Current Affairs: 25/05/2017

227 total views, 1 views today

Current Affairs: 25/05/2017

జాతీయం:

* జాతీయ మైనార్టీల కమిషన్ అధ్యక్షుడు ఎవరు?

జ. గయరుల్ హసన్

* చెరుకు మద్దతు ధర ఎంత మేరకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది?

జ. టన్నుకు రూ.250.
( ప్రస్తుతం చెరకు మద్దతు ధర టన్నుకు రూ.2300 ఉంది. దీన్ని రూ.2,550గా పెంచుతారు.)

* 25 ఏళ్ల నాటి వ్యవస్థను రద్దు చేస్తు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేంటి?

జ. FIPB
( ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రోమోషన్ బోర్డు- దేశంలో విదేశీ పెట్టుబడులకు అనుమతినిచ్చే సంస్థం ఇది)

* దేశంలో తొలి జల సొరంగం ఎక్కడ నిర్మించారు?

జ. కోల్ కతా మెట్రో రైలు కోసం ఈ సొరంగాన్ని నిర్మించారు.

(హౌరా నగరం నుంచి సాల్ట్ లేక్ స్టేషన్ మధ్యన ఈ సొరంగం ఉంటుంది.)

* శాటిలైట్ టెలిఫోన్ సేవలందించనున్న టెలికాం సంస్థ ఏది?

జ. BSNL

* కర్ణాటక బాల్య వివాహల నిషేధం చట్టానికి ఎవరి ఆమోదం లభించింది?

జ. రాష్ట్రపతి.

( ఈ చట్టం ప్రకారం బాల్య వివాహాలు జరిపే వారిపైనే కాదు వాటికి హాజరయ్యే వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులకు అధికారం కల్పించారు.)

* బొగ్గు సరఫరాకు సంబంధించి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆవిష్కరించిన యాప్ ఏది?

జ. సేవా ( సరళ్ ఇంధన్ వితరణ్ అప్లికేషన్)

* శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న విదేశీ సంస్థ ఏది?

జ. వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ. (అమెరికాకు చెందిన ఆ కంపెనీ ఆ దేశంలో దివాలా తీసింది)

* పేటీఎం పేమెంట్స్ బ్యాంకు తొలి శాఖ ఎక్కడ ప్రారంభించారు?

జ. నొయిడా

* సెల్ఫి పేరుతో కొత్త వ్యాపార వేదిక ప్రారంభించిన బ్యాంకేది?

జ. ఫెడరల్ బ్యాంకు

* Confession of dying minds: the blind faith of atheism పుస్తక రచయిత ఎవరు?

జ. హౌలియాన్ లాల్ గుయితే
( మణిపూర్ కు చెందిన IAS అధికారి ఇతను. వయస్సు 23.

* ఓజోన్ టూ క్లైమెట్ టెక్నాలజీ రోడ్డు షో ఏ నగరంలో నిర్వహించారు?

జ. ఆగ్రా

* సోనై రూపై అటవీ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?

జ. అసోం. (175 కిలోమీటర్ల వైశాల్యంతో కూడిన సంరక్షణ కేంద్రం తేజ్ పూర్ కు 75 కిలోమీటర్ల దూరంలో సోనిట్ పూర్ జిల్లాలో ఉంది.

అంతర్జాతీయం:

* చైనా రేటింగ్ తగ్గించిన ఆర్థిక సంస్థ ఏది?

జ. మూడీస్
( గడిచిన 28 ఏళ్లలో చైనా రేటింగ్ తగ్గడం ఇదే మొదటిసారి. Aa3గా ఉన్న ర్యాంకును A1ను మూడీస్ తగ్గించింది.

* రెండో ప్రపంచ యుద్ధం సమయంలో గల్లంతైన రెండు యుద్ధ విమానాలు ఎక్కడున్నట్టు కనుగొన్నారు?

జ. పపువా న్యూగినియా సముద్రజలాల్లో

* స్వలింగ వివాహాలకు ఆమోదం తెలిపిన తొలి ఆసియా దేశమేది?

జ. తైవాన్

* ఎయిర్ ల్యాండర్ 10 విమానం ప్రత్యేకతలేంటి?

జ. ప్రపంచంలోని అతి పెద్ద విమానమిది.
( దీని పొడవు 92 మీటర్లు. ఇది ఎయిరో ప్లేన్లు, హెలికాప్టర్లు, ఎయిర్ షిప్పుల సాంకేతిక పరిజ్ఞానాన్ని మిళితం చేసి దీన్ని తయారు చేశారు. హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్ సంస్థ దీన్ని రూపొందించింది. 6100 మీటర్లు ఎత్తులో ఎగరగల ఈ విమానం ఐదు రోజుల పాటు ఆకాశంలో ఎగరగలదు.

* 360 కేజీల బరువైన వజ్రాన్ని ఎక్కడ కనుగొన్నారు?

జ. బ్రెజిల్ లోని గనుల ప్రాంతం కమైబాలో
( దీన్ని ఏప్రిల్ లో కనుగొన్నారు. దాదాపు 1.3 మీటర్ల పొడువుంది ఈ వజ్రం)

* పదవికి రాజీనామా చేసిన నేపాల్ ప్రధాని ఎవరు?

జ. పుష్ప కమల్ దహల్ (ప్రచండ)

* నేపాల్ కొత్త ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు?

జ. షేర్ బహుదూర్ దేవ్ బా

* ప్రపంచ తాబేళ్ల దినంగా ఏ రోజు పాటిస్తారు?

జ. మే 23

* ఇటీవల కన్నుమూసిన జేమ్స్ బాండ్ స్టార్ రోజర్ మూర్ ఏ దేశస్థుడు?

జ. బ్రిటన్

* చైనా-పాకిస్తాన్ ఆర్థిక ప్రాజెక్టుతో భారత్ – పాక్ మధ్య మరిన్ని విభేదాలు తలెత్తుతాయని పేర్కొన్న నివేదిక ఏది ?

జ: ఐక్యరాజ్యసమితికి చెందిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక, సామాజిక కమిషన్

* మాంచెస్టర్ లో దాడికి పాల్పడిన యువకుడి పేరేంటి?

జ. సల్మాన్ అబేది

* ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు?

జ. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

* ఇంగ్లాండ్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫిలో భారత వైస్ కెప్టెన్ గా ఎవరు ఉండబోతున్నారు?

జ. రోహిత్ శర్మ ( గతేడాది వెస్టిండీస్ టూర్ లో వైస్ కెప్టెన్ గా అజింక్యా రహానే ఉన్నారు.)

* ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ( BWF) అథ్లెట్స్ కమిషన్ మెంబర్ గా ఎన్నికైన తెలుగు అమ్మాయి ఎవరు ?

జ : పి.వి. సింధు

  • Current affairs Date Wise – Click Here
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.