Daily Telugu Current Affairs Highlights 15 March 2018

Daily Telugu Current Affairs Highlights 15 March 2018

Daily Telugu Current Affairs Highlights 15 March 2018

>2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 7.3 శాతానికి చేరొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది
>జర్మన్‌ ఛాన్స్‌ర్‌గా ఏంజెలా మెర్కల్‌ నాలుగోసారి ఎన్నికయ్యారు
>యూరియా ఎరువులపై ఇస్తోన్న రాయితీని 2020 వరకూ కొనసాగించాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్‌(CCEA) నిర్ణయించింది
>భారతదేశంలో అత్యంత ఎత్తయిన జాతీయ జెండాను కర్ణాటకలోని బెలగావి(బెల్గాం)లో ఏర్పాటు చేశారు
>ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ICMR)కు 2017 సం॥నికి గాను ఇంటర్నేషనల్‌ కొచ్చన్‌ ప్రైజ్‌ దక్కింది
>ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు స్మార్ట్‌ సిటీ జాబితాలో ప్రపంచంలోనే 20వ స్థానం దక్కింది
>భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 మార్చి 13న మారిషస్‌ రాజధాని పోర్ట్‌ లూయిస్‌లో వరల్డ్‌ హిందీ సెక్రటేరియట్‌ను ప్రారంభించారు
>నగరాల్లో వాహనాల కనీస వేగ పరిమితిని గంటకు 70 కిలోమీటర్లకు పెంచుతూ కేంద్ర రోడ్డురవాణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది
>జనసేన పార్టీ 4వ వార్షికోత్సవ మహాసభను 2018 మార్చి 14న ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో నిర్వహించారు
>భారత్‌ వృద్ధి వేగం 2018లో ఊహించినదానికన్నా వేగంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డెలాయిట్‌ నివేదికలో పేర్కొంది
>ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో జపాన్‌కి చెందిన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కుమి యుమి ఒక బహుళ ప్రయోజనకర కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించనుంది
>ఆఫీస్‌ అద్దెలు డిల్లీలోని కనాట్‌ప్లేస్‌లో అత్యంత ఎక్కువగా ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ నివేదిక తెలిపింది

?Read Detailed Articles Here