Appsc group 3 Most important Questions
1Q) ఈ క్రింది వాటిలో సరైనది ఏది?
1. World Heritage Day – April 18న, థీమ్ “Rural Development” తో నిర్వహించారు.
2. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని – ఏప్రిల్ 22న, థీమ్ “Protect our Species” తో నిర్వహించారు.[Ans: b]
(A) 1 మాత్రమే (B) 2 మాత్రమే (C) 1, 2 (D) ఏదికాదు
వివరణ: World Heritage Day – 2019 థీమ్ “Rural Landscape”.
2Q) 14వ ఆర్థిక సంఘం పన్నులను రాష్ట్రాలకు పంచడానికి తీసుకున్న అంశాలలో దేనికి ఎక్కువ భారం ఇవ్వడం జరిగింది?[Ans: c]
(A) 1971 ప్రకారం జనాభా (B) 1971 – 2011 ల మధ్య జనాభా పెరుగుదల (C) ఆర్ధిక అంశాలు (D) భౌగోళిక విస్తీర్ణం
వివరణ: 1971 ప్రకారం జనాభా – 17.5%
1971 – 2011 ల మధ్య జనాభా పెరుగుదల – 10%
ఆర్థిక అంశాలు (50%)
భౌగోళిక విస్తీర్ణం (15%)
3Q) ఈ క్రింది వానిలో సరైంది ఏది?
1) విశాఖ జిల్లా అరకులో పండించే అరబికా రకం కాఫీకి భౌగోళిక గుర్తింపు లభించింది.
2) విశాఖ ఏజెన్సీ లో పండుతున్న “అరబికా కాఫీ 2009-10 సంవత్సరం నుంచి వరుసగా 5 సార్లు “పైన్ కప్ ఆఫ్ కాఫీ” అవార్డును సొంతం చేసుకుంది.
3) అరకు కాఫీ ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఎగుమతి అవుతుంది.[Ans: a]
(A) 1, 2, 3 (B) 1, 2 (C) 1, 3 (D) 2, 3
వివరణ: భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు India లో 1st G.I. డార్జిలింగ్ టీ
AP లో 1st G.I. శ్రీకాళహస్తి కలంకారీ
1) కొండపల్లి బొమ్మలు 2007-08
2) మచిలీపట్నం కలంకారీ
3) ఉప్పాడ జమ దాని చీరలు
4) AP తోలు బొమ్మలు
5) గుంటూరు సన్న మిరపకాయలు
2) తిరుపతి లడ్డు
7) వెంకటగిరి చీరలు
8) బొబ్బిలి వీణ
9) మంగళగిరి చీరలు
10) ధర్మవరం చీరలు
11) బండారు లడ్డు
4Q) ఈ క్రింది వానిలో సరికానిది ఏది?
1) శిశుమర్ తరగతి జలాంతర్గామి ఇవి రష్యా నుంచి దిగుమతి చేసుకోబడినవి.
2) INS కల్వరి (ఎస్ – 50) ఇది P – 75 ప్రాజెక్ట్ లో భాగంగా రూపొందించబడుతున్న మొదటి సబ్ మెరైన్[Ans: a]
(A) 1 మాత్రమే (B) 2 మాత్రమే (C) 1 & 2 (D) None
వివరణ: శిశుమర్ తరగతి – ఇవి జర్మనీ నుంచి దిగుమతి చేసుకోబడినవి.
INS కల్వరి – ఇది P – 75 ప్రాజెక్ట్ లో భాగంగా రూపొందించబడుతున్న మొదటి సబ్ మెరైన్. దీనిని నరేంద్ర మోడీ ముంబై వద్ద నౌకాదళంలో ప్రవేశపెట్టాడు.
(కల్వరి హిందూ మహాసముద్రం లోని టైగర్ షార్క్ పేరు)
– ఫ్రాన్స్ సహకారంతో రూపొందించబడిన తొలి స్కార్పెన్ సబ్ మెరైన్ దీని ఒప్పంద రహస్య పాత్రలను మొదటి బహిర్గతం చేసిన పత్రిక – “ది ఆస్ట్రేలియా”.
– దీన్ని నిర్మించినది – మజ్ గాన్ డాక్ లి.
– ఇది రాడార్, సోనార్ కు చిక్కని అధునాతన స్టెల్త్ లక్షణాలను కలిగి వున్నది.
5Q) జతపరచండి?
a. శాకరీన్
b. ఆస్పర్ టేన్
c. అలిటేన్
d. సుక్రోజ్
1. చెక్కర కన్నా 100 రేట్లు తీపి ఎక్కువగా కలిగి ఉంటుంది.
2. చెక్కర కన్నా 550 రేట్లు తీపి ఎక్కువగా కలిగి ఉంటుంది.
3. చెక్కర కన్నా 1000 రేట్లు తీపి ఎక్కువగా కలిగి ఉంటుంది.
4. చెక్కర కన్నా 2000 రేట్లు తీపి ఎక్కువగా కలిగి ఉంటుంది.[Ans: b]
(A) a-1, b-2, c-3, d-4 (B) a-2, b-1, c-4, d-3 (C) a-3, b-2, c-4, d-1 (D) a-1, b-4, c-3, d-2