APPSC GROUP 2 PRELIMS (SCREENING TEST)

APPSC GROUP 2  PRELIMS-SCREENING TEST

APPSC GROUP 2  PRELIMS-SCREENING TEST

 

APPSC GROUP 2 PRELIMS-SCREENING TEST

APPSC Group 2 2017 ఫలితాల్లో toppers గా  నిలిచిన మా అభ్యర్థులకు శుభాకాంక్షలు. 20 కి పైగా ర్యాంకులను సాధించి ఉద్యోగం పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అదే ఉత్సాహం తో 2018 APPSC GROUP 2  PRELIMS TEST కి సిలబస్ ను chapterwise Tests ను సిద్ధం చేసాం.

విజయం ఒక్కసారిగా వచ్చి వాలదు, Notification వచ్చాక కాదు రాకముందే Preparation ప్రారంభించడం ఉత్తమం.

APPSC GROUP 2  PRELIMS Chapterwise tests and Grand tests are starting from 24th Dec 2017 in both Telugu and English medium.

APPSC GROUP 2  PRELIMS-SCREENING TEST (ENGLISH /TELUGU MEDIUM) Time Table:

S.No Exam name Exam Date Number of
Questions
Duration
(min)
1 Prelims Test 1 10-Jan-2018 150 150
2 Prelims Test 2 21-Jan-2018 150 150
3 Prelims Test 3 28-Jan-2018 150 150
4 Prelims Test 4 04-Feb-2018 150 150
5 Prelims Test 5 11-Feb-2018 150 150
6 Prelims Test 6 18-Feb-2018 150 150
7 Prelims Test 7 25-Feb-2018 150 150
8 Prelims Test 8 04-Mar-2018 150 150
9 Prelims Test 9 11-Mar-2018 150 150
10 Prelims Test 10 21-Mar-2018 150 150

For Package, Registration Click Here

Prelims Syllabus- Test1

AP GR2 Chapter(Federal System in India) TEST 1 CONDUCTED on 10/01/2018. Sample questions with explanation Register here to access full question paper now vyoma.net/exams/appsc

1) ( qid – 47278 ) రాజ్యాంగ సభలో రాజ్యాంగ ముసాయిదాను ప్రవేశపెడుతూ డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ భారత రాజ్యాంగం ఈ క్రింది ఏ రూపం కలిగి ఉంటుందని ప్రకటించారు?[Ans: d]
(A) ఏకకేంద్ర రూపం  (B) సామ్యవాద రూపం (C) నియంత్రిత్వ రూపం  (D) సమాఖ్య రూపం
వివరణ: రాజ్యాంగ సభలో ముసాయిదాను ప్రవేశపెడుతూ డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ భారత రాజ్యాంగం సమాఖ్య రూపం కలిగి ఉంటుందని ప్రకటించారు. ఈ సమాఖ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ, తమ అధికార పరిధి కలిగి ఉంటాయని, రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల ఆధారంగా పాలన సాగిస్తాయని ప్రకటించారు.
2) ( qid – 47279 ) భారత సమాఖ్య వ్యవస్థ గురించి సరి అయిన దానిని గుర్తించుము?
ఎ) భారత సమాఖ్య రాష్ట్రాల ఒప్పందంతో ఏర్పడినది.
బి) భారత సమాఖ్యలోని రాష్ట్రాలకు విడిపోవడానికి స్వేచ్ఛలేదు.
[Ans: b]
(A) ఎ సరి అయినది  (B) బి సరి అయినది  (C) ఎ,బి సరి అయినది  (D) ఎ,బి సరి అయినది కాదు
వివరణ: భారత సమాఖ్యలో ముఖ్యముగా ఈ క్రింది లక్షణాలు కలవు.
1) భారత సమాఖ్య రాష్ట్రాల ఒప్పందంతో ఏర్పడలేదు
2) భారత సమాఖ్యలో రాష్ట్రాలకు విడిపోవడానికి స్వేచ్ఛలేదు.
భారత రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగించకుండానే బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది.
3) ( qid – 47280 ) మనదేశంలో కేంద్ర, రాష్ట్రాలు అను రెండు ప్రభుత్వాలు దేని ద్వారా ఏర్పడతాయి?[Ans: c]
(A) మనదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంప్రదాయంలో భాగంగా ఏర్పడ్డాయి. (B) మనదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్రిటీష్‌ వారివల్ల ఏర్పడ్డాయి. (C)మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డాయి. (D) మనదేశంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా ఏర్పడినది, కేంద్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
వివరణ: మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బ్రిటీష్‌ వారు 1919 చట్టంలోనే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అనే జాబితాలతో కేంద్ర, రాష్ట్రాలకు విధులను అధికారాలను కల్పించారు కాని మన రాజ్యాంగ నిర్మాతలు వద్దు అనుకుంటే వాటిని రద్దు చేసేవారు అంతేకాకుండా అదే బ్రిటీష్‌ వారు అందించిన పార్లమెంటరీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కేంద్ర, రాష్ట్రము అనే రెండు ప్రభుత్వాలను రాజ్యాంగము ద్వారా ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డాయి అనే ఆప్సన్స్‌లో లేకుంటే బ్రిటీష్‌ వారి వల్ల ఏర్పాడ్డాయి అనేది సమాధానం అవుతుంది.
4) ( qid – 47281 ) భారత రాజ్యాంగంలోని ఎక్కువ భాగాలను ఈ క్రింది ఏ మెజారిటీ ద్వారానే సవరిస్తారు?[Ans: b]
(A) సాధారణ మెజారిటీ పద్దతి (B) ప్రత్యేక మెజారిటి (2/3) పద్దతి (C) ప్రత్యేక మెజారిటి (2/3) పద్దతి మరియు మెజార్టీ రాష్ట్రాలు ఆమోదం (D) చెప్పలేము
వివరణ: భారత రాజ్యాంగంలోని చాలా భాగాలను ప్రత్యేక మెజారిటీ (2/3) ద్వారానే సవరిస్తారు, కనుక భారత రాజ్యాంగం ధృడమైనదిగా చెప్పవచ్చు.
5) ( qid – 47283 ) భారత రాజ్యాంగం రాజ్యాంగంను సంరక్షించే బాధ్యతను ఎవరికి అప్పగించడం జరిగింది?[Ans: a]
(A) న్యాయ వ్యవస్థకు (B) పార్లమెంటుకు (C) రాష్ట్రపతికి  (D) భారత ప్రజలకు
వివరణ: భారత రాజ్యాంగం రాజ్యాంగంను సంరక్షించే బాధ్యతను న్యాయ వ్యవస్థకు అప్పగించడం జరిగింది.

Prelims Syllabus- Test2:

AP GR2 Chapter(Fundamental Rights) TEST 2 CONDUCTED on 21/01/2018. Sample questions with explanation

Register here to access full question paper now vyoma.net/exams/appsc

1)  స్వేచ్ఛా, సమానత్వాలలో జన్మించిన మానవుడు జీవితాంతం వాటితో కొనసాగుతాడు అని ప్రకటించినది.[Ans: b]
(A) బ్రిటన్‌ – మాగ్నా కార్టా (B) అమెరికా – బిల్‌ ఆఫ్‌ రైట్స్‌ (C) ఫ్రెంచ్‌ – హక్కుల ప్రకటన (D) ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కుల ప్రకటన
వివరణ: అమెరికా మౌళిక రాజ్యాంగంలో హక్కుల ప్రస్తావన లేదు. అయితే సుమారు పది రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించి అందులో  భాగంగా బిల్‌ ఆఫ్‌ రైట్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు. అమెరికా  రాజ్యాంగ సభ 15 డిసెంబర్‌ 1791 లో ఈ హక్కులను ధృవీకరించింది స్వేచ్ఛా, సమానత్వాలతో జన్మించిన మానవుడు జీవితాంతం వాటితో కొనసాగుతాడు అని ప్రకటించింది.
2) ( qid – 47000 ) హక్కులను రాజ్యాంగంలో చేర్చి ఒక నిర్ధిష్ట స్వరూపాన్ని కల్పించేందుకు రాజ్యాంగ పరిషత్‌ 24 జనవరి 1947 న వల్లభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన ఒక సలహా సంఘాన్ని నియమించగా ఆ సలహా సంఘం ప్రాథమిక హక్కులను పరిశీలనకు ఎవరి అధ్యక్షతన ఒక ఉప సంఘాన్ని నియమించింది?[Ans: b]
(A) బి.ఎన్‌. రావు  (B) జె.బి. కృపలాని (C) జవహర్‌లాల్‌ నెహ్రూ  (D) ఎం.ఎ. అన్సారీ
వివరణ: హక్కులను రాజ్యాంగంలో చేర్చి ఒక నిర్దిష్ట స్వరూపాన్ని కల్పించేందుకు రాజ్యాంగ పరిషత్‌ 24 జనవరి 1947 న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన 54 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని నియమించింది సలహా సంఘం ప్రాథమిక హక్కులను  పరిశీలనకు 12 ఫిబ్రవరి 1947 న ఆచార్య జె.బి. కృపలాని అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో ఒక ఉప సంఘాన్ని నియమించింది. ఈ యొక్క ఉపసంఘం సూచన మేరకు రాజ్యాంగ పరిషత్‌ సలహాదారు బి.ఎన్‌.రావు హక్కులపై ఒక ముసాయిదాను తయారు చేశారు.
3) ( qid – 47001 ) స్వతహాగా అమలులోకి రాని ప్రాథమిక హక్కులను గుర్తించుము?
ఎ) నిబంధన 17 క్రింద హక్కులు      బి) నిబంధన 23 క్రింద హక్కులు
సి) నిబంధన 20 క్రింద హక్కులు      డి) నిబంధన 24 క్రింద హక్కులు[Ans: c]
(A) ఎ,బి సరి అయినవి (B) బి,సి,డి సరి అయినవి (C) ఎ,బి,డి సరి అయినవి (D) ఎ,బి,సి,డి సరి అయినవి
వివరణ: ప్రాథమిక హక్కులన్ని స్వతహాగా అమలులోకి వస్తాయి కాని నిబంధన 17,23,24 లో ప్రస్తావించిన హక్కులు స్వతహాగా అమలులోకిరావు వాటి అమలుకోసం పార్లమెంట్‌ ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
నిబంధన 17ను అమలు చేయుటకు పార్లమెంట్‌ అస్పృశ్యతా నిషేధ చట్టం-1955 ను చేసింది. 1976 లో ఈ చట్టాన్ని సమగ్రంగా సవరించి పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పేరు మార్చారు.
నిబంధన 23 ను అమలు చేయుటకు 1976 లో పార్లమెంట్‌ వెట్టి చాకిరి నిషేధ చట్టంను చేసింది. అదే విధంగా 1956 లో  పార్లమెంట్‌ అశ్లీల, అసభ్య వ్యాపార నిరోధక చట్టాన్ని చేసింది.
నిబంధన 24ను అమలు చేయుటకు ఫ్యాక్టరీ చట్టం-1948, గనుల చట్టం-1958, బీడీ మరియు సిగరెట్ల కార్మికుల చట్టం-1966
బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం-1986
బాల కార్మిక హక్కులు, కమీషన్ల చట్టం-2008 ను చేసింది.
20వ నిబంధన స్వతహాగా అమల్లోకి వస్తుంది, జాతీయ అత్యవసర పరిస్థితులలో కూడా రద్దు చేయలేరు.
4) ( qid – 47002 ) ప్రాథమిక హక్కులు ఈ క్రింది వారిలో ఎవరి చర్యలకు వ్యతిరేకంగా గుర్తించబడ్డాయి?[Ans: d]
(A) ప్రైవేట్‌ కంపెనీలు  (B) ప్రైవేటు వ్యక్తులు (C) విదేశీయలు  (D) ప్రభుత్వం
వివరణ: ప్రాథమిక హక్కులు రాజ్యాంగ లేదా ప్రభుత్వ చర్యలను వ్యతిరేకంగా గుర్తించబడ్డాయి.
5) ( qid – 47003 ) న్యాయ స్థానాలు రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి అని సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ కేసులో తీర్పు చెప్పింది?[Ans: a]
(A) ఏ.ఆర్‌. అంతులే వర్సెస్‌ ఆర్‌.ఎస్‌. నాయక్‌ (B) అజయ్‌ సహాయ్‌ వర్సెస్‌ ఖలీద్‌ ముజీద్‌ (C) చిరంజిత్‌లాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (D) బెన్నెట్‌ కోల్‌మెన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా
వివరణ: న్యాయ స్థానాలు రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి అని సుప్రీంకోర్టు ఏ.ఆర్‌. అంతులే వర్సెస్‌ ఆర్‌.ఎస్‌. నాయక్‌ కేసులో తీర్పు చెప్పింది.

Prelims Syllabus- Test3
Prelims Syllabus- Test4
Prelims Syllabus- Test5
Prelims Syllabus- Test6
Prelims Syllabus- Test7
Prelims Syllabus- Test8
Prelims Syllabus- Test9
Prelims Syllabus- Test10

APPSC GROUP 2  SCREENING TEST Syllabus PDF in Telugu

Click Here PDF Download

APPSC GROUP 2  SCREENING TEST Syllabus in English

Click Here PDF Download

TRY our FREE APPSC GROUP2 , GROUP3 MOCK TESTS Click here