Current Affairs: 22 May 2017

325 total views, 1 views today

జాతీయం


* చైనాతో సరిహద్దు కలిగిన ఐదు రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎక్కడ సమావేశం ఏర్పాటు చేశారు?

జ: గ్యాంగ్ టక్

* భారత్- చైనా కి సంబంధించి సరిహద్దుల్లో వివాదాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న రేఖ పేరేంటి ?

జ: వాస్తవాధీన రేఖ

* జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదలుపై దాడులకు మెరుపు వేగంతో స్పందించాలని వైమానిక దళ అధికారులకు ఎయిర్ ఛీఫ్ మార్షల్ సూచించారు. ప్రస్తుతం ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరు ?

జ: బి.ఎస్ ధనోవా

* RUSA అంటే ఏమిటి?

జ. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోర్టల్ ఇది. ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.)

* హార్థిక్ పటేల్ ఎవరు?

జ. గుజరాత్ లోని పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పోరాటం చేస్తున్న యువకుడు. (పాటిదార్ ఆమానత్ ఆందోళన్ అనే సంస్థకు హార్థిక్ కన్వీనర్)

* ఏ పార్లమెంట్ ఎన్నికల నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల వాడకం ప్రారంభమైంది?

జ. 2004 ఎన్నికలు

* వెర్సోవా బీచ్ ఎక్కడుంది?

జ. ముంబై

* ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ఎవరు అందుకోనున్నారు?

జ. ముంబైకి చెందిన న్యాయవాది అఫ్రోజ్ షా. చెత్తా చెదారంతో నిండిన వెర్సోవా బీచ్ ను శుభ్రం చేసినందుకు ఈ అవార్డు అందుకున్నారు.

* శ్రీవిల్లిపుత్తూరు ఏ రాష్ట్రంలో ఉంది?

జ. తమిళనాడులో. ఈ ఆలయం తరహాలో యాదాద్రిని అభివృద్ధి చేయనున్నారు.

* గంగానదిలో పూడిక తీయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది?

జ. మాధవ్ చితాలే కమిటి

* విద్యార్థుల కోసం ఈ-టెక్ట్స్ బుక్ పోర్టల్ ప్రారంభించిన రాష్ట్రమేది?

జ. హర్యానా ప్రభుత్వం.

* బిందావాస్ పక్షి సంరక్షణా కేంద్రం ఎక్కడుంది?

జ. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఉంది.

* ఐపీఎల్ 2017 విజేత ఎవరు?

జ. ముంబై ఇండియన్స్ (హైదరాబాద్ లో జరిగిన ఫైనల్స్ లో పుణే టీమ్ ఓడించింది. టైటిల్ గెలవడం ముంబై ఇండియన్స్ కు ఇది మూడోసారి.)

* ఆర్.ఆర్.లక్ష్మణ్ ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు?

జ. చెస్

* సుందరం రవి ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?

జ. క్రికెట్. (భారత్ కు చెందిన క్రికెట్ అంపైర్ ఇతను.

* భూమిని నిశితంగా పరిశీలించడానికి 2021లో నాసా-ఇస్రో కలిసి ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయి. దాని పేరేంటి ?

జ: నిసార్ ( నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ )

* కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చౌకైన విమానయాన ప్రయాణ పథకం ఉడాన్ స్కీమ్ కింద విమానాలను నడిపించడానికి ఏ ప్రైవేటు ఎయిర్ లైన్స్ కు అవకాశం దక్కింది ?

జ: టర్బో మెఘా


అంతర్జాతీయం


* ఐర్లాండ్ ప్రధాని పదవికి పోటీపడుతున్న భారత సంతతి వైద్యుడు ఎవరు?

జ. లియో వరాడ్కర్

* మైత్రీ ఎక్స్ ప్రెస్ రైలు ఏ దేశాల మధ్య ప్రయాణిస్తుంది?

జ. బంగ్లాదేశ్- ఇండియా మధ్య ఈ రైలు నడుస్తుంది. ఢాకా-కోల్ కతా మధ్య ఈ రైలు నడుస్తుంది.

* ఇరాన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?

జ. హసన్ రౌహానీ. ప్రస్తుతం కూడా ఈయనే అధ్యక్షుడిగా ఉన్నారు.

* 2017 ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు?

జ. ప్రశాంత్ రంగనాథన్. (ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కు చెందిన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇతను)

* ప్రపంచంలో ప్రకృతి విపత్తులు లేదా అణ్వాయుధాల దాడులనుంచి కాపాడేందుకు ప్రపంచంలో ముఖ్యమైన, అరుదైన, విలువైన విత్తనాల నమూనాలను లక్షల సంఖ్యలో ఓ చోట భద్ర పరిచారు. అది ఎక్కడ ఉంది ?

జ: ఆర్కిటిక్ ప్రాంతంలోని ఓ దీవిలో (నార్వే సంస్థ స్టాట్స్బైగ్ దీన్ని నిర్వహిస్తోంది)

  • Current Affairs : Telugu – Click Here
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.