Current Affairs 07 June 2017

Current Affairs 07 June 2017

జాతీయం:

* కొత్త సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు ?

జ: రంజిత్ కుమార్
( ఇప్పటికే పదవిలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఈయన పదవీకాలాన్ని పొడిగించింది )

* ట్రిన్ ట్రిన్ పేరుతో స్మార్ట్ కార్డ్ ఆధారంగా పబ్లిక్ సైకిల్ షేరింగ్ ను ఏ నగరంలో ప్రారంభించారు ?

జ: మైసూర్

* దేశంలో ఉన్నత విద్యారంగం నియంత్రణ, పర్యవేక్షణకు ఒకే సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. దాని పేరేంటి ?

జ: ఉన్నత విద్యా సాధికారత నియంత్రణ సంస్థ (హీరా)

* ప్రపంచ బ్యాంక్ రూపొందించిన గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ప్రకారం భారత్ జీడీపీ ఎంతగా అంచనా వేశారు ?

జ: 7.5 శాతం

* దేశంలోనే మొదటిసారిగా గ్రామీణ LED వీథి దీపాల ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ఏది ?

జ: ఆంధ్రప్రదేశ్

1* భారత సాంప్రదాయ సంగీతం, కళలను యువతకు పరిచయం చేసే స్పిక్ మకే 5వ అంతర్జాతీయ సదస్సు ఏ IIT లో జరుగుతోంది ?

జ: IIT ఢిల్లీ ( జూన్ 5 నుంచి )

* ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్ మెంట్ అండ్ డెవలప్ మెంట్ (IMD* ప్రపంచ పోటీతత్వ సూచికలో భారత్ ర్యాంకు ఎంత ?

జ: 45 వ ర్యాంకు (మొత్తం దేశాలు 63. హ్యాంకాంగ్ టాప్ గా నిలిచింది )

* 21వ ఫెడరేషన్ కప్ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ సాధించిన సుధా సింగ్ ఏ ఆటకు చెందినవారు ?

జ: Steeplechase

* దేశంలో పచ్చదనాన్ని ప్రోత్సహించేందుకు టాటా ప్రాజెక్ట్స్ చేపట్టిన కార్యక్రమం పేరేంటి ?

జ: గ్రీన్ తంబ్

* దేశంలో మొదటిసారిగా స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ పార్కింగ్ స్థలాలను అంతా మహిళలే నిర్వహించే సిటీ ఏది ?

జ: ఛండీగడ్

* ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) దేశంలోనే మొదటిసారిగా తిరిగి అభివృద్ధి చేస్తున్న రైల్వే స్టేషన్ ఏది ?

జ: హబీబ్ గంజ్

* NSE IFSC Ltd., ఏ రాష్ట్రంలో ఉంది ?

జ: గుజరాత్

* వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (WTI* అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?

జ: దియా మీర్జా

* ఇస్రో ప్రయోగించిన ఏ శాటిలైట్ కి Fatboy+ అని నిక్ నేమ్ పెట్టారు ?

జ: GSLV మార్క్ 3D1

* దేశంలో వంద డిజిటల్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్న బ్యాంక్ ఏది ?

జ: విజయా బ్యాంక్

* 2017 జూన్ 2న మేకింగ్ ఆఫ్ డెవలప్ మెంట్ ఇండియా ( MODI* పేరుతో మూడు రోజుల ఉత్సవాలు ఏ రాష్ట్రంలో జరిగాయి ?

జ: ఆంధ్రప్రదేశ్

* రాబోయే 10-12 యేళ్ళల్లో ఉద్గారాలను ఎంత శాతం తగ్గించాలని భారతీయ రైల్వేలు నిర్ణయించాయి ?

జ: 3.33శాతం

* ఏ వస్తువు కొనుగోలుపై ప్రభుత్వ సబ్సిడీ పొందడానికి ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు ?

జ: కిరోసిన్

* దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ లో వీడియో, ఆడియో, చిత్రాల ఆధారంగా ఇద్దరు లా స్టూడెంట్స్ కి 20 యేళ్ళ జైలుశిక్ష వేసిన కోర్టు ఏది ?

జ: హరియాణాలోని అడిషినల్ సెషన్స్ జడ్జి కోర్టు ( జడ్జి : సునితా గ్రోవర్)

అంతర్జాతీయం:

* నేపాల్ ప్రధానిగా ఎన్నికైన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు ?

జ: షేర్ బహాదుర్ దేవుబా

* చిన్నారుల సైకాలజీలో తండ్రి పాత్రపై ప్రత్యేక ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్య సమితి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన ప్రముఖ క్రికెటర్ ఎవరు ?

జ: సచిన్ టెండూల్కర్

* భారత ప్రధాని నరేంద్ర మోడీ, జర్మనీ ఛాన్సలర్ అంగేలా మెర్కెల్ పాల్గొన్న ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ ఎక్కడ జరిగింది ?

జ: బెర్లిన్, జర్మనీ

* నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ స్పెయిన్ లో పర్యటించారు. అయితే ఎన్నేళ్ళ తర్వాత స్పెయిన్ వెళ్ళిన భారత ప్రధానిగా మోడీ నిలిచారు ?

జ: 30యేళ్ళు

* 2017 జూన్ 1న భారత్ – రష్యా మధ్య రెండు న్యూక్లియర్ పవర్ యూనిట్స్ స్థాపనకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. అవేంటి ?

జ: కుడంకుళం ( తమిళనాడు)

* ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల వెలికితీతకు మన దేశానికి చెందిన ఏ సంస్థకు 1.5లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లభించింది ?

జ: అదానీ గ్రూప్ ( ప్రాజెక్ట్ పేరు: కార్మిఖేల్)

* మల్టీనేషనల్ కంపెనీల పన్నుల ఎగవేతను నిరోధించడానికి ఉద్దేశించిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (OECD* ఒప్పందంపై మన దేశం తరపున కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంతకం చేయనున్నారు. ఈ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ?

జ: పారిస్ లో

* షాంఘై సహకార సంస్థ (SCO* సదస్సుకు ప్రధాని మోడీ హాజరవుతున్నారు. ఈ సదస్సు ఎక్కడ జరుగుతోంది ?

జ: కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో ( జూన్ 8,9 తేదీల్లో)

* శాటిలైట్స్ కు సంబంధించి QR-SAM అంటే ఏంటి ?

జ: Quick Reaction Surface-to-Air Missile

* ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఫుడ్ పాండాకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?

జ: బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్

* 2017 థాయ్ లాండ్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ?

జ: బి. సాయి ప్రణీత్

* 2017 గ్లోబల్ హెల్త్ కేర్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది ?

జ: స్విట్జర్లాండ్

* ఐక్యరాజ్య సమితి భద్రతా సమితికి ఎంపికైన సభ్య దేశాలు ఏవి ?

జ: స్వీడన్, బొలీవియా, ఇథియోపియా, కజకిస్థాన్

* ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం ఐక్యరాజ్య సమితి ఇటీవల ఏ దేశానికి వందల సంఖ్యలో ఆయుధాలను అందజేసింది ?

జ: ఫిలిప్పీన్స్

* అమెరికాలో జరిగిన 90వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన ఇండో అమెరికన్ ఎవరు ?

జ: అనన్య వినయ్


  • Current Affairs Telugu – Click Here
  • Current Affairs English – Click Here