానాలు, ప్రాముఖ్యత, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక దృష్టితో 19వ శతాబ్దంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక, మత సంస్కరణోద్యమాలు, స్వాతంత్య్ర సమరం, భారతదేశం లోపల, వెలుపల విప్లవకారులు. – మహాత్మాగాంధీ ఆలోచనలు, సిద్ధాంతాలు, నియమాలు, తత్వం ముఖ్యమైన సత్యాగ్రహాలు, స్వాతంత్య్ర పోరాటం, స్వాతంత్య్రానంతరం భారతదేశ పునరేకీకరణలో సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్‌ల పాత్ర.
- డా. బి.ఆర్.అంబేడ్కర్, ఆయన జీవితం, రాజ్యంగ నిర్మాణంలో ఆయన పాత్ర, స్వాతంత్య్రానంతరం భారతదేశం – భారతదేశంలో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ.
రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు:
- భారత రాజ్యాంగం: పరిణామం, లక్షణాలు, పీఠిక, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, సవరణలు, ప్రత్యేకమైన అంశాలు, మౌలిక స్వరూపం.
- కేంద్ర, రాష్ట్రాల విధులు, బాధ్యతలు, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు: నిర్మాణం, విధులు, అధికారాలు.
- సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, సవాళ్లు: స్థానిక సంస్థల స్థాయి వరకు అధికారాలు, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, వాటిలో సమస్యలు.
- రాజ్యాంగబద్ధ సంస్థలు, అధికారాలు, విధులు, బాధ్యతలు.
- పంచాయతీరాజ్, ప్రభుత్వ విధానాలు (పబ్లిక్ పాలసీ), పాలన.
- పాలనపై సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం. చట్టబద్ధ, నియంత్రిత, పాక్షిక న్యాయసంస్థలు (క్వాజీ – జ్యుడీషియల్).
- హక్కుల సమస్యలు (మానవ హక్కులు, మహిళా హక్కులు, ఎస్సీ/ ఎస్టీ హక్కులు, బాలల హక్కులు) మొదలైనవి.
- భారత విదేశాంగ విధానం – అంతర్జాతీయ సంబంధాలు – ముఖ్యమైన సంస్థలు, ఏజెన్సీలు, వివిధ వేదికలు – వాటి నిర్మాణం, అధికార పరిధి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమైన విధానాలు, కార్యక్రమాలు.
భారతదేశ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు:
- అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక లక్షణాలు – స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఆర్థిక అభివృద్ధి – ప్రణాళికల విజయాలు – నీతి ఆయోగ్, ఆర్థికాభివృద్ధికి నీతి ఆయోగ్ విధానం – వృద్ధి, పంపిణీ న్యాయం. ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి సూచీ – ప్రపంచంలో భారతదేశ స్థానం – పర్యావరణ క్షీణత. సవాళ్లు – సుస్థిరాభివృద్ధి – పర్యావరణ విధానం.
- జాతీయ ఆదాయం – దానికి సంబంధించిన భావనలు, విభాగాలు – భారతదేశ జాతీయ గణాంకాలు – జనాభా సంబంధిత అంశాలు – పేదరికం, అసమానతలు – వృత్తిపరమైన నిర్మాణం, నిరుద్యోగం – వివిధ ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన పథకాలు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి అంశాలు.
- భారతదేశ వ్యవసాయం – సాగునీటి వ్యవస్థ, నీరు – వ్యవసాయ పెట్టుబడులు – వ్యవసాయ వ్యూహం, వ్యవసాయ విధానం – వ్యవసాయరంగ సంక్షోభం, భూసంస్కరణలు – వ్యవసాయ పరపతి – కనీస మద్దతు ధరలు – పోషకాహార లోపం, ఆహార భద్రత – భారత పారిశ్రామిక రంగం – పారిశ్రామిక విధానం – భారత్‌లో తయారీ స్టార్ట్ అప్, స్టాండ్ అప్ కార్యక్రమాలు – ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక కారిడార్లు – ఇంధన, శక్తి విధానాలు, ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, అంతర్జాతీయ వాణిజ్యం, చెల్లింపుల శేషం – భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థ.
- ఆర్థిక సంస్థలు – భారతీయ రిజర్వ్ బ్యాంకు – ద్రవ్య విధానం, బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్కరణలు – వాణిజ్య బ్యాంకులు, నిరర్ధక ఆస్తులు – ఫైనాన్షియల్ మార్కెట్లు – అస్థిరత్వాలు – స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, సెబీ – భారత పన్నుల వ్యవస్థ, ఇటీవల మార్పులు – వస్తుసేవల పన్ను, వాణిజ్యం, పరిశ్రమలపై దాని ప్రభావం – కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంబంధాలు – ఆర్థిక కమిషన్లు – వనరుల పంపకం, విభజన – ప్రజారుణం, ప్రజావ్యయం – కోశ విధానం, బడ్జెట్.
- 2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు/ ప్రాథమిక లక్షణాలు – సహజ వనరుల సంక్రమణ, రాష్ట్ర ఆదాయంపై విభజన ప్రభావం – నదీజలాల పంపకం వివాదాలు, సాగునీటి వ్యవస్థపై వాటి ప్రభావం – పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు నూతన సమస్యలు – మౌలిక సదుపాయాల అభివృద్ధికి నూతన చొరవలు – విద్యుత్, రవాణా – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇ-గవర్నెన్స్ – వ్యవసాయం, పరిశ్రమలు, సామాజిక రంగాల్లో అభివృద్ధికి విధానాలు, చొరవలు – పట్టణీకరణ, స్మార్ట్ నగరాలు- నైపుణ్యాభివృద్ధి – ఉపాధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు.
- ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం, 2014 – విభజన ఫలితంగా ఏర్పడుతున్న ఆర్థిక సమస్యలు – నూతన రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, ఆదాయ నష్టానికి పరిహారం – వెనుకబడిన జిల్లాల అభివృద్ధి – వైజాగ్ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం విమానాశ్రయం – ఎక్స్‌ప్రెస్ వేలు, పారిశ్రామిక కారిడార్లు మొదలైనవి. ప్రత్యేక హోదా, ప్రత్యేక సహాయం – వివాదం – ప్రభుత్వ వైఖరి, చర్య.
భూగోళశాస్త్రం:
- సాధారణ భూగోళశాస్త్రం: సౌర వ్యవస్థలో భూమి, భూభ్రమణం, కాలం, రుతువులు, భూ అంతర్భాగం, ముఖ్యమైన భూ స్వారూపాలు, వాటి లక్షణాలు. వాతావరణం – నిర్మాణం, కూర్పు, శీతోష్ణస్థితి విభాగాలు, కారకాలు, వాయు ద్రవ్య రాశులు, వాయు సరిహద్దులు (ఫ్రంట్స్), వాతావరణ ప్రతిబంధకాలు, శీతోష్ణస్థితి మార్పు. మహాసముద్రాలు: భౌతిక, రసాయన, జీవ సంబంధ లక్షణాలు, జల సంబంధ విపత్తులు, సముద్ర, ఖండాంతర వనరులు.
- భౌతిక భూగోళశాస్త్రం: ప్రపంచం, భారత్, ఆంధ్రప్రదేశ్. ముఖ్యమైన భౌతిక విభాగాలు, భూకంపాలు, భూపాతాలు, సహజ నీటిపారుదల, వాతావరణ మార్పులు, ప్రాంతాలు, రుతుపవనాలు, సహజ ఉద్భిజ సంపద, జాతీయ పార్కులు, సంరక్షణ కేంద్రాలు, ముఖ్యమైన నేలల రకాలు, శిలలు, ఖనిజాలు.
- సామాజిక, భౌగోళికశాస్త్రం: ప్రపంచం, భారత్, ఆంధ్రప్రదేశ్: పంపిణీ, సాంద్రత, వృద్ధి, లింగ నిష్పత్తి, అక్షరాస్యత, వృత్తి స్వరూపం, ఎస్సీ, ఎస్టీ జనాభా, గ్రామీణ – పట్టణ విభాగాలు, జాతులు, గిరిజన, మత, భాషా సమూహాలు, పట్టణీకరణ, వలసలు, మెట్రోపాలిటన్ ప్రాంతాలు.
- ఆర్థిక భౌగోళికశాస్త్రం: ప్రపంచం, భారత్, ఆంధ్రప్రదేశ్: ప్రధాన ఆర్థిక రంగాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, వాటి ముఖ్య లక్షణాలు, మౌలిక పరిశ్రమలు – వ్యవసాయ, ఖనిజ, అటవీ, ఇంధన, మానవ ఆధారిత పరిశ్రమలు, రవాణా, వాణిజ్యం, పద్ధతులు – సమస్యలు.
Download APPSC Group 1 Prelims Syllabus in English – 2018
APPSC Group 1 Prelims Syllabus in Telugu- Paper 2 2018
జనరల్ మెంటల్ ఎబిలిటీ, సైకలాజికల్ ఎబిలిటీస్
- లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ
- నంబర్ సిరీస్, కోడింగ్- డీకోడింగ్.
- సంబంధాలపై సమస్యలు.
- ఆకారాలు, ఉప విభాగాలు, వెన్ చిత్రాలు
- గడియారాలు, క్యాలెండర్, వయసులపై సమస్యలు.
- సంఖ్యా వ్యవస్థ, ఆర్డర్ ఆఫ్ మాగ్నిట్యూడ్
- నిష్పత్తి, శాతం, అంక గణితంలో వ్యత్యాసాలు
- కేంద్ర స్థానపు కొలతలు, భారిత సగటుతో కలిపి, సగటు, మధ్యగతం, బాహుళకం
- ఘాతాలు – ఘాతాంకాలు, వర్గం, వర్గమూలం, ఘనమూలం, గసాభా, కసాగు
- శాతాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, లాభ నష్టాలు.
- కాలం – పని, కాలం – దూరం, వేగం – దూరం.
- సులువైన జ్యామితీయ ఆకారాల వైశాల్యం, చుట్టుకొలత, గోళం యొక్క ఘనపరిమాణం, ఉపరితల వైశాల్యం, శంకువు, స్తూపం, ఘనాలు, దీర్ఘ ఘనాలు.
- సాధారణ జ్యామితీయ చిత్రాలు, రేఖలు, కోణాలు, సమాంతర రేఖల విలోమ లక్షణాలు, త్రిభుజ లక్షణాలు, చతుర్భుజం, దీర్ఘ చతురస్రం, సమాంతర చతుర్భుజం, రాంబస్.
- బీజగణితం – బాడ్‌మాస్ (BODMAS) పద్ధతి, అసహజ గుర్తుల సూక్ష్మీకరణ.
- సమాచార అన్వయం (డేటా ఇంటర్‌ప్రిటేషన్), సమాచార విశ్లేషణ (డేటా అనాలసిస్), సమాచార సంపూర్ణత్వం (డేటా
సఫిషియెన్సీ), సంభావ్యత భావనలు. - ఉద్వేగాల ప్రజ్ఞ (ఎమోషనల్ ఇంటెలిజెన్స్): భావోద్వేగాల అవగాహన, విశ్లేషణ, ఉద్వేగాల ప్రజ్ఞ – వివిధ కోణాలు,
భావోద్వేగాలను తట్టుకోగల వ్యక్తిత్వం, సహానుభూతి (ఎంపతీ), ఒత్తిడిని అధిగమించడం - సామాజిక ప్రజ్ఞ, ముఖాముఖి వ్యక్తీకరణ: నిర్ణయాలు తీసుకోవడం, తార్కిక ఆలోచన, సమస్యా పరిష్కారం, వ్యక్తిత్వాన్నిఅంచనా వేయడం.
సైన్స్ & టెక్నాలజీ (శాస్త్ర, సాంకేతిక రంగాలు)
- శాస్త్ర, సాంకేతిక రంగాలు: శాస్త్ర- సాంకేతిక రంగాల పరిధి, స్వభావం, నిత్యజీవితంలో శాస్త్ర, సాంకేతిక రంగాల
అనువర్తన, నూతన ఆవిష్కరణలు, శాస్త్ర-సాంకేతిక రంగాలపై జాతీయ విధానాలు. నూతన ఆవిష్కరణలు, శాస్త్ర-సాంకేతిక రంగాల అనుసంధానాన్ని ప్రోత్సహిస్తున్న భారతదేశంలోని సంస్థలు. వాటి కార్యకలాపాలు, సాధించిన ఫలితాలు. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తల సేవలు. - సమాచార, భావ ప్రసార సాంకేతికత (ఐసీటీ): స్వభావం, పరిధి, దైనందిన జీవితంలో ఐసీటీ, ఐసీటీ- పరిశ్రమలు, ఐసీటీ- పరిపాలన, ఐసీటీ- వినియోగాన్ని ప్రోత్సహించే వివిధ ప్రభుత్వ పథకాలు, ఇ-గవర్నెన్స్ కార్యక్రమాలు, సేవలు, అంతర్జాల విధివిధానాలు, జాతీయ సైబర్ భద్రత అంశాలు, జాతీయ సైబర్ క్రైమ్ విధానం.
- అంతరిక్ష, రక్షణ రంగాల్లో సాంకేతికత: భారత అంతరిక్ష కార్యక్రమాల అభివృద్ధి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), దాని కార్యకలాపాలు, విజయాలు, వివిధ ఉపగ్రహ కార్యక్రమాలు, టెలీకమ్యూనికేషన్ ఉపగ్రహాలు, ఇండియన్ రీజనల్ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ (ఐ.ఆర్.ఎన్.ఎస్.ఎస్.), ఇండియన్ రిమోట్ నెన్సింగ్ (ఐ.ఆర్.ఎస్.) శాటిలైట్స్, రక్షణ ఉపగ్రహాలు, విద్యా సంబంధ ఉపగ్రహాలు (ఎడ్యుశాట్), రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) – దార్శనికత (విజన్), కార్యచరణ ప్రణాళిక (మిషన్), కార్యకలాపాలు.
- శక్తి అవసరాలు, సామర్థ్యం: భారతదేశ ప్రస్తుత ఇంధన అవసరాలు – కొరత, దేశంలో శక్తి వనరులు – వాటిపై ఆధారపడుతున్న విధం, భారతదేశంలో ఇంధన విధానం- ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు. సౌరశక్తి, పవన శక్తి, అణుశక్తి.
- పర్యావరణ శాస్త్రం: పర్యావరణ అంశాలు, సమస్యలు: చట్టపరమైన అంశాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు విధానాలు, ఒప్పందాలు: జీవ వైవిధ్యం – ప్రాముఖ్యత, సంబంధిత అంశాలు: వాతావరణ మార్పు. అంతర్జాతీయంగా తీసుకున్న చొరవలు (విధానాలు, ప్రోటోకాల్స్), భారతదేశ నిబద్ధత; అడవులు, వన్యప్రాణులు – దేశంలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు చేసిన చట్టాలు; పర్యావరణ సంబంధిత అపాయాలు, కాలుష్యం, కర్బన ఉద్గారం, గ్లోబల్ వార్మింగ్. వాతావరణ మార్పు, విపత్తు నిర్వహణపై జాతీయ కార్యాచరణలు. బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ; స్వభావం, పరిధి, దాని అనువర్తనాలు, నైతిక, సామాజిక, న్యాయపరమైన సమస్యలు. ప్రభుత్వ విధానాలు. జన్యు (జెనెటిక్) ఇంజినీరింగ్; సంబంధిత అంశాలు మానవ జీవితంపై దాని ప్రభావం. ఆరోగ్యం- పర్యావరణం.
జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
APPSC Group 1 Mains Syllabus in Telugu:
APPSC Group 1 Mains Syllabus – Paper 1
Appsc Group-I Mains paper 1 syllabus in teluguAPPSC Group 1 Mains Syllabus – Paper 2
Appsc Group-I Mains paper 2 syllabus in teluguAPPSC Group 1 Mains Syllabus – Paper 3
Appsc Group 1 Mains paper 3 syllabus in teluguAPPSC Group 1 Mains Syllabus – Paper 4
Appsc Group 1 Mains paper 4 syllabus in teluguAPPSC Group 1 Mains Syllabus – Paper 5
Appsc Group 1 Mains paper 5 syllabus in teluguDownload APPSC Group 1 Mains Syllabus in English PDF
Also, find APPSC Group 1 Prelims & Group 2 2018 Prelims and Mains Syllabus in Telugu by Eenadu.
11 thoughts to “Download APPSC Group 1 Syllabus 2018 in Telugu PDF”