Current Affairs:29/05/2017

220 total views, 1 views today

Current Affairs:29/05/2017

జాతీయం:

*పారిశుధ్యంలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు దేశంలో ఎన్ని పట్టణాల్లో నీలం, ఆకుపచ్చ బుట్టలు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ లో ప్రకటించారు ?
జ: నాలుగు వేల పట్టణాల్లో
*ప్రధాని నరేంద్ర మోడీ మే 29 నుంచి జూన్ 3 దాకా ఏయే దేశాల్లో పర్యటించనున్నారు ?
జ: జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో
*స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్ నియామకం కోసం ప్రక్రియను ఆర్థికశాఖ ప్రారంభించింది. ప్రస్తుతం SBI ఛైర్మన్, MD ఎవరు ?
జ: అరుంధతీ భట్టాచార్య
*ప్రస్తుత భారత ఆర్మీ చీఫ్ ఎవరు ?
జ: బిపిన్ రావత్
*అత్యధికంగా ఆరు సార్లు ఎవరెస్ట్ ఎక్కిన భారతీయుడిగా రికార్డు సృష్టించిన BSF అధికారి ఎవరు ?
జ: లవ్రాజ్ సింగ్ (ఉత్తరాఖండ్)
*200 ఏనుగుల బరువున్న స్వదేశీ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో భావిస్తోంది. దాని పేరేంటి ?
జ: GSLV మార్క్ 30
*మిషన్ అంత్యోదయ పథకం కింద దేశంలో ఎన్ని గ్రామపంచాయతీలను పేదరికం లేనివిగా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: 50 వేల గ్రామపంచాయతీలు
*మిషన్ అంత్యోదయ పథకంలో భాగంగా పేదరికం అంచనాకు ఎన్ని సూత్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది ?
జ: 18 సూత్రాలు
*దేశంలోనే అతి పెద్ద బ్రిడ్జి ధోలా-సాధియాను ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే ప్రారంభించారు. అది ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: అసోం
*ధోలా -సాధియా బ్రిడ్జిని ఏ నదిపై నిర్మించారు ?
జ: లోహిత్ నది ( బ్రహ్మపుత్ర ఉపనది)
*2017 ఆసియాన్ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ను నిర్వహించబోయే రాష్ట్రం ఏది ?
జ: మహారాష్ట్ర
*CBSE కి ఇటీవలే కార్యదర్శిగా నియమితులైన వ్యక్తి ఎవరు ?
జ: అనురాగ్ త్రిపాఠీ
*CEAT ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నది ఎవరు ?
జ: రవిచంద్రన్ అశ్విన్
*డెంగ్యూ వ్యాధికి కారణమైన జపనీస్ ఎన్సెఫలిటీస్ వాక్సినేషన్ ను రాష్ట్ర ప్రజలందరికీ వేయించాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది ?
జ: ఉత్తరప్రదేశ్
*స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ లో భాగంగా కొత్తగా ప్రారంభించే అంకుర పరిశ్రమలకు ఎన్నేళ్ళ పాటు ప్రభుత్వ రాయితీలు లభిస్తాయి ?
జ: 7 యేళ్ళ పాటు
*ప్రపంచంలో ఎక్కువమంది ఫేస్ బుక్ లో ఫాలో అవుతున్న నేత ఎవరు ?
జ: నరేంద్ర మోడీ

అంతర్జాతీయం:

*భారత్ కు చెందిన ఏ మహనీయుడి చరిత్రను లండన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా చేర్చారు ?
జ: మహాత్మా గాంధీ ( భారత స్వాతంత్ర్య ఉద్యమం కూడా)
*విశ్వంలో అంతుబట్టని రహస్యాలను ఛేదించేందుకు ప్రపంచంలోనే అతి పెద్ద టెలిస్కోప్ ను యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు దక్షిణ అమెరికాలోని చిలీలో నిర్మిస్తున్నారు. ఈ టెలిస్కోప్ వ్యాసార్థం ఎంత ?
జ: 39 మీటర్ల వ్యాసార్థం ( ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్) (2024లోగా దీని నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు)
*అల్ ఖైదాకు బాధ్యతలు చేపట్టనున్న ఒసాబా బిన్ లాడెన్ కొడుకు ఎవరు ?
జ: హమ్జా బిన్ లాడెన్
*భూతాపాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవాలని భావిస్తున్న అగ్రదేశం ఏది ?
జ: అమెరికా
*బృహస్పతి (జుపీటర్) లో అంతుచిక్కని రహస్యాలను కనుగొనడానికి నాసా చేపట్టిన మిషన్ ఏది ?
జ: జునో మిషన్
*ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరంగా దేన్ని UN Habitat గుర్తించింది ?
జ: ఢాకా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.