Current Affairs Telugu 06 July 2017

Current Affairs Telugu 06 July 2017

Current affairs telugu july 2017

Current Affairs Telugu 06 July 2017

  • గాంధీజీ చదివిన బడిని ప్రదర్శనశాలగా మార్చాలనే గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసు
  • రాజ్‌కోట్‌లో మహాత్మాగాంధీ చదువుకున్న పాఠశాలను ప్రదర్శనశాలగా మార్చాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై గుజరాత్‌ హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 164 సం॥ల నాటి ఆల్ఫ్రెడ్‌ ఉన్నత పాఠశాలను ప్రదర్శనశాలగా మార్చాలని గుజరాత్‌ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ బడినే మోహన్‌దాస్‌ గాంధీ ఉన్నత పాఠశాలగా కూడా పిలుస్తారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రమేష్‌ మన్‌సటా అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో గుజరాత్‌ హైకోర్టు 2017 జులై 5న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

  • అమెరికా వెళ్లే విమానాల్లో లాప్‌టాప్‌లకు అనుమతి
  • ఎమిరేట్స్‌, టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాల్లో అమెరికా వెళ్లే భారత్‌ తదితర దేశాల ప్రయాణికులు ఇక నుంచీ లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను వెంట తీసుకుని వెళ్లవచ్చు. దుబాయ్‌, ఇస్తాన్‌బుల్‌లతో సహా పది విమానాశ్రయాల నుంచి అమెరికాకు వెళ్లే ప్రయాణికులు క్యాబిన్‌ బ్యాగేజ్‌గా ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకుని వెళ్లడంపై అమెరికా 2017 మార్చిలో నిషేధం విధించింది. ఇలాంటి నిషేధాలు విధించిన విమానాశ్రయాల్లో అత్యధికం ముస్లిం దేశాలకు చెందినవే ఉన్నాయి. ఇపుడు వాటిని తొలగించడంతో అమెరికా వెళ్లేవారు లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను వెంట తీసుకుని వెళ్లచ్చునని ఎమిరేట్స్‌ సంస్థ తెలిపింది.

  • నీలి వెలుగులు విరజిమ్మే నక్షత్రాలు లార్జ్‌ మెగెల్లానిక్‌ క్లౌడ్‌ గెలాక్సీవి
  • జీఎస్టీ సందేహాల హెల్ప్‌లైన్‌ నంబరు 14404
  • జస్టిస్‌ కర్ణన్‌ కోర్టు ధిక్కరణ కింద శిక్షార్హుడే : సుప్రీం
  • ఐపీఎస్‌ల ప్రమోషన్‌లకు షేప్‌`1
  • విద్యుత్‌ కొనుగోళ్లకు ‘మెరిట్‌’ యాప్‌, ‘ఈ`వేలం’ పోర్టల్‌
  • పురావస్తు ప్రదర్శనశాలల్లో కళాఖండాల ఫొటో, వీడియో చిత్రీకరణకు రుసుము

  • Latest Current Affairs


  • Telugu – Current Affairs Telugu
  • English – Current Affairs Today