Current Affairs:27/05/2017

Current Affairs:27/05/2017

జాతీయం

* నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏ రోజు అధికారం చేపట్టింది?

జ. మే 26, 2014 ( 3యేళ్ళు )

* పుస్తక రూపంలో రానున్న ప్రధాని మోదీ ప్రసంగాలేవి?

జ. రేడియోలో మన్ కీ బాత్ పేరుతో చేసిన ప్రసంగాలు (
(నోట్: మన్ కీ బాత్, ఏ సోషల్ రివల్యూషన్ ఆన్ రేడియో పేరుతో పుస్తక రూపంలో విడుదల చేయనున్నారు. దీన్ని రాజేశ్ జైన్ సంకలనం చేశారు.)

* కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఎవరు?

జ. మహేశ్ శర్మ

* ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన నగరమేది?

జ. ఢాకా
( నోట్: ఇక్కడ ప్రతీ చదరపు కి.మీకు 44,500 మంది నివసిస్తున్నారు.)

* జనసాంద్రత విషయంలో ముంబై నగరానికి ఏ స్థానం?

జ. ముంబై

( నోట్: ఇక్కడ ప్రతీ చదరపు కి.మీకి 31,700 మంది నివసిస్తున్నారు.
* ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ఏడో నగరమేది?

జ. రాజస్థాన్ లోని కోటా
( నోట్: ఈ నగరంలో అనేక శిక్షణా సంస్థలున్నాయి)

* ఎయిమ్స్ కొత్తగా ఎక్కడ నెలకొల్పేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది?

జ. అసోంలోని కామరూప్

* రైతుల కోసం ప్రత్యేకంగా డెబిట్ కార్డు ఆవిష్కరించిన సంస్థేది?

జ. ఇఫ్కో, బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసి ఈ డెబిట్ కార్డు ఆవిష్కరించింది
( నోట్: దీని ద్వారా రైతులు రూ.2500 వరకు వ్యవసాయానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. దీనికి నెలపాటు వడ్డీ ఉండదు)

* ఇండియా 2017 పుస్తక రచయిత ఎవరు?

జ. రాజీవ్ మహర్షి

* విదేశాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త వెబ్ పోర్టల్ ఏది?

జ. ఈ-సనద్.
( నోట్: విదేశీ వ్యవహారాల శాఖ దీన్ని రూపొందించింది. దీని ద్వారా ఆన్ లైన్ లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు)

* దేశంలో జలరవాణా మార్గాల నిర్వహణ, అభివృద్ధికి ఏం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది?

జ. సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి 2.5% మొత్తాన్ని కేటాయించడం ద్వారా
(నోట్: దీని ద్వారా జలరవాణా మార్గాల అభివృద్ధికి ఏటా అదనంగా రూ.2000 కోట్లు అందుతాయి)

* అమల్లో ఉన్న వెయ్యి రూపాయల నాణెం ఏ ఆలయం నిర్మించి వెయ్యేళ్ళయిన సందర్భంగా RBI ముద్రించింది ?

జ: తంజావూరులోని బృహదీశ్వరాలయం

అంతర్జాతీయం

* 70వ ప్రపంచ ఆరోగ్య మహాసభ (WHA 70) సమావేశాలకు ఏ నగరం ఆతిధ్యమిచ్చింది?

జ. జెనీవా

* ఈక్వెడర్ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?

జ. లెనిన్ మోరెనో

* 2017 నాటో సమావేశాలు ఏ దేశంలో జరగనున్నాయి?

జ. బెల్జియం

* NATO అంటే?

జ. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్

* 2018 నాటో సమావేశాలు ఎక్కడ జరగనున్నాయి?

జ. ఇస్తాంబుల్, టర్కీ

* బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రస్తు అధ్యక్షుడు ఎవరు?

జ. కె.వి.కామత్ (గతంలో ఈయన ఐసీఐసీఐ బ్యాంకు ఛైర్మన్ గా ఉన్నారు)

* అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ఏ దేశాన్ని సందర్శించారు?

జ. సౌదీ ఆరేబియా

* ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇనిస్టిట్యూట్ ఏ నగరంలో ఉంది?

జ. సియోల్, దక్షిణ కొరియా

* FM రేడియో ప్రసారాలను నిలిపివేసిన తొలి దేశమేది?

జ. నార్వే

క్రీడలు

* బ్యాడ్మింటన్ వల్డ్ ఫెడరేషన్ సభ్యత్వం ఎవరికి లభించింది?

జ. పి.వి.సింధు
( నోట్: ఎన్నికలో అత్యధికంగా 129 ఓట్లు సింధుకు లభించాయి. ఈ ఫెడరేషన్ లో సభ్యత్వం పొందిన రెండో భారతీయురాలు సింధు. గతంలో సైనా నెహ్వాల్ ఈ ఘనత సాధించారు.)

* 2018లో ఆసియా క్రీడలు ఏ నగరంలో జరగనున్నాయి?

జ. ఇండోనేషియాలోని జకార్తా

* 2018 ఆసియా క్రీడల నుంచి తొలగించిన ఆటలేంటి ?

జ. సర్ఫింగ్, సాంబో, స్కేట్ బోర్డింగ్, క్రికెట్

* భారత క్రికెట్ జట్టు కోచ్ ఎవరు?

జ. అనిల్ కుంబ్లే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.