Current Affairs 04 June 2017

Current Affairs 04 June 2017

జాతీయం :

* బంగారంపై GST ఎంత ఉండాలని నిర్ణయించారు?

జ. 3% (ప్రస్తుతం ఇది 2%గా ఉంది.)

* విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. ప్రస్తుత ప్రాన్స్ అధ్యక్షుడు ఎవరు ?

జ: ఎమ్మాన్యుయేల్ మెక్రాన్

* ప్రపంచంలోని పేద చిన్నారుల్లో ఎంత మంది భారత్ లో ఉన్నట్టు అంచనా?

జ. 31% – 689 మిలియన్ పేదపిల్లలు భారత్ లో ఉన్నట్టు అంచనా
( నోట్: యాక్స్ ఫర్డ్ పావర్టీ అండ్ హ్యుమన్ డెవలప్ మెంట్ ఇనిషియేటివ్ 103 దేశాల్లో చేపట్టిన సర్వే ఆధారంగా ఈ అంచనా వేసింది.)

* కార్పొరేట్ గవర్నన్స్ ప్రమాణాల పెంపుపై సెబీ నియమించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు?

జ. ఉదయ్ కొటక్

* INAM-Pro+ దేనికి సంబంధించినది?

జ. భారత్ లో నిర్మాణరంగ వస్తువుల కొనుగోలు, అమ్మకాలకు ఉద్దేశించిన వెబ్ ఫ్లాట్ ఫామ్

* INAM-Pro+ పోర్టల్ ఆవిష్కరించింది ఎవరు?

జ. కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ

* మదర్ థెరిస్సా స్మారక అంతర్జాతీయ సామాజిక న్యాయం అవార్డు 2016 ఎవరందుకున్నారు?

జ. బంగ్లాదేశ్ కు చెందిన ఫరాజ్ ఆయాజ్ హుస్సేన్ (మరణానంతరం)

* హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు ఎక్కడ జరిగింది?

జ. భారత్ లోని అమృతసర్ .

* దేశంలో తొలి “ఫ్రైట్ విలేజ్” దక్కించుకున్న నగరమేది?

జ. వారణాసి

* రుణాల వసూలు, పంపిణీ కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన కొత్త పథకమేంటి?

జ.స్టార్ మహోత్సవ్

* Between Wind and Water అంటే అర్థమేంటి?

జ. బలహీన ప్రాంతం లేదా నాజూకు ప్రాంతం

అంతర్జాతీయం :

* ఆక్సిజన్ లేకుండానే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిందెవరు?

జ. భారత సైనికులు కంచోక్ టెండా, కేల్ షాంగ్ దోర్జి బూటియా, కాల్డెన్ పంజూర్, సోనం ఫన్ స్టోక్

* అణు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఏ దేశంపై ఐక్య రాజ్య సమితి ఆంక్షలు విధించింది?

జ: ఉత్తర కొరియా

* దైవదూషణకు సంబంధించిన చట్టాన్ని రద్దు చేసిన దేశమేది?

జ. డెన్మార్క్

* అమూల్ థాపర్ ఎవరు?

జ. అమెరికాకు చెందిన కోర్టు ఆఫ్ ఆపీల్స్ లో న్యాయమూర్తిగా నియమితులైన భారత సంతతికి చెందిన జడ్జ

క్రీడలు :

* URC అంటే ఏంటి?

జ. అంపైర్స్ అండ్ రెఫరీస్ కమిటీ

* గణేశన్ నీలకంఠ అయ్యర్ ఎవరు?

ఙ. URCలో భారత్ తరపున నామినేట్ అయిన తొలి వ్యక్తి.
(నోట్: URC సభ్యుడిగా ఆయన పదవీకాలం రెండేళ్లు. (ప్రస్తుతం ఆయన దక్షిణాసియా ఫెడరేషన్ టెక్నికల్ కమిటీ ఛైర్మన్ గా, కామన్ వెల్త్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ టెక్నికల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు

* HCL ఆసియా జూనియర్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ విజేత ఎవరు?

జ. నితిన్ కుమార్

24* FIFA 2018, 2022 కప్ అధికారిక స్పాన్సర్ ఎవరు?

జ. వివో

* వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కొత్త పేరేంటి?

జ. విండీస్


  • Current Affairs Telugu – Click Here
  • Current Affairs English – Click Here