CURRENT AFFAIRS IN TELUGU
జాతీయం
6) డిజిటల్ ఇండియాలో భాగంగా స్మార్ట్ విలేజ్ లు గా అభివృద్ధి చేసేందుకు ఐక్యరాజ్యసమితి, IIITలతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది ?
జ: ఛత్తీస్ గఢ్
7) 2017 ఆసియాన్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ అధికారిక మస్కట్ ఏది ?
జ: ఆలీవ్ టర్టెల్
(నోట్: 2017 జులై 1 నుంచి 4 వరకూ భువనేశ్వర్ (ఒడిషా) లో జరుగుతాయి)
8) దేశంలో మొదటి బయో రిఫైనరీ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?
జ: మహారాష్ట్ర (రాహు –పుణే జిల్లా)
9) నవేగాన్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: మహారాష్ట్ర (గోండియా జిల్లాలో)
10) కవీందర్ సింగ్ భిస్త్ ఏ ఆటకు చెందిన క్రీడాకారుడు ?
జ: బాక్సింగ్
11) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ కు కొత్త ఛైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: బ్రజ్ బిహారీ కుమార్
12) 2017 మే నెల రెండో వారంలో అక్రమంగా నడుస్తున్న కబేళాలను మూసివేయాలని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు ?
జ: మధ్యప్రదేశ్
13) దాణా కుంభకోణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నాయకుడు ఎవరు?
జ. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్
14) భారత ప్రధాన న్యాయమూర్తి సహా మరో ఏడుగురు న్యాయమూర్తులకు జైలు శిక్ష విధించిన వివాదాస్పద న్యాయమూర్తి ఎవరు?
జ. జస్టిస్ సి.ఎస్.కర్ణన్ ( కలకత్తా హైకోర్టు)
15) సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) ఛైర్మన్ ఎవరు?
జ. సుశీల్ చంద్ర ( ఈయన పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పెంచారు)
16) 16వ లోక్ సభలో మూడో అతి పెద్ద పార్టీ ఏది?
జ. అన్నాడీఎంకె 37 ( బీజేపీ 282, కాంగ్రెస్ 45)
17) అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన పులిట్జర్ బహుమతి ఏ రంగంలో విశిష్ట సేవలకు అందిస్తారు?
జ. సాహిత్యం, జర్నలిజం
18) హీరాకుడ్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది?
జ.ఒడిషా
19) FDI అంటే ఏమిటి?
జ. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ( విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)
20) గోధుమ ఏ రకం పంట?
జ. రబీ పంట
21) ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ పేరులో ఏం మార్పులు చేశారు?
జ. ఛత్రపతి శివాజీ పేరుకు ముందు మహారాజా అనే పదాన్ని చేర్చారు.
22) నక్సల్స్ పై పోరాటానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న వ్యూహం పేరేంటి?
జ. సమాధాన్
23) గృహరుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన అతి పెద్ద బ్యాంకేది?
జ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
24) ఏ క్రీడాకారిణి జీవిత చరిత్రను వెండి తెరపై ఆవిష్కరించనున్నారు?
జ. షట్లర్ పి.వి.సింధు ( ప్రముఖ నటుడు సోను సూద్ ఈ చిత్రం నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు)
25) సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమా ఏది?
జ. సచిన్, ఎ బిలియన్ డ్రీమ్స్
అంతర్జాతీయం
26) 2017 ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించింది ఎవరు ?
జ: ఎమ్మాన్యుయేల్ మాక్రోన్
(నెపోలియన్ తర్వాత అధికారం చేపట్టిన చిన్న వయస్సున్న వ్యక్తి )
27) 2016 విజ్డన్ MCC (మెల్ బోర్న్ క్రికెట్ కౌన్సెల్) క్రికెట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు గెలుచుకున్నది ఎవరు ?
జ: సఖీబ్ మజీద్
28) స్మిమ్మింగ్ లెజెండ్ అడోల్ఫ్ ఖైఫర్ ఇటీవల చనిపోయారు. అతను ఏ దేశానికి చెందిన వారు ?
జ: అమెరికా
29) 2017 సూల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ గెలుచుకున్న దేశం ఏది ?
జ: గ్రేట్ బ్రిటన్ (ఆస్ట్రేలియాని ఓడించింది )
30) ఐక్యరాజ్యసమితి ఆవాసం (Human Settlements Programme (UN-Habitat) పాలక మండలి అధ్యక్ష బాధ్యతలు ఏ దేశానికి దక్కాయి ?
జ: ఇండియా ( కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షుడు)
31) Human Settlements Programme (UN-Habitat) 26వ సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు ?
జ: కెన్యాలోని నైరోబీలో
32) ఈగర్ లయన్ పేరుతో బహుళ దేశాల సైనిక విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: జోర్డాన్
(నోట్: యూరప్, ఆసియా, ఆఫ్రికా, అరబ్ దేశాలకు చెందిన 7400 బలగాలు పాల్గొంటున్నాయి )
33) బలికటన్ (Shoulder to shoulder) పేరుతో ఏ రెండు దేశాల మధ్య సైనిక విన్యాలు మనీలాలో జరుగుతున్నాయి ?
జ: అమెరికా – ఫిలిప్పీన్స్
34) 2017 వరల్డ్ రెడ్ క్రాస్ క్రీసెంట్ డే యొక్క థీమ్ ఏంటి ?
జ: Less Known Red cross stories
(నోట్: అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జాన్ హెన్నీ డాంట్ జయంతి సందర్భంగా మే 8న ఈ డేని పాటిస్తారు. )
35) MTV మూవీ, టీవీ అవార్డుల్లో Genderless Acting Award గెలుచుకున్న నటి ఎవరు ?
జ: హారీ పోటర్ ఫేమ్ స్టార్ ఎమ్మా వాట్సన్
36) విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ 156 వ జయంతి సందర్భంగా భారత్ ఆధ్వర్యంలో ఏ దేశంలో ప్రత్యేకంగా సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు ?
జ: ఈజిప్ట్
37) C919 ప్యాసింజర్ జెట్ విమానాన్ని ఏ దేశం విజయవంతంగా నడిపింది ?
జ: చైనా
38) జపాన్ లో మగవాళ్ళు మాత్రమే ఉండే ఓ దీవిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ కు ఎంపిక చేశారు. ఆ దీవి పేరేంటి ?
జ: ఒకినోషిమా ద్వీపం
39) సినిమాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి ఇటీవలే కన్నుమూసిన ఎవరికి 7వ ఆసియన్ అవార్డ్స్ అవార్డ్ ప్రకటించారు ?
జ: ఓం పురి
40) మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్లీ జీవితాన్ని సినిమాగా తీయబోతున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న భారతీయ దర్శకుడు ఎవరు ?
జ: శేఖర్ కపూర్ ( మూవీ పేరు: లిటిల్ డ్రాగన్ )
రాష్ట్రీయం
1) తెలంగాణలో సర్కారీ దవాఖానాల్లో ఇక ఏ రంగు దుప్పట్లు వాడనున్నారు?
జ. సాధారణ వార్డుల్లో గులాబీ, తెలుపు రంగు దుప్పట్లు. ఐసీయూల్లో ముదురు నీలం రంగు
2) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
జ. జస్టిస్ రమేశ్ రంగనాథన్
3) సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీసు అకాడమీ ఎక్కడ ఉంది?
జ. హైదరాబాద్
4) గల్ఫ్ కార్మికుల కోసం విదేశాంగ చేపడుతున్న కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ప్రారంభించాలని విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ నిర్ణయించారు. ఆ కార్యక్రమం పేరేంటి ?
జ: అవురీచ్
5) రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ పేరును ఏవిధంగా మార్చారు ?
జ: తెలంగాణ రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (TSREDCO)