Daily Telugu Current Affairs Highlights 06 March 2018

Daily Telugu Current Affairs Highlights 06 March 2018

Daily Telugu Current Affairs Highlights 06 March 2018

>అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రపంచ అధునాతన వాతావరణ ఉపగ్రహం GOES-Sను ప్రారంభించింది
>ప్రపంచంలో క్రిప్టో కరెన్సీని లీగల్‌ టెండర్‌గా గుర్తించిన మొదటి దేశంగా పసిఫిక్‌ మహాసముద్రంలోని మార్షల్‌ ద్వీపాలు ఘనత సాధించాయి
>19వ ఫిక్కి ఫ్రేమ్స్‌ను 2018 మార్చి 5న ముంబైలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతిఇరానీ ప్రారంభించారు
>2018 స్నూకర్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ను భారత జోడి పంకజ్‌ అద్వానీ-మనన్‌ చంద్ర గెలుచుకుంది
>ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థినులు, ఉపాధ్యాయులు కలిసి రెండు నిమిషాల్లోనే అతిపెద్ద స్త్రీ ఆకృతిని ప్రదర్శించి ‘ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించారు
>భూమిని పోలిన 3 భారీ గ్రహాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు
>స్కాట్లండ్‌ యార్డ్‌ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతిగా భారత సంతతి అధికారి నీల్‌బసు నియమితులయ్యారు
>విద్యార్థినులకు ఉచితంగా సానిటరి నాప్‌కిన్‌లు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఖుషి పథకాన్ని ప్రారంభించింది
>ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఉమా సుధీర్‌ 2017 సంవత్సరానికి ప్రతిష్టాత్మక చమేలీ దేవి అవార్డుకు ఎంపికయ్యారు
>ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 3న వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ డేను నిర్వహించారు. 2018 వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ డే థీమ్‌ – Big cats – predators under threat