current affires 13june2017

current affires 13june2017

జాతీయం :

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు సమావేశం అవుతున్నారు ?

జ: జూన్ 26

* గ్రామీణ ప్రాంతాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లీగల్ సర్వీసెస్ అందించేందుకు కేంద్రం ప్రారంభించిన పథకం పేరేంటి ?

జ: టెలీ లా

* దేశంలోనే మొదటిసారిగా ఏ సిటీలో అండర్ వాటర్ మెట్రోని నిర్మిస్తున్నారు ?

జ: కోల్ కతా

* ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహణను ఏ సంస్థ తమ ఆధీనంలోకి తీసుకుంది ?

జ: భీమా నియంత్రణ సంస్థ ( IRDAI*

* ATM ల నుంచి 90శాతం బ్యాంకు సేవలు చేసుకునేలా లేటెస్ట్ టెక్నాలజీ ATM ను తయారు చేసిన సంస్థ ఏది ?

జ: NCR కార్పొరేషన్

* Little Miss Universe Internet 2017 & Little Miss Actress అవార్డులను మొదటిసారిగా దక్కించుకున్న భారతీయ బాలిక ఎవరు ?

జ: పద్మాలయ నంద (ఒడిషా*

* లిటిల్ మిస్ యూనివర్స్ 2017 పోటీలు ఎక్కడ జరిగాయి ?

జ: జార్జియాలోని బటుమి

* అజ్ఞాతంలో ఉంది రిటైర్డ్ అయిన మొదటి హైకోర్టు జడ్జి ఎవరు ?

జ: జస్టిస్ సీఎస్ కన్నన్

(నోట్: వివాదస్పద కోల్ కతా హైకోర్టు జడ్జి కన్నన్ కు కోర్టు ధిక్కారం కేసులో సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. అజ్ఞాతంలో ఉన్న ఆయన 12 జూన్ 2017 నాడు రిటైర్డ్ అయ్యారు *
* ప్రసారభారతి CEO గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?

జ: శశి శేఖర్

* కెనరా బ్యాంక్ తమ బ్రాంచ్ ల ద్వారా జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మేందుకు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

జ: న్యూ ఇండియా అస్సూరెన్స్

కంపెనీ లిమిటెడ్
* అమెరికాకి సంబంధించి ఏ వివాదంపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO* కి భారత్ ఫిర్యాదు చేసింది ?

జ: స్టీల్ ప్రొడక్ట్స్

* 22వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతోంది ?

జ: సిరి ఫోర్ట్ ఆడిటోరియం

* ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం లీజియన్ ఆఫ్ ఆనర్ కు ఎంపికైన భారతీయుడు ఎవరు ?

జ: సౌమిత్ర ఛటర్జీ

* 2017 కలింగ సాహిత్య అవార్డుకి ఎంపికైనది ఎవరు ?

జ: హరప్రసాద్ దాస్

* ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ కు ఏ విభాగంలో కళింగ లిటరరీ అవార్డు 2017 లభించింది ?

జ: కళింగ లిటరరీ యూత్ అవార్డ్

* కళింగ లిటరరీ అవార్డుల థీమ్ ఏంటి ?

జ: Literature for Peace and Harmony

* నవాబ్ జంగ్ పక్షుల సంరక్షణా కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?

జ: ఉత్తర ప్రదేశ్

* పేటిఎం మాల్ కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు ?

జ: అమిత్ సిన్హా

* ఇందిరా గాంధీ – ఎ లైఫ్ ఇన్ నేచర్ గ్రంథకర్త ఎవరు ?

జ: జైరాం రమేష్

* 2023 నాటికి 8 వేల కోట్ల రూపాయలతో ఎన్ని అధునాతన కోచ్ లు ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించింది?

జ: 40 వేల కోచ్ లు

* పనిలో నైపుణ్యం పెంచుకోడానికి, విద్యుత్ ను ఆదా చేసుకోవడం కోసం … ప్రత్యేక టైమ్ జోన్ కావాలని ఏ రాష్ట్రం కోరుతోంది ?

జ: అరుణాచల్ ప్రదేశ్

* పశువధ, అమ్మకాలు, కోనుగోళ్ళపై కేంద్రం విధించిన నిషేధాన్ని తిరస్కరించిన రాష్ట్రం ఏది ?

జ: మేఘాలయ ( ముఖ్యమంత్రి: ముకుల్ సంగ్మా*

* ప్రపంచంలోనే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ స్థానం ఎంత ?

జ: ఏడో స్థానం

* స్నాతకోత్సవాల్లో వేసుకునే రోబ్ ను నిరాకరించిన ముఖ్యమంత్రి ఎవరు ?

జ: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్
(నోట్: డెహ్రాడూన్ లోని పెట్రోలియం, విద్యుత్తు అధ్యయనాల విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవంలో ఇది జరిగింది. బ్రిటీష్ వలసపాలన విధానాలు కాకుండా భారతీయ దుస్తులే ధరించాలని అన్నారాయన*

అంతర్జాతీయం :

* ఆగ్నేసియా తీరప్రాంత దేశాలతో రక్షణ బంధం బోలోపేతం కోసం భారత్ నేవీకి చెందిన INS సహ్యాద్రి ఏ దేశ తీరానికి వెళ్లింది ?
పపువా తీరంలోని మోర్స్బే హార్బర్ కు
* ఆగ్నేసియా దేశాలతో బంధానికి ఇండియా ప్రకటించిన పాలసీ ఏంటి ?

జ: యాక్ట్ ఈస్ట్ పాలసీ

* ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ మెజార్టీ దిశగా పయనిస్తోంది. ఆయన పార్టీ పేరేంటి ?

జ: లా రిపబ్లిక్ ఎన్ మార్చే ( LREM*

* అంగారకుడి శిలల్లో విభిన్న ఖనిజాలు ఉన్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ – నాసా వెల్లడించింది. ప్రస్తుతం అంగారకుడిపై పరిశోధన చేస్తున్న రోవర్ పేరేంటి ?

జ: క్యూరియాసిటీ రోవర్

* బాట్ మన్ టీవీ సిరీస్ స్టార్ ఆడమ్ వెస్ట్ ఇటీవల చనిపోయారు. ఆయన ఏ దేశానికి చెందిన వారు ?

జ: అమెరికా

* ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినంను ఎప్పుడు జరుపుతారు ?

జ: జూన్ 12

* ప్రపంచంలోనే పెద్దదైన నీళ్ళల్లో తిరుగాడే సోలార్ ఫామ్ ను ఏర్పాటు చేసిన దేశం ఏది ?

జ: చైనా

(నోట్: 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో 15 వేల ఇళ్ళకు పవర్ సప్లయ్ చేయొచ్చు*
* 2017 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ?

జ: రాఫెల్ నాదల్


  • Current Affairs
  • Current Affairs telugu


  • current affires telugu – clickhere
  • current affairs english –clickhere