Current Affairs Telugu 04 July 2017
Current Affairs Telugu : 04 July 2017
గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలను నిరోధించేందుకు రాష్ట్రంలోని 2 మండలాల్లో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది. దీనిలో భాగంగా ప్రజల నుంచి కిలో రూ.20 ధరకు ప్లాస్టిక్ వ్యర్ధాలను కొనుగోలు చేయనుంది. అనంతరం వీటిని చిన్నపాటి ముక్కులు చేశాక కిలో రూ.50 ధరకు పంచాయతీరాజ్ శాఖకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పస్తుతం కృష్ణా జిల్లా కంకిపాడు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 60 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ వ్యర్ధాలను ముక్కులుగా చేసే రెండు ప్లాస్టిక్ కటింగ్ యంత్రాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే శీఘ్ర ప్రతిస్పందన క్షిపణి(QRSAM)ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ అస్త్రానికి ఆకాశంలోని బహుళ లక్ష్యాలను నేలకూల్చే సత్తా ఉంది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న సమీకృత పరీక్షా వేదిక(ITR) నుంచి 2017 జులై 3న ఈ ప్రయోగం జరిగింది. 25 నుంచి 30 కి.మీ. ఎత్తులోని లక్ష్యాలను ఇది ఛేదించగదు. ప్రయోగానికి సంబంధించిన అన్ని క్ష్యాలూ నెరవేరాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) శాస్త్రవేత్తలు తెలిపారు.
Current Affairs today 04 july 2017