Current Affairs 01 June 2017

297 total views, 1 views today

Current Affairs 01 June 2017

జాతీయం :

* గస్తీ కోసం సైకిళ్లు ఉపయోగించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది?

జ. ఢిల్లీ పోలీసులు.
(నోట్: రద్దీగా, ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో అత్యాధునిక సైకిళ్ల ద్వారా పోలీసులు గస్తీ నిర్వహిస్తారు)

* బహిరంగ మలవిసర్జనను అరికట్టేందుకు కొత్తగా ప్రారంభించిన ప్రచార కార్యక్రమమేది?

జ. దర్వాజా బంద్.

(నోట్: స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టారు. దీనికి ప్రపంచ బ్యాంకు సాయమందిస్తోంది.
* దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డు ఎవరికి దక్కింది ?

జ. ప్రియాంక చోప్రా.
( నోట్: ఈ అవార్డును కొత్తగా ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన తారల శ్రేణి కింద దీన్ని బహుకరిస్తారు)

* కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు?

జ. జగత్ ప్రకాశ్ నడ్డా

* భారత్ సొంతంగా ప్రారంభించిన GPS వ్యవస్థ పేరేంటి?

జ. నావిక్ ( ఇది 2018 లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది

* ఏబీ తేజ్ పేరుతో యాప్ ఆవిష్కరించిన బ్యాంకేది?

జ. ఆంధ్రా బ్యాంకు

* విమానయాన మార్కెట్ లో భారత్ ది ఎన్నో స్థానం?

జ. మూడో స్థానం. (మొదటి స్థానంలో అమెరికా ఉంది

* గడ్డి సాగు వివరాలు తెలుసుకునేందుకు ఏ సంస్థతో అమూల్ ఒప్పందం కుదుర్చుకుంది?

జ. ఇస్రో

* అమూల్ ఏ సంస్థకు చెందిన బ్రాండ్?

జ. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్. (ఇది 1946లో ఏర్పాటైంది.

* BBB అంటే ఏమిటి?

బ్యాంక్స్ బోర్డు బ్యూరో
(NOTE: భారత్ లో బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్లను ఈ సంస్థ ఎంపిక చేస్తుంది

* సాయిల్ టూ సాయిల్ పేరుతో అతి తక్కువ ఖర్చుతో జీవ ఇంధనాన్ని అభివృద్ధిపరిచే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ సంస్థ రూపొందించింది?

జ. ఐఐటీ ఖరగ్ పూర్
* ఇటీవల కన్ను మూసిన పార్వతమ్మ ఎవరు?

జ. కన్నడ నటుడు రాజ్ కుమార్ భార్య. ఎన్నో కన్నడ సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.

* సంఖ్యాకి భవన్ దేనికి ప్రధాన కార్యాలయం ?

జ. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్

* జాతీయ మైనార్టీ కమిషన్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?

జ. బీజేపీ నేత జార్జ్ కురియన్

* ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ కు ఏ నగరం ఆతిధ్యమివ్వనుంది?

జ. న్యూఢిల్లీ

(NOTE: భారత్ లో మొబైల్ కాంగ్రెస్ నిర్వహించడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 27-29 మధ్య ఇది ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరుగుతుంది*
* నిరుద్యోగులు, సంస్థల యజమానులకు ఉద్దేశించిన వెబ్ పోర్టల్ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?

జ. మహారాష్ట్ర

అంతర్జాతీయం :

* రోహింగ్యా ముస్లింలపై భద్రతా బలగాల అత్యాచారాలపై విచారణకు ఎవరి ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు?

జ. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్.

* 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని స్పెయిన్ దేశాన్ని సందర్శించారు. అంతకు ముందు ఆ దేశాన్ని సందర్శించిన ప్రధాని ఎవరు?

జ. రాజీవ్ గాంధీ

* భారీ గాలిపటాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్న దేశమేది?

జ. బ్రిటన్.

* ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా ఏ రోజును పాటిస్తారు?

మే 31.
( ఈ ఏడాది ఎంచుకున్న థీమ్ పొగాకు – అభివృద్ధికి హెచ్చరిక*

క్రీడలు :

* గోల్డెన్ షూ అవార్డు అందుకున్న క్రీడాకారుడు ఎవరు?

జ. లియోనెల్ మెస్సీ.

(నోట్: ఈ అవార్డుకు మెస్సీ వరుసగా నాలుగో సంవత్సరం అందుకుంటున్నారు.*
* కీయా సూపర్ లీగ్ లో ఆడనున్న తొలి భారతీయ క్రీడాకారణి ఎవరు?

జ. హర్మన్ ప్రీత్ కౌర్.

* వన్డే క్రికెట్ లో అతి వేగంగా 7000 పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు?

జ. దక్షిణాఫ్రికాకు చెందిన ఓపెనర్ హషీమ్ ఆమ్లా.
( నోట్: తన 150వ ఇన్నింగ్స్ లో అతను ఈ ఘనత సాధించారు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరుతో ఉండేది


  • Current Affairs Telugu – Click Here
  • Current Affairs English – Click Here
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.