Current Affairs 02 June 2017

Current Affairs 02 June 2017

జాతీయం :

* ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో జరిగిన సమావేశంలో రెండు దేశాల త్రివిధ దళాల విన్యాసాలు తొలిసారి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విన్యాసాలకు ఏమని పేరు పెట్టారు ?

జ: ఇంద్ర – 2017

* రష్యా భాగస్వామ్యంతో దేశంలో ఎన్ని అణు విద్యుత్ కర్మాగారాల యూనిట్లు నెలకొల్పాలని నిర్ణయించారు ?

జ: 12

* కుడంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి ప్రస్తుతం సాయం చేస్తున్న దేశం ఏది ?

జ: రష్యా

* భారత్ ఆర్థిక వృద్ధిపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ అంచనాలేంటి?

జ. 2017లో భారత్ వృద్ధి 7.5%గా, 2018లో 7.7% శాతం

* గ్లోబల్ 300 సిటీస్ జాబితాలో భారత్ నుంచి ఎన్ని నగరాలకు చోటు దక్కింది?

జ. 9 నగరాలు.

(నోట్: టాప్ 30లో ఢిల్లీ ముంబై, టాప్ 100లో బెంగళూరు, చెన్నై, కోల్ కతా నగరాలు

* కొత్తగా చలామణీలోకి రాబోయే ఒక్క రూపాయి నోటుపై ఏ ఇంగ్లీష్ అక్షరం ముద్రిస్తారు ?

జ. L

* కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?

జ. తపన్ రే
(నోట్: గుజరాత్ కేడర్ కు చెందిన IAS అధికారి ఈయన. ఇప్పటి వరకు ఈయన కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఉన్నారు

* మే 2017లో చైనా వైపు నుంచి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు?

జ. అనితా కుండూ

(నోట్: హర్యానాకు చెందిన సబ్ ఇన్స్ పెక్టర్ ఈమె. 2013 లో ఈమె నేపాల్ వైపు నుంచి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు

* శ్రీ వేంకటేశ్వర జాతీయ పార్కు ఎక్కడుంది?

జ. తిరుపతి.

* భారత దేశంలో ప్రవహించే నదుల్లో అత్యంత పొడవైనది ఏది?

జ. గంగా నది

* దేశంలో రెండో పొడవైన నది ఏది?

జ. గోదావరి ( దీని పొడవు 1465 కి.మీ.

* యమునా నదీ ఎక్కడ గంగా నదిలో కలుస్తుంది?

జ. అలహాబాద్

* అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది?

జ. పార్లమెంటుకు.

* భారతదేశంలో ఏర్పాటైన మొదటి ద్వీప మ్యూజియం ఏది?

జ. నాగార్జునసాగర్ సమీపంలో ఉండే నాగార్జున కొండ

అంతర్జాతీయం :

* పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన దేశమేది?

జ. అమెరికా

* సూర్యుడి బాహ్య వాతావరణ పరిశోధన కోసం నాసా పంపనున్న స్పేస్ క్రాఫ్ట్ ఏది?

జ. పార్కర్ సోలార్ ప్రోబ్.
( సూర్యుడిపై నాసా పంపిస్తున్న తొలి స్పేస్ క్రాఫ్ట్ ఇది

* షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ SCOలో పూర్తి స్థాయి సభ్యులుగా అవుతున్న దేశాలేవి?

జ. భారత్, పాకిస్థాన్

* SCO ఎప్పుడు ఏర్పాటైంది?

జ. 2001లో ఏర్పాటైంది.
(నోట్: దీని ప్రధాన కార్యాలయం బీజింగ్ లో ఉంది

* SCOలో సభ్యదేశాలేవి?

జ. చైనా, రష్యా, కజకస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, కిర్గిస్థాన్ పూర్తిస్థాయి సభ్యులు.
(నోట్: ఆప్ఘనిస్థాన్, బెలారస్, ఇండియా, ఇరాన్, మంగోలియా, పాకిస్థాన్ దేశాలు పరిశీలక హోదా కలిగి ఉన్నాయి

* ఈ ఏడాది SCO సమావేశాలు ఏ దేశంలో జరుగుతాయి ?

జ. కజకస్థాన్.
( నోట్: అస్థానా లో ఈ సమావేశాలు జూన్ 8,9 తేదీల్లో జరుగుతాయి

* వాల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగాయి?

జ. జెనీవాలో మే 22 నుంచి 31 వరకు ఈ సమావేశాలు జరిగాయి.

* ఆసియా ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం ఎక్కడ జరగనుంది?

జ. దక్షిణ కొరియాలోని జేజూ నగరంలో.
(నోట్: ఈ బ్యాంకుకు సంబంధించి ఇది రెండో సమావేశం. భారత్ తరపున ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొంటారు. జూన్ 14-15 తేదీల్లో ఈ సమావేశాలు జరుగుతాయి

* ఉడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ లో చోటు సంపాదించిన భారతీయురాలు ఎవరు?

జ. నిరుపమా రావు.
(నోట్: ఈమె గతంలో అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు.

* ప్రపంచ పాల దినోత్సవాన్ని ఏ రోజు పాటిస్తారు?

జ. జూన్ 1.

* భారత్ లో జాతీయ పాలదినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు?

జ. నవంబర్ 26న
(నోట్: క్షీర విప్లవ పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతి ఆ రోజు

క్రీడలు :

* ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్* వన్డే ప్లేయర్స్ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో నిలిచిన భారతీయ ఆటగాడు ఎవరు?

జ. విరాట్ కోహ్లి

* ITTF (ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్* బోర్డు ఆఫ్ డైరెక్టర్ గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు?

జ. ధన్ రాజ్ చౌదరి

* యూరోప్ లో అత్యంత విలువైన క్లబ్ గా ఏది ఎంపికైంది?

జ. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ (ఫుట్ బాల్ క్లబ్ ఇది