Current Affairs :31 May 2017

380 total views, 1 views today

Current Affairs 31 May 2017

జాతీయం

* 2017-18 సంవత్సరంలో భారత GDP పెరుగుదలపై ప్రపంచ బ్యాంకు అంచనాలేంటి?

జ. GDP వృద్ధి రేటు 7.2% ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

* కొత్తగా ఏ నోట్లు తిరిగి ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది?

జ. రూపాయి నోటు. (ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ సంతకం దీనిపై ఉంటుంది

* 2017 సంవత్సరానికి గాను, ఫిక్కీ స్మార్ట్ పోలీసు అవార్డు ఏ నగరం గెలుచుకుంది?

జ. పుణే. (పుణే పోలీసులు చేపట్టిన మహిళా సురక్షా ప్రాజెక్టు ఈ అవార్డు గెలుచుకుంది.

* జామియా మిలియా ఇస్లామియా ఛాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారు?

జ. నజ్మా హెప్తుల్లా

* నజ్మా హెప్తుల్లా ప్రస్తుత హోదా ఏంటి?

జ. ప్రస్తుతం ఆమె మణిపూర్ గవర్నర్
(నోట్: రాజ్యసభ సభ్యురాలిగా ఆమె 30 ఏళ్లపాటు కొనసాగారు. అందులో 16 సంవత్సరాలు ఆమె రాజ్యసభ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా ఆజాద్ మనవరాలు ఈమె.

* శానిటరీ ప్యాడ్స్ కు సంబంధించిన తొలి డిజిటల్ బ్యాంకు ఎక్కడ ప్రారంభమైంది?

జ. ముంబై యి నగరంలో

* ఎవరెస్టు శిఖరాన్ని ఆరుసార్లు అధిరోహించిన BSF అధికారి ఎవరు?

జ. లవ్ రాజ్ సింగ్ ధరమ్ శక్తు.
(NOTE: డెహ్రాడూన్ లోని BSF కార్యాలయంలో అసిస్టెంట్ కమాండర్*. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఈయన. 2014 లోనే భారత ప్రభుత్వం ఈయనను పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది.

* ప్లాస్టిక్స్ సంచులను నిషేధించిన రాష్ట్రమేది?

జ. గోవా
( NOTE: 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది

* భారత నౌకాదళం నుంచి రిటైరవుతున్న షిప్ ఏది?

జ. INS గంగా.
(NOTE: 32 ఏళ్లపాటు ఈ నౌక నావికాదళానికి సేవలందించింది. ముంబైలోని మజగావ్ డాక్స్ లో దీన్ని నిర్మించారు. ఇది భారత సైన్యానికి చెందిన జమ్ము కశ్మీర్ లైట్ ఇన్ ఫ్యాంట్రీ దళానికి అనుబంధంగా ఉండేది.

* ర్యాగింగ్ నిరోధానికి UGC చేపట్టిన చర్యలేంటి?

జ. కొత్తగా యాప్ ను UGC ఆవిష్కరించింది. దీని ద్వారా విద్యార్థులు తమ ఫిర్యాదులు నమోదు చేయవచ్చు.

* 2016 సంగీత నాటక అకాడమీ పురస్కార విజేత ఎవరు?

జ. సత్యబ్రత రౌత్.
(NOTE: డైరక్షన్, డిజైన్ లో విన్నూత బోధనారీతిని ఆవిష్కరించినందుకు రౌత్ ఈ పురస్కారం అందుకున్నారు.

* సంగీత నాటక అకాడమీ అత్యున్నత పురస్కార అకాడమీ రత్న పురస్కారం ఎవరు అందుకోనున్నారు?

జ. డాక్టర్ సునీల్ కొఠారి

* భారత్ లో ప్రకృతి సిద్ధమైన ఆకర్షణీయ ప్రాంతంగా ఏది ఎంపికైంది?

జ. లేక్ పిచోలా

( నోట్: ఇది రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉన్న కృత్రిమ సరస్సు ఇది. 1362లో దీన్ని నిర్మించారు. సమీప గ్రామం పిచోలి పేరును దీనికి పెట్టారు.*
* బై నో- పే లేటర్ పథకం దేనికి సంబంధించినది?

జ. రైలు ప్రయాణ టిక్కెట్ల రిజర్వేషన్

(నోట్: ఇప్పుడు టికెట్లు ఖరీదు చేసి 14 రోజుల్లోపు డబ్బు చెల్లించేందుకు ఈ పథకం వెసులుబాటు కల్పిస్తుంది. *
* మంచు శివలింగం ఎక్కడ ఏర్పడుతుంది?

జ. కశ్మీర్ లోని అమర్ నాథ్ గుహలో.

* జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా ఎవరు నియమితులు కానున్నారు?

జ. కేంద్ర మాజీ మంత్రి రామ్ శంకర్ కథేరియా

* మరుగుదొడ్ల వియోగంపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన దర్వాజా బంద్ ప్రచారంలో ఎవరు పాల్గొననున్నారు?

జ. అమితాబ్ బచ్చన్

అంతర్జాతీయం

* పిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారికి పాస్ పోర్టులు మంజూరు చేయరాదని ఏ దేశం నిర్ణయించింది?

జ. ఆస్ట్రేలియా

* రక్షణ రంగంలో భారత్ సహకారం తీసుకునేందుకు ఒప్పందంపై సంతకం చేసిన దేశమేది?

జ. ఫిజి.

* అణు ఇంధన ఉత్పత్తి చేయనున్న దేశమేది?

జ. కజకస్థాన్.
(నోట్: చైనా సహకారంతో ఈ దేశం 2019 నుంచి అణు ఇంధన ఉత్పత్తి చేయనుంది.

* అంతా మహిళలే పనిచేసే టీవీ ఛానల్ ఏ దేశంలో ప్రారంభమైంది?

జ. అఫ్ఘనిస్థాన్ లో. దీని పేరు జాన్ టీవీ (ZAN TV*
( నోట్: మే 30, 2017 నుంచి ఈ ఛానెల్ ప్రసారాలు మొదలయ్యాయి*

క్రీడలు

* మొనాకో గ్రాండ్ ప్రీ విజేత ఎవరు?

జ. సెబాస్టియన్ వెట్టల్

* బంగ్లాదేశ్ లో తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్న పెను తుపాను పేరేంటి ?

జ: మోరా


  • Latest Current Affairs Telugu, English – Click Here
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.