ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ లేకుండా నేరుగా IITలో ప్రవేశం

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ లేకుండా నేరుగా IITలో ప్రవేశం

The Indian Institute of Technology (IIT), Gandhinagar, has launched a one year post graduate diploma programme to help its graduating students whose higher education or employment plans have been disrupted due to the coronavirus outbreak.

IIt: COVID-19: IIT-Gandhinagar launches PG course for graduating ...

కరోన బారిన పడిన గ్రాడ్యుయేట్ల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-గాంధీ నగర్‌ ఒక విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రాడ్యుయేట్ల కోసం కొత్త ప్రోగ్రామ్‌ను రూపకల్పన చేసింది.

కరోన నేపథ్యంలో గత కొంత కాలంగా స్కూల్స్ మరియు కాలేజీలు మూతపడ్డాయి ఇంకా విద్యార్థుల చదువులు ఎంత గందరగోళానికి గురయ్యాయో అందరికీ తెలిసిందే. కరోన నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, వచ్చే విద్యా సంవత్సరం కూడా ఎంతో కొంత అయోమయానికి గురికాక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-గాంధీ నగర్‌ కరోన బారిన పడిన గ్రాడ్యుయేట్ల కోసం కొత్త ప్రోగ్రామ్‌ను రూపకల్పన చేసింది.

Latest Updated Posts

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇది ఏడాది కాలవ్యవధితో కూడిన ప్రోగ్రామ్. ఈ కోర్సులో కరోనా బారిన పడిన విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా నేరుగా ప్రవేశం ఉంటుంది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ప్రత్యేకంగా బయోలాజికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్ సిస్టమ్స్ సైన్స్ వంటి విభాగాల్లో ఉంటుంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా విజయవంతగా పూర్తిచేసిన విద్యార్థులు ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో లేటరల్‌ ఎంట్రీలో సీటు పొందగలుగుతారు. కరోనా మహమ్మారి కారణంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుని ఇబ్బంది పడిన విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఐఐటీ గాంధీనగర్‌ ప్రతినిధులు తెలిపారు. అలాగే ప్రత్యక్ష ప్రవేశ సౌకర్యం ఈ సంవత్సరానికి మాత్రమేమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.