appsc group-3 mains model questions and answers

గ్రూప్‌-3 మెయిన్స్‌, 21-05-2017, పంచాయతీ కార్యదర్శి ప్రధాన పరీక్షా మాదిరి పరీక్ష
1. ఆంధ్రప్రదేశ్‌లో శ్రామిక జనాభాలో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం ?
ఎ. 57.11 శాతం బి. 59.25 శాతం
సి. 62.36 శాతం డి. 64.66 శాతం
2. 2015-16 సంవత్సరానికి నవ్యాంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం వాటా ?
ఎ. 23 శాతం బి. 46 శాతం
సి. 17 శాతం డి. 29 శాతం
3. 2015-16 సంవత్సరానికి గాను భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం ?
ఎ. 52 శాతం బి. 57 శాతం
సి. 60 శాతం డి. 74 శాతం
4. ప్రాథమిక రంగానికి సంబంధించన అంశం ?
ఎ. చేపలు పట్టడం బి. అడవులు
సి. నిర్మాణాలు డి. పాడిపరిశ్రమ
5. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అడవుల శాతం ?
ఎ. 20.5 శాతం బి. 22.5 శాతం
సి. 23.2 శాతం డి. 24.2 శాతం
6. అటవీ విస్తీర్ణంలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ?
ఎ. వైఎస్‌ఆర్‌. కడప బి. అనంతపురం
సి. విశాఖపట్నం డి. కర్నూలు
7. ప్రస్తుతం రాష్ట్రంలో బీడుభూములు ఎక్కువగా ఉన్న జిల్లా ?
ఎ. కడప బి. చిత్తూరు
సి. శ్రీకాకుళం డి. అనంతపురం
8. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నికర సేద్య భూమి ?
ఎ. 38.31 శాతం బి. 62.35 శాతం
సి. 64.67 శాతం డి. 69.09 శాతం
9. 2014-15 సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఆహారధాన్యాల పంట విస్తీర్ణం ? (లక్షల హెక్టార్లలో)
ఎ. 41.31 లక్షల హెక్టార్లు
బి. 39.08 లక్షల హెక్టార్లు
సి. 35.02 లక్షల హెక్టార్లు
డి. 44.07 లక్షల హెక్టార్లు
10. 2015-16 సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఆహారధాన్యాల పంట విస్తీర్ణం ?
ఎ. 44.07 లక్షల హెక్టార్లు
బి. 35.02 లక్షల హెక్టార్లు
సి. 41.30 లక్షల హెక్టార్లు
డి. 39.02 లక్షల హెక్టార్లు
11. 2015-16 సంవత్సరానికి గాను ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఏ పంట ఉత్పత్తిలో అత్యధిక పెరుగుదల కనిపించింది ?
ఎ. నూనె గింజలు బి. గోధుమలు
సి. సుగంధ ద్రవ్యాలు డి. పప్పుధాన్యాలు
12. 2014-15 సంవత్సరానికి నీటిపారుదల వసతి కలిగిన భూమి శాతం ?
ఎ. 40.96 శాతం బి. 39.37 శాతం
సి. 29.27 శాతం డి. 44.71 శాతం
13. అన్నిరకాల నీటిపారుదల వసతులూ ఎక్కువగా
కలిగిన జిల్లా ?
ఎ. పశ్చిమగోదావరి బి. ప్రకాశం
సి. కృష్ణా డి. గుంటూరు
14. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సగటు కమత పరిమాణం ఎక్కువ కలిగిన జిల్లా ?
ఎ. కర్నూలు బి. అనంతపురం
సి. చిత్తూరు డి. కడప
15. అన్నిరకాల పశుసంపద ఎక్కువగా ఉన్న జిల్లా ?
ఎ. గుంటూరు బి. అనంతపురం
సి. చిత్తూరు డి. పశ్చిమగోదావరి
16. గొర్రెలు ఎక్కవగా ఉన్న జిల్లా ?
ఎ. అనంతపురం బి. చిత్తూరు
సి. గుంటూరు డి. కర్నూలు
17. మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ స్థానం ?
ఎ. ప్రథమ స్థానం బి. ద్వితీయ స్థానం
సి. ఆరో స్థానం డి. పదో స్థానం
18. ఆంధ్రప్రదేశ్‌ భూగరిష్ట పరిమితిపై చట్టం చేసిన
సంవత్సరం ?
ఎ. 1951వ సంవత్సరం బి. 1961వ సంవత్సరం
సి. 1973వ సంవత్సరం డి. 1977వ సంవత్సరం
19. కనీస మద్దతు ధరను ఎవరు ప్రకటిస్తారు ?
ఎ. కేంద్ర ప్రభుత్వం బి. రాష్ట్ర ప్రభుత్వం
సి. స్థానిక ప్రభుత్వాలు డి. ఎ మరియు బి
20. పుష్కర ఎత్తిపోతల పథకం ఏ జిల్లాకి సంబంధించింది ?
ఎ. తూర్పుగోదావరి బి. కర్నూలు
సి. చిత్తూరు డి. గుంటూరు
21. చిన్నతరహా పరిశ్రమలను పెట్టుబడి ఆధారంగా వర్గీకరించే విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
ఎ. 1956వ సంవత్సరం బి. 1973వ సంవత్సరం
సి. 1977వ సంవత్సరం డి. 1980వ సంవత్సరం
22. సూక్ష్మ పరిశ్రమలు అనే నూతన వర్గాన్ని ఏ సంవత్సరం నుంచి విభజించారు ?
ఎ. 1967వ సంవత్సరం బి. 1973వ సంవత్సరం
సి. 1975వ సంవత్సరం డి. 1977వ సంవత్సరం
23. చిన్నతరహా పరిశ్రమలు ఎక్కువగా వీటికి చెందినవి ?
ఎ. చేనేత వస్త్రాలు బి. హస్తకళలు
సి. రైస్‌ మిల్లులు డి. రసాయన పరిశ్రమలు
24. కుటీర పరిశ్రమల బోర్డును ఏ సంవత్సరంలో స్థాపించారు ?
ఎ. 1947వ సంవత్సరం బి. 1952వ సంవత్సరం
సి. 1953వ సంవత్సరం డి. 1956వ సంవత్సరం
25. ఖనిజాల లభ్యతలో ఆంధ్రప్రదేశ్‌ స్థానం ?
ఎ. నాల్గో స్థానం బి. ఐదో స్థానం
సి. ఆరో స్థానం డి. ఏడో స్థానం
26. ఆంధ్రప్రదేశ్‌ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఆర్గనేజేషన్‌ (ఎపిసిఓ-ఆప్కో) ను ఏర్పాటు చేసిన సంవత్సరం ?
ఎ. 1976వ సంవత్సరం బి. 1977వ సంవత్సరం
సి. 1978వ సంవత్సరం డి. 1979వ సంవత్సరం
27. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జెజ్‌ల సంఖ్య ?
ఎ. 16 సెజ్‌లు బి. 17 సెజ్‌లు
సి. 18 సెజ్‌లు డి. 19 సెజ్‌లు
28. 2006వ సంవత్సరంలో చేయబడిన ఎంఎస్‌ఎంఈఎ (మైక్రో-స్మాల్‌-మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ యాక్ట్‌)ను అమలు చేయడానికి కారణమైన కమిషన్‌ ?
ఎ. మీరాసేథ్‌ కమిటీ బి. అర్జున్‌సేన్‌ గుప్తా కమిటీ
సి. జె.కె.నాయక్‌ కమిటీ డి. కార్వె కమిటీ
29. సూక్ష్మ/ టైనీ పరిశ్రమల యొక్క పెట్టుబడి పరిమితి ?
ఎ. 25 లక్షలు బి. 75 లక్షలు
సి. 90 లక్షలు డి. 100 లక్షలు
30. ఆంధ్రప్రదేశ్‌ నూతన సంస్కరణలు (ఆర్థిక సంస్కరణలు)
ఏ సంవత్సరం నుంచి అమలు చేశారు ?
ఎ. 1991వ సంవత్సరం బి. 1992వ సంవత్సరం
సి. 1994వ సంవత్సరం డి. 1996వ సంవత్సరం
31. అబిద్‌ హుస్సేన్‌ కమిషన్‌ దీనికోసం వేయబడింది ?
ఎ. భారీ పరిశ్రమలు
బి. చిన్నతరహా పరిశ్రమలు
సి. మధ్యతరహా పరిశ్రమలు
డి. సేవా రంగం
32. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక అభివృద్ధి సంస్థలో (ఎపిఐడిసి)లో కేంద్ర ప్రభత్వు వాటా శాతం ?
ఎ. 74 శాతం బి. 99 శాతం
సి. ఒక్క శాతం డి. 26 శాతం
33. దేశంలో చిన్నతరహా పరిశ్రమల సంఖ్య ఎక్కువగా
ఉన్న రాష్ట్రం ?
ఎ. ఉత్తరప్రదేశ్‌ బి. మహారాష్ట్ర
సి. గుజరాత్‌ డి. తమిళనాడు
34. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తన సంస్థలో కేంద్రం వాటా ?
ఎ. 60 శాతం బి. 40 శాతం
సి. 39 శాతం డి. ఒక్క శాతం
35. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చిన్నతరహా పరిశ్రమ యూనిట్లు ఎక్కువగా కింది వర్గానికి చెందినాయి ?
ఎ. ఆహార వస్తు ఉత్పత్తులు
బి. రిపేర్లు, సేవలు
సి. ఖనిజాధార వస్తువులు, పరిశ్రమలు
డి. ఇంజనీరింగ్‌ పరిశ్రమ
36. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ‘ఎపి సింగిల్‌ డెస్క్‌ పాలసీ’ అమలులోకి వచ్చిన సంవత్సరం ?
ఎ. 2013వ సంవత్సరం బి. 2014వ సంవత్సరం
సి. 2015వ సంవత్సరం డి. 2016వ సంవత్సరం
37. చిన్నతరహా యూనిట్లు ఎక్కువగా ఉన్న జిల్లా ?
ఎ. విశాఖపట్నం బి. గుంటూరు
సి. కృష్ణా డి. నెల్లూరు
38. చిన్నతరహా యూనిట్లు తక్కువగా ఉన్న జిల్లా ?
ఎ. శ్రీకాకుళం బి. విజయనగరం
సి. ప్రకాశం డి. చిత్తూరు
39. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం ?
ఎ. 2005వ సంవత్సరం బి. 2006వ సంవత్సరం
సి. 2007వ సంవత్సరం డి. 2008వ సంవత్సరం
40. ఖాయిలా పడిన పరిశ్రమ అనగా ?
ఎ. గత సంవత్సరం ఉత్పత్తిలో 50 శాతం ప్రస్తుత ఉత్పత్తిలో తగ్గడం
బి. గత రెండు సంవత్సరాల నుంచి రుణభారం సంస్థ ఆస్తులను మించిపోవడం
సి. డిలే పేమెంట్స్‌ 45 రోజులు దాటిపోవడం
డి. పైవన్నీ

సమాధానాలు :
1.సి, 2.డి, 3.బి, 4.సి, 5.బి, 6.ఎ, 7.డి, 8.ఎ, 9.బి, 10.సి, 11.డి, 12.సి, 13.డి, 14.బి, 15.డి, 16.ఎ, 17.బి, 18.సి, 19.ఎ, 20.ఎ, 21.ఎ, 22.డి, 23.సి, 24.ఎ, 25.సి, 26.ఎ, 27.డి, 28.బి, 29.ఎ, 30.డి, 31.బి, 32.సి, 33.డి, 34.సి, 35.ఎ, 36.సి, 37.ఎ, 38.ఎ, 39.డి, 40.డి.