Current Affairs 03 June 2017

Current Affairs 03 June 2017

జాతీయం:

* భారత్ ప్రయోగించిన ఉపరితలం నుంచి ఉపరితలపు మిస్సైల్ ఏది?

జ. పృధ్వీ II

* పృధ్వీ II ఎవరు తయారు చేశారు?

జ. DRDO, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా

* పృధ్వీ II ప్రత్యేకతలేంటి?

జ. అల్యూమినియం ఆలాయ్ తో తయారు చేసిన ఇది. 500 కేజీల నుంచి 1000 కేజీల బరువున్న వార్ హెడ్స్ ఈజీగా మోసుకెళ్లగలదు.

* పృధ్వీ మిస్సైల్ ఏ దళంలో చేర్చనున్నారు?

జ. భారత సైన్యానికి చెందిన 333 మిస్సైల్ రెజిమెంట్ లో దీన్ని చేర్చుతారు.

* కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి ఎవరు?

జ. హర్ సిమ్రత్ కౌర్ బాదల్

* నగదు లావాదేవీలకు సంబంధించి ఆదాయపన్ను శాఖ తీసుకున్న నిర్ణయమేది?

జ. రూ.2 లక్షలు దాటిన నగదు లావాదేవీలపై జరిమానా

* రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్ సెల్ విలీనం తర్వాత ఏర్పడిన సంస్థేది?

జ. ఎయిర్ కామ్

* ఉద్యోగార్థుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వెబ్ పోర్టల్ ఏది?

జ. మహాస్వయం

* తీరప్రాంత ప్రజలను హెచ్చరించేందుకు ఆటోమేటిక్ ప్రజా సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసిన రాష్ట్రమేది?

జ. ఒడిషా

* నాటక రచయిత గౌరవార్థం భారత ప్రభుత్వం ఇటీవల ఓ తపాల బిళ్ల విడుదల చేసింది. ఆయన ఎవరు?

జ. బల్వంత్ గార్గీ

* NAAC అంటే ఏమిటి?

జ. నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్.

* NAAC ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?

జ. బెంగళూరు

* NAAC విధులేంటి?

జ. ఉన్నత విద్యలో నాణ్యత పరిశీలించి ఆ సంస్థలకు NAAC గుర్తింపునిస్తుంది.

* భారత్ లో ఏర్పాటు చేసిన తొలి అణు రియాక్టర్ పేరు?

జ. అప్సర

* భారత్ లో సౌరవిద్యుత్ ను మొదటిసారిగా ఎక్కడ ఉత్పత్తి చేశారు?

జ. కళ్యాణ్ పూర్ – ఉత్తరప్రదేశ్

* ప్రసార భారతి CEO గా ఎవరు నియమితులయ్యారు ?

జ: శశిశేఖర్ వెంపటి
(గతంలో జవహర్ సర్కార్ పనిచేశారు. ఏడు నెలల క్రితం రాజీనామ చేశారు )

అంతర్జాతీయం:

* ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఏది?

జ. చైనా ( ఇప్పటి వరకు మొదటి స్థానంలో భారత్ ఉండేది)

* చైనా GDP ఎంత?

జ. 6.9%

(నోట్: భారత్ 6.1% – పెద్ద నోట్ల రద్దు ప్రభావం గృహనిర్మాణ, ఆర్థిక, ఇతర రంగాలపై పడటంతో భారత వృద్ధి రేటు నాలుగో త్రైమాసికంలో మందగించింది*
* ప్రపంచ శాంతి సూచిక 2017లో మొదటి స్థానంలో నిలిచిన దేశమేది?

జ. ఐస్ ల్యాండ్.
( నోట్: ఐస్ ల్యాండ్ ఈ ఘనత సాధించడం వరుసగా ఇది పదో సంవత్సరం)

* గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో భారత్ స్థానమేది?

జ. 137 ( గత సంవత్సరం 141 స్థానంలో ఉండేది)

* ప్రపంచంలో శాంతియుత ప్రదేశంగా ఏది ఎంపికైంది?

జ. యూరోపియన్ ప్రాంతం.
(నోట్:: మొదటి 10 శాంతియుత దేశాల్లో 8 ఈ ప్రాంతానికి చెందినవే)

* ఐర్లండ్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?

జ. భారత మూలాలనున్న లియో వరద్కర్ ( ఆ వయస్సు 38)

* లియో వరద్కర్ ప్రత్యేకతేంటి?

జ. తాను గేనని ఆయన బహిరంగంగా చెప్పుకున్నారు.

క్రీడలు :

* సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేర్స్ నుంచి ఎవరు తప్పుకున్నారు?

జ. రామచంద్ర గుహా
* కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేర్స్ ను సుప్రీంకోర్టు ఎందుకు ఏర్పాటు చేసింది?

జ. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వ్యవహారాలు పర్యవేక్షణకు0* కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేర్స్ కు నాయకత్వం వహిస్తున్నది ఎవరు?

జ. వినోద్ రాయ్ ( మాజీ కంప్ట్రోలర్ అండ్


  • Current Affairs Telugu – Click Here
  • Current Affairs English – Click Here