Current Affairs :23 May 2017

Current Affairs :23 May 2017

జాతీయం

* జన్ కీ బాత్ పేరుతో ప్రధాని మోదీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇది దేనికి సంబంధించినది?
జ. మూడేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నమిది.
* మన్ కీ బాత్ దేనికి సంబంధించినది?
జ) ఆల్ ఇండియా రేడియోలో ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగం పేరది.
* నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఎక్కడుంది?
జ. న్యూఢిల్లీ
* తీవ్రవాద వ్యతిరేక దినంగా ఏ రోజును పాటిస్తారు?
జ. మే 21 ( మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయిన రోజు)
* భారత్ లో మొదటి ఈ-రేషన్ కార్డు విధానాన్ని ప్రారంభించిన రాష్ట్రమేది?
జ. ఢిల్లీ
* అత్యంత సౌకర్యవంతమై తేజస్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది?
జ. ముంబై CST నుంచి గోవాలోని కర్మాలి స్టేష్టన్ల మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది.
* ఈ రైలు బోగిలు ఎక్కడ తయారు చేశారు?
జ. పంజాబ్ కపుర్తాలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేశారు.
* ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అన్షు జమ్ సెన్పా ఏ రాష్ట్రానికి చెందిన మహిళ?
జ. అరుణాచల్ ప్రదేశ్
* బహిరంగ మలవిసర్జనను నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దళమేంటి?
జ. గుడ్ మార్నింగ్ స్క్వాడ్.
* 2016లో ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అత్యధిక బాంబు పేలుళ్లు జరిగాయని నేషనల్ బాంబ్ డేటా సెంటర్ వెల్లడించింది..??
జ: భారత్
* MSME ఎక్సలెన్స్ అవార్డు – 2017 అందుకున్న ప్రభుత్వ బ్యాంకు ఏది..?
జ: ఐడీబీఐ

అంతర్జాతీయం

* అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడుంది?
జ. హొనో లూలు
* సముద్రంలో సంభవించే భూకంపాన్ని ఏమంటారు?
జ. సునామీ
* సైక్లోన్ అంటే అర్థమేంటి?
జ. పాము మెలికలు
* ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయను శాస్త్రవేత్తలు సృష్టించారు. దాని పేరేంటి?
జ. డ్రాగన్స్ బ్రీత్ ( ఇది పొరపాటున తింటే ప్రాణాలు పోవడం తథ్యమని హెచ్చరిస్తున్నారు.)
* మరో సైబర్ దాడికి సంబంధించిన హెచ్చరికలు వస్తున్నాయి, ఆ మాల్ వేర్ పేరేంటి?
జ. ఎటర్నల్ రాక్స్.
* మే 22ను ఐక్యరాజ్యసమితి ఏ రోజుగా ప్రకటించింది?
జ. అంతర్జాతీయ జీవవైవిధ్య దినం
* కొత్తగా కనుగొన్న బ్యాక్టిరీయాకు నాసా శాస్త్రవేత్తలు పెట్టిన పేరేంటి?
జ) సోలిబాసిల్లాస్ కలామీ ( మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం)
* Neither a Hawk nor a Dove పుస్తకాన్ని రాసిందెవరు?
జ. ఖుర్షీద్ మహమద్ కసూరి (పాకిస్థాన్ దౌత్యవేత్త)
* ప్రపంచ మెట్రాలజీ రోజుగా ఏ రోజును పాటిస్తారు?
జ. మే 20 (కొలతల్లో మీటరు వాడకాన్ని ప్రారంభించిన రోజది. మే 20, 1875 దీనిపై సంతకాలు చేశారు.
* థాయిల్యాండ్ లో నిర్వహించిన మొదటి ఆసియా స్థాయి యోగా పోటీల్లో ప్రథమ స్థానంలో ఎవరు నిలిచారు?
జ. వైష్ణవి
* నొవాక్ జొకొవిక్ తన కొత్త కోచ్ గా ఎవరిని ఎంచుకున్నారు?
జ. అండ్రీ ఆగాస్సీ
* 2017 ఆసియా కాంటినెంటల్ ఉమెన్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ విజేత ఎవరు?
జ. ఆర్. వైశాలి.
* వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ – 2017 పురస్కారానికి ఎంపికైన ఫోటోగ్రాఫర్..??
జ: బుర్హాన్
* ఏ జైలులో ఐదేళ్లలో 13వేల మందిని ఉరి తీశారని ఆమ్నెస్టీ అంతర్జాతీయ మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది..??
జ: సెద్ నాయ (సిరియా)
* ఏ దేశంలో ప్రజలందరూ అవయవదానం చేయాలని చట్టం చేసారు..??
జ: ఫ్రాన్స్
* వ్యక్తి మరణించిన తరువాత అవయవాలను ప్రభుత్వం సేకరించే విధానం గల దేశాలేవి..??
జ: ఆస్ట్రియా,స్పెయిన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.