Daily Telugu Current Affairs Highlights 07 March 2018

Daily Telugu Current Affairs Highlights 07 March 2018

Daily Telugu Current Affairs Highlights 07 March 2018

>ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానాన్ని అధిరోహించారు
>ప్రపంచంలో అత్యంత బలమైన సైనికశక్తిని కలిగిన దేశంగా అమెరికా నిలిచింది,భారత్‌ 4వ స్థానంలో నిలిచింది
>వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో సచిన్‌, ఆమ్లాల తర్వాత 11 విభిన్న దేశాలపై సెంచరీలు చేసిన ప్లేయర్‌గా క్రిస్‌ గేల్‌ రికార్డు
>భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉన్న సౌదీ అరేబియాను ఇరాక్‌ అధిగమించింది
>భారత యువ షూటర్‌ మను బాకర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో ఒక్క రోజు వ్యవధిలో రెండు స్వర్ణాలతో సంచలనం సృష్టించింది
>ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించడంలో ముంబై, డిల్లీ విమానాశ్రయాలు ముందున్నాయని 176 దేశాల్లోని 1953 విమానాశ్రయాలను పరిశీలించిన ఎయిర్‌ పోర్టు కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వెల్లడించింది
>ఇండియన్‌ నేవీకి చెందిన అండమాన్‌ నికోబార్‌ నావల్‌ కమాండ్‌ 2018 మార్చి 6న పోర్ట్‌బ్లెయర్‌లో ‘మిలాన్‌-2018’ పేరిట మల్టీ నేషనల్‌ మెగా ఈవెంట్‌ను ప్రారంభించింది
>అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెర్‌ మిట్టల్‌ ప్రెసిడెంట్‌గా ఆదిత్య మిట్టల్‌ నియమితులయ్యారు
>అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలో వివిధ రంగాల్లోని 20 మంది మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది
>మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(NPP) అధినేత కాన్రాడ్‌ సంగ్మా (40) 2018 మార్చి 6న పదవీ బాధ్యతలు చేపట్టారు
>బెంగళూరులో ట్రాఫిక్‌ రద్దీ పెరిగిపోవడంతో పలు ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునేందుకు హెలీ ట్యాక్సీలు అందుబాబులోకి వచ్చాయి
>తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట ఫాతిమానగర్‌ కేంద్రంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ‘బాల వికాస’ సాంఘిక సేవా సంస్థ లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది
>తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ)గా రజత్‌కుమార్‌ 2018 మార్చి 6న బాధ్యతలు స్వీకరించారు
>ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసారిగా తిరుపతి రైల్వేస్టేషన్‌లో మహిళా ప్రయాణికుల కోసం శానిటరీ నాప్కిన్‌ వెండింగ్‌ మిషన్‌ అందుబాటులోకి వచ్చింది