కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాధి- లక్షణాలు,ప్రభావం, చికిత్స
Coronavirus disease (COVID-19) is an infectious disease caused by a new virus.
The disease causes respiratory illness (like the flu) with symptoms such as a cough, fever, and in more severe cases, difficulty breathing. You can protect yourself by washing your hands frequently, avoiding touching your face, and avoiding close contact (1 meter or 3 feet) with people who are unwell.
వైరస్ అంటే….
వైరస్ అనే పదం లాటిన్ భాష నుండి ఉద్భవించింది. లాటిన్‌లో వైరస్ అంటే టాక్సిన్ లేదా విషం అని అర్థం. వైరస్‌లు అతి సూక్షమైనవి (సుమారుగా 15-600 నానోమీటర్లు). ఇవి ఇతర జీవుల కణాలపై దాడిచేసి వ్యాధులను కలుగజేస్తాయి. వైరస్‌లు వాటంతట అవి విభజన చెందలేవు. విభజన చెందాలంటే వేరే జీవకణం తప్పనిసరి. వైరస్‌లలో అతి సరళమైన జన్యుపదార్థం ఒక రక్షణ కవచంచే సంరక్షించబడుతూ ఉంటుంది. ఈ రక్షణ కవచం ప్రోటీనులతో చేయబడి ఉంటుంది, దీనిని క్యాప్సిడ్ అంటారు. వైరస్‌లు చాలా రకాల జీవులపై దాడి చేయగలవు (బాక్టీరియా, జంతురాజ్యం, వృక్షరాజ్యంతో పాటు శిలీంధ్రాలు, ప్రొటిస్టాకి చెందిన జీవులు కూడా వీటి దాడికి గురవుతుంటాయి). బాక్టీరియాపై దాడిచేసే వైరస్‌ను బాక్టీరియోఫేజ్ (సరళత కొరకు ఫేజ్) అని అంటారు. వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అని, వీటిని అధ్యయనం చేసే వారిని వైరాలజిస్టులని అంటారు.
కరోనా వైరస్
కోవిడ్-19(కరోనా వైరస్)…ఇది ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్. చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ .కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో “కరోనావైరస్”గా గుర్తించారు. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు. ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్.
కరోనావైరస్ లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. కరోనా క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చినది. ఇప్పటికే మొత్తం ఏడు కరోనావైరస్లు ఉన్నాయి, వీటిలో ‘మెర్స్ సీఓవీ’ అంటే ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అనేది ఒక రకమైన వైరస్. రెండోది ‘సార్స్ సీఓవీ’ అంటే ‘సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్
ఈ రెండురకాల కరోనావైరస్‌ల వల్ల సాధారణ జలుబు, జ్వరం వస్తుంది. ఈ సాధారణ కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకు. జంతువుల నుండి మనుషులకు వస్తుంది. చాలా ముఖ్యమైన కరోనావైరస్లలో సార్స్ SARS, మెర్స్ MERS ఉన్నాయి పరిశోధనల్లో తేలిందేమిటంటే ‘సార్స్ సీఓవీ’ వైరస్ పిల్లుల నుండి మనుషులకు సోకుతుందని. ‘మెర్స్-సీఓవీ’ ఒంటెల నుండి మనుషులకు సోకుతుందని తేలింది. ఇవి కాకుండా అనేక రకాలైన కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకే సోకుతున్నాయని వెల్లడైంది
కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం.వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు ‘నావెల్ కరోనా వైరస్ లేదా nCoV’అని పేరు పెట్టారు. ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకూ మనుషుల్లో గుర్తించలేదు.
కరోనా వైరస్ పేరు కోవిడ్-19గా మార్పు కరోనా అనే పేరు ఇప్పటికే వ్యక్తులకు, ప్రాంతాలకు, సంస్థలకు ఉండటం వల్ల అది ఒక వ్యాధిని సూచించే వైరస్‌గా మాత్రమే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా వైరస్ పేరును కోవిడ్-19గా మారుస్తున్నట్లు ప్రకటించింది.
1.హ్యూమన్ కరోనా వైరస్ 229ఈ (హెచ్ కోవ్-229ఈ): ఇవి ఆల్ఫా కరోనా వైరస్ జన్యువుతో సింగిల్ ఆర్ఎన్ఎను కలిగి ఉంటాయి. కరోనా విరిడే కుటుంబంలోని కరోనా విరినే ఉప కుటుంబానికి చెందినవి.ఇది హ్యూమన్ కరోనా వైరస్ ఓసీ43తో కలిసి సాధారణ జలుబుకు కారణమవుతుంది. ఇది ముదిరితే న్యూమోనియా, బ్రాంబైటిస్లకు దారి తీస్తుంది. దీంతో పాటు హ్యూమన్ రెస్టిరేటరి సిన్ సైటియల్ వైరస్ (హెచ్ఆరఎస్వి) గుర్తించారు. ఏడు మానవ కరోనా వైరస్లలో హెచ్కోవ్ 9ఈ ఒకటైనప్పటికీ వీటిలో హెచ్ కోవ్ ఎన్ఎల్63, హెచ్కోవ్-ఓసీ43 హెచ్ కోవ్-హెచ్ కెయు 1లు ఉన్నాయి. ఇవి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి అయ్యింది.
2.హ్యూమన్ కరోనా వైరస్ ఓసీ43 (హెచ్ కోవ్-ఓసీ43): ఇది కరోనా విరిడే కుటంబానికి చెందినది. బీటా కరోనా వైరస్ జన్యువును కలిగిన బీటా కరోనా వైరస్ 1 జాతికి చెందినది. ఈ వైరస్ ద్వారా సాధారణంగా 10 నుంచి 15 శాతం వరకు జలుబు వస్తుంది.
3.సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ (సార్స్-కోవ్): సార్స్ 2003, ఏప్రిల్ 6 ఆసియాలో ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యుహెచ్ఓ గుర్తించింది. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, వ్యాధీ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ ద్వారా వస్తుంది. దీని ద్వారా కండరాల నొప్పి, తల నొప్పి, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. అనంతరం 2నుంచి 14 రోజుల్లో దగ్గు, న్యూమోనియా లాంటి శ్వాసకోశ సంబంధ లక్షణాలు కనిపిస్తాయి.
4.హ్యూమన్ కరోనా వైరస్ ఎన్ఎల్63 (హెచ్కోవ్ ఎన్ఎల్ 63): ఈ వ్యాధిని మొదట 2004లో నెదర్లాండ్లో ఏడు నెలల పాప బ్రాంఖైలిటిస్ తో బాధపడుతున్నప్పుడు గుర్తించారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, న్యూమోనియా లాంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి. ఈ వ్యాధి అత్యధిక జనాభా గల ప్రాంతాలలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తుంది.
5.హ్యూమన్ కరోనా వైరస్ HKU1 (హెచ్కోవ్ హెచ్కెయు1): ఈ వైరస్ బీటా కరోనా వైరస్ లో సబ్ గ్రూప్-ఎ కు చెందినది. దీనిని 2005 జనవరితో హాంకాంగ్ లోని ఇద్దరు వ్యాధిగ్రస్తుల్లో గుర్తించారు.
6.మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోవ్-రిలేటెడ్ కరోనా వైరస్.(మెర్స్-సీఓవీ): ఇది బీటా వైరస్ జన్యువును కలిగి ఉంటుంది. దీనిని 2012 నావల్ కరోనా వైరస్ (2012 ఎన్ కోవ్) అని పిలుస్తారు. 2012లో నూతన ఫ్లూయూ వ్యాధితో ఉన్న వ్యక్తిలో ఈ వ్యాధిని గుర్తించడం జరిగింది. 2015 జులైలో మెర్స్కోవ్ కేసులను 21 దేశాల్లో గుర్తించారు. ఈ వైరస్ మొదట్లో సార్స్ కరోనా వైరస్కు భిన్నంగా ఉంది. కానీ 2013, మే 23 తరువాత సార్స్ వైరస్ గా గుర్తించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కోవిడ్-19 గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా శుభ్రమైన గుడ్డను అడ్డం పెట్టుకోవాలి. అత్యవసర సమయాల్లో మడచిన మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి.
చైనా, దాని సరిహద్దు దేశాల నుంచి వచ్చే వారికి షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం వంటివి చేయరాదు.