Daily Telugu Current Affairs Highlights 03 March 2018

Daily Telugu Current Affairs Highlights 03 March 2018

Daily Telugu Current Affairs Highlights 03 March 2018

>కిర్గిజ్‌స్థాన్‌ ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళగా నవ్‌జోత్‌కౌర్‌ రికార్డు సాధించింది
>భారత మహిళల టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 2018 మార్చి 1న పంజాబ్‌ పోలీసు శాఖలో డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టింది
>క్యాన్సర్‌ చికిత్సలో పరిశోధనకు గాను భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త నవీన్‌ వరదరాజన్‌కు రూ.7.65 కోట్ల గ్రాంట్‌ మంజూరయింది
>విద్యుదుత్పత్తి శాతం(PLF)లో దేశంలోని థర్మల్‌ కేంద్రాల్లో సింగరేణి కేంద్రం 5వ స్థానంలో నిలిచింది
>పూర్తిగా మహిళా సిబ్బందితో నావికా సాగర్‌ పరిక్రమ సాహసయాత్ర చేస్తున్న తెరచాపతో నడిచే నావ INSV తరణి ఇప్పుడు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ చేరుకుంది
>ప్రపంచ మేటి యూనివర్సిటీ జాబితాలో అమెరికా సత్తాచాటింది. తొలి 10 విద్యాసంస్థల్లో 5 అగ్రరాజ్యమైన అమెరికావే ఉన్నాయి
>18 నిమిషాల్లో వేమన శతకంలోని 100 పద్యాలను చూడకుండా పాడి ఆరున్నరేళ్ల బాల కవయిత్రి శ్రేష్ట ప్రవస్థి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కింది
>ప్రముఖ రచయిత, సినీ సమీక్షకుడు, కథకుడు, నవలాకారుడు, సాంఘిక సేవా కార్యకర్త దేవరాజు రవి (80) 2018 మార్చి 2న మృతి చెందారు
>ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ (FTAPCCI) సెక్రటరీ జనరల్‌గా సంజయ్‌ కపూర్‌ ఎంపికయ్యారు
>మహిళలపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా రెడ్‌ బ్రిగేడ్‌ సంఘం ఆధ్వర్యంలో 15 మంది మహిళలు 2018 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌ నుంచి చేపట్టిన ర్యాలీ 2018 మార్చి 2న శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ముగిసింది
>నగరాలను మహిళలకు సురక్షితంగా మార్చేందుకు కేంద్రం రూ.2,900 కోట్లు కేటాయించింది
>పారా స్విమ్మర్‌ ప్రశాంత కర్మాకర్‌పై పారాలింపిక్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా 3 సం॥ల నిషేధం విధించింది
>జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(NCLT) హైదరాబాద్‌ బెంచ్‌లో జ్యుడిషియల్‌ సభ్యులుగా నియమితులైన బిక్కి రవీంద్రబాబు 2018 మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు