Daily Current Affairs Telugu 23 January 2018

Home>>Daily Current Affairs

Daily Current Affairs Telugu 23 January 2018

Daily Current Affairs Telugu 23 January 2018

స్విట్జర్లాండ్‌ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు నిక్లాజ్‌ శామ్యూల్‌

Daily Current Affairs Telugu 23 January 2018

– కర్ణాటకలోని ఓ ఆసుపత్రిలో పుట్టిన నిక్లాజ్‌ శామ్యూల్‌ అనే నిరుపేద తాజాగా స్విట్జర్లాండ్‌ పార్లమెంటుకు ఎన్నికయ్యాడు.
– 48 ఏళ్లక్రితం కర్ణాటకలోని ఉడుపి పట్టణంలో ఫ్రిట్జ్‌, ఎలిజబెత్‌ అనే స్విస్‌ దంపతులు నివసించేవారు.
– నిక్లాజ్‌ పుట్టిన 15 రోజులకు అతని తల్లి అయిన అనసూయ, తన పేదరికం కారణంగా పెంచుకోమని స్విస్‌ దంపతులకు ఇచ్చేసింది.
– అనంతరం నాలుగేళ్లపాటు కేరళలో నివసించిన ఆ దంపతులు నిక్లాజ్‌ను తీసుకుని స్విట్జర్లాండ్‌ వెళ్లిపోయారు.
– వారి పేదరికం కారణంగా అతన్ని ఉన్నత చదువు చదివించలేకపోయారు.
– అర్థం చేసుకున్న నిక్లాజ్‌ తోటపని చేస్తూ, ట్రక్కు నడుపుతూ చదువుకున్నాడు.
– 2017 నవంబరులో స్విస్‌ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యాడు.
– ఆ దేశ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఆనందిబెన్‌

– గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. – రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 జనవరి 19న ఉత్తర్వులిచ్చారు.
– ప్రస్తుతం గుజరాత్‌ గవర్నర్‌ ఓంప్రకాష్‌కోహ్లీ మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. – ఇప్పుడు ఆయన స్థానంలో ఆనందిబెన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.
– ఆమె 2014లో గుజరాత్‌ మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

అణ్వాయుధాల నిరోధక సంస్థ AGలో భారత్‌కు సభ్యత్వం

– అణ్వాయుధాల నిరోధానికి కృషి చేస్తున్న ఆస్ట్రేలియా గ్రూపు(AG)లో 2018 జనవరి 19న భారత్‌కు సభ్యత్వం లభించింది.
– ఎగుమతి చేసిన యురేనియం వంటి అణుపదార్థాలు రసాయన, జీవ ఆయుధాల తయారీకి ఉపయోగించకుండా నిరోధించేలా ఈ సంస్థ కృషి చేస్తోంది. ఈ సంస్థలో 43వ సభ్య దేశంగా భారత్‌ చేరింది.
– ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్న క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ పాలనా వ్యవస్థ (మిస్సైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రెజీం-MTCR), వాస్సేన్నార్‌ అగ్రిమెంట్‌ సంస్థల్లోనూ భారత్‌కు ఇదివరకే సభ్యత్వం లభించింది.
– ఈ మూడు సంస్థల్లో చైనాకు సభ్యత్వం లేపోవడం గమనార్హం.
– మరో సంస్థ అయిన అణు సరఫరాదార్ల బృందం (న్యూక్లియర్‌ సప్లయిర్స్‌ గ్రూపు-ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వానికి ప్రయత్నాలు జరిగినా చైనా, పాకిస్థాన్‌లు అడ్డుకోవడంతో అది సాధ్యపడలేదు.
AG-Australia Group
MTCR-Missile Technology Control Regime

సైన్స్‌, ఇంజినీరింగ్‌ పట్టభద్రుల తయారీలో అగ్రస్థానాన భారత్‌

– సైన్స్‌, ఇంజినీరింగ్‌ పట్టభద్రులను తయారుచేయడంలో భారత్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు ‘ఆన్యుయల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఇండికేటర్స్‌’ పేరుతో అమెరికాలోని నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ వెల్లడించిన నివేదిక స్పష్టం చేసింది.
– 2014లో సైన్స్‌, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రపంచవ్యాప్తంగా బ్యాచిలర్‌ పట్టాలు పొందినవారిలో నాలుగింట ఒక వంతు మంది భారతీయులేనని పేర్కొంది.
– ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మంది సైన్స్‌, ఇంజినీరింగ్‌ల్లో బ్యాచిలర్‌ కోర్సు పూర్తిచేశారని, వీరిలో భారతీయు 25%, చైనీయు 22%, ఐరోపా సమాఖ్యకు చెందినవారు 12%, అమెరికన్లు 10% ఉన్నారని వెల్లడించింది.
– పరిశోధక (డాక్టోరల్‌) డిగ్రీల్లో మాత్రం అమెరికానే ముందంజలో ఉంది.
– 2014లో ఆ దేశంలో 40,000 మంది ఈ పట్టాలు అందుకున్నారు.
– వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా (34,000), రష్యా (15,000), బ్రిటన్‌ (14,000), భారత్‌ (13,000) ఉన్నాయి.
– పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)కి సంబంధించిన వ్యయం చేయడంలో కూడా అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.
– ప్రపంచవ్యాప్త వ్యయంలో 26% వాటా అమెరికాదే. 21% వాటాతో చైనా రెండో స్థానంలో ఉంది.
– మిగతా దేశాలు, ముఖ్యంగా చైనా గణనీయమైన ప్రగతిని సాధిస్తుండటంతో శాస్త్ర సాంకేతిక కార్యాకలాపాలల్లో అమెరికా వాటా తగ్గిపోతోందని ఈ నివేదిక వెల్లడించింది.

Read More Current Affairs – Telugu Current Affairs


People Also Search This Post Using Following Keywords:
current affairs telugu, telugu current affairs, daily current affairs, current affairs bits, current affairs in telugu, current affairs today, current affairs material, current affairs 2018, national current affairs