Current Affairs Telugu April 2017

CURRENT AFFAIRS IN TELUGU

రాష్ట్రీయం

1) వరంగల్ జిల్లాలోని చింతలపల్లి-శాయంపేట-ఊకల్ దగ్గర నిర్మించ తలపెట్టిన జౌళి పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ఆ పార్క్ పేరేంటి ?
జ: కాకతీయ అంతర్జాతీయ జౌళి (గార్మెంట్స్) పార్క్

2) పాస్ పోర్ట్ సేవలు, విదేశాల్లో భారతీయుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఏది ?
జ: విదేశీ సంపర్క్

3) ఏ బ్యాంకును తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది ?
జ: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్

4) రాష్ట్రంలో ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఫించన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.222కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఒంటరి మహిళలకు ఫించన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ?
జ: 2.5 లక్షల మంది

5) వినికిడి సమస్య ఉన్నవారు వాహనం నడుపుతున్నారనే గుర్తును ప్రారంభించిన తొలి రాష్ట్రమేది?
జ. తెలంగాణ

జాతీయం

6) గ్రెకో రోమన్ 80 కేజీల విభాగంలో 2017 ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న భారతీయ ఆటగాడు ఎవరు ?
జ: హర్ ప్రీత్ సింగ్

7) ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఎవరికి 2017 యంగ్ సైంటిస్ట్ అవార్డును ప్రకటించింది ?
జ: విక్రమ్ విశాల్

8) సుప్రీంకోర్టులో ఏ డిజిటల్ ఫైలింగ్ సిస్టమ్ ను అమలు చేయనున్నారు ?
జ: Integrated case Management Information system

9) 29వ ఇండియా – ఇండోనేషియా మారీటైమ్ ఎక్సర్ సైజెస్ కార్పాట్ 2017 ఏ నావల్ కమాండ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ?
జ: అండమాన్ అండ్ నికోబార్ కమాండ్

10) జాతీయ సాంకేతిక దినాన్ని ఏ రోజున జరుపుతారు?
జ. మే 11 ( ఈ రోజున భారత్ పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించింది)

11) 2017 నేషనల్ టెక్నాలజీ డే థీమ్ ఏంటి ?
జ: Technology for inclusive and sustainable growth

12) వ్యవసాయ రంగ సమస్యలను నేరుగా చెప్పుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆన్ లైన్ విధానం ఏది ?
జ: ఇ- కృషి సంవధ్

13) 2017 క్రికెట్ ఆస్ట్రేలియా గ్రేటెస్ట్ ఛాంపియన్షిప్ కు కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు ?
జ: సౌరవ్ గంగూలీ

14) ఆన్ లైన్, ఆఫ్ లైన్ షాపర్స్ కోసం… క్యాష్ బ్యాక్ చెల్లింపుల పోర్టల్ Cashkaro.com ఏ ప్రైవేటు సెక్టార్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: YES బ్యాంక్

15) గర్భస్థ శిశు మరణాలను అడ్డుకునేందుకు జిల్లా స్థాయిల్లో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్న రాష్ట్రం ఏది ?
జ: రాజస్థాన్

16) చంద్రుడి మీద కేబిన్ నిర్మించాలని ఏ దేశం భావిస్తోంది.
జ: చైనా

17) 2017 జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారీగా నిర్వహించడానికి ఏ సిటీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ?
జ: అహ్మదాబాద్

18) నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఎక్కడ కొత్త అకాడమీ ప్రారంభించింది?
జ. భారత్ లో (గ్రేటర్ నొయిడాలోని జేపీ గ్రీన్స్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో దీన్ని ప్రారంభించారు.)

19) మాదక ద్రవ్యాలకు బానిసలైన మహిళల కోసం ప్రత్యేక డి-యాడిక్షన్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు?
జ. పంజాబ్ లోని కపుర్తాలా జిల్లాలో.

20) పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన సమాచారాన్ని తెలియజెప్పేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్న వేదిక ఏది?
జ. దీపం (డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్.

21) భారత్ లో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు ప్రారంభించిన సంస్థ ఏది?
జ. ఒరాకిల్

22) భారత్, ఆస్ట్రేలియా సంయుక్త నౌక విన్యాసాలు ఎక్కడ జరగనున్నాయి?
జ. జూన్ నెలలో ఇవి పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో జరగనున్నాయి. ( అసిండెక్స్ పేరుతో తొలి విన్యాసాలు గతేడాది సెప్టెంబర్ లో బంగాళా ఖాతంలో నిర్వహించారు.

23)కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం వేతనం ఎంతుండాలని కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదించింది?
జ. రూ.10,000/- నెలకు. ( ప్రస్తుతం చాలా మంది కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనంగా దాదాపు 6వేల రూపాయలు అందుతోంది.)

24) నలందా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఎవరు నియమితులయ్యారు?
జ. హైదరాబాద్ ఇఫ్లూ ఉపకులపతిగా వ్యవహరించిన సునయానా సింగ్.

25) భారతీయుల మూలాలు ఏ ఖండంలో ఉన్నాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తేల్చారు ?
జ: ఆఫ్రికా ఖండంలో

26) గ్లోబల్ కార్పొరేట్ సిటిజన్షిప్ విభాగంలో ఉడ్రోవిల్సన్ అవార్డుకు ఎంపికైన భారతీయ మహిళ ఎవరు ?
జ: ICICI బ్యాంక్ ఎండీ, CEO చందాకొచ్చర్

అంతర్జాతీయం

27) 348 కోట్ల నాటిదిగా భావిస్తున్న శిలాజాన్ని ఎక్కడ కనుగొన్నారు?
జ. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పిల్బరా ప్రాంతంలో

28) చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రమేది?
జ. దంగల్( విడుదలైన వారంలోనే ఈ సినిమా చైనాలో రూ.148.67 కోట్లు వసూలు చేసింది)

 


ATTENTION APPSC GROUP-2 MAINS ASPIRANTS! DO YOU KNOW APPSC CONDUCTING MAINS EXAMS ONLINE ONLY? YOU MUST PRACTICE ONLINE EXAMS TO GAIN THE CONFIDENCE AND BE A WINNER!.

[maxbutton id=”1″ text=”Register for Test Series” url=”https://vyoma.net/exams/appsc/”]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.