కరోనాపై ఉచిత కోర్సు ప్రవేశపెట్టిన టీసీఎస్
Coronavirus: TCS offers free online course for healthcare workers
కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. కరోనా వైరస్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, వైరస్ సోకినవారిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని హెల్త్ ప్రొఫెషనల్స్‌ను తయారు చేయడానికి TCS ‘కరోనా వారియర్స్’ పేరుతో ఒక ఉచిత ఆన్‌లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. కరోనా వైరస్, దాని లక్షణాలు, వ్యాధి సోకకుండా, వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను కోర్సులో భాగంగా నేర్పుతారు.కోర్స్ పూర్తి అయిన తరువాత సర్టిఫికెట్ అందుకోవచ్చు. డిజిటల్ లర్నింగ్ ప్లాట్‌ఫాం ‘టీసీఎస్ అయాన్’ ద్వారా ఈ కోర్సును అందజేస్తోంది.
ఉచిత ఆన్‌లైన్ సెల్ఫ్ సర్టిఫికేషన్ కోర్సు. దేశవ్యాప్తంగా ఎవరైనా ఎంచుకునే వీలు కల్పించారు. కాలవ్యవధి ఆరు గంటలు (వారం పాటు సాగుతుంది). ఆంగ్ల మాధ్యమంలో అందుబాటులో ఉంది.
Latest Updated Posts
దీనిని ప్రత్యేకంగా విద్యార్థులు, మెడికల్ ప్రొఫిషనల్స్ కి, పారామెడికల్, ప్రొఫెషనల్ హెల్త్‌కేర్ వర్కర్లను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. నర్సులు, ఫార్మసిస్టులు, రిసెప్షనిస్టులు, రేడియాలజీ, టెక్నీషియన్లు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ స్టాఫ్ తదితరులకు వారి వృత్తికి నిర్దిష్టంగా పనికొచ్చే అంశాలను అందజేస్తుంది. కోర్స్ పూర్తి చేసిన తరువాత సెల్ఫ్ అసెస్‌మెంట్ మాడ్యూల్ ఆన్‌లైన్ ఉంటుంది అది విజయవంతంగా పూర్తిచేసినవారికి సర్టిఫికెట్ ఇస్తారు. ఆసక్తి కలవారు క్రింద ఉన్న లింకు నుండి రిజిస్టర్ చేసుకోవచ్చు. పేరు, ఈ-మెయిల్, మొబైల్ నంబరు లేదా ఫేస్‌బుక్, ట్విటర్, గూగుల్ అకౌంట్లలో ఏదో ఒకదానితో రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ లింకు : https://learning.tcsionhub.in/courses/coronawarriors/