Economic Survey Budget 2020 in Telugu

ఆర్థిక సర్వే 2020

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. రెండు విడతలుగా సమావే శాలు కొనసాగనున్నాయి. తొలి దశను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో దశను మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహిస్తారు. సమావేశాల తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రైల్వే పద్దును కూడా వార్షిక పద్దులోనే కలిపి ప్రకటించనున్నారు దేశ వృద్ధి రేటు రానున్న ఆర్థిక సంవత్సరం (2020-21)కు   6నుంచి 6.5శాతం నమోదవుతుందని  ఆర్థిక సర్వే అంచనా వేసింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు ప్రభుత్వం ప్రధానంగా ఈ ఆర్థిక సర్వేను తయారుచేస్తుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టడానికి చేయాల్సిన విధాన మార్పులతో పాటు ప్రభుత్వం ఏం చేయాలన్నదానిపై సర్వే సూచనలు చేస్తుంది.

ఆర్థిక సర్వేలో కీలక అంశాలు..

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో పలు ఉపశమన చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఉత్తేజం పెంచేందుకు ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే రాబడిపై విధించే క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ను పూర్తిగా ఎత్తివేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఏదైనా స్థిరాస్థిని విక్రయించగా సమకూరే మొత్తాన్ని మూడేళ్లలోగా మరో ఆస్తి కొనేందుకు పెట్టుబడి పెట్టని పక్షంలో దానిపై 30 శాతం క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ విధిస్తున్నారు. ఈ ట్యాక్స్‌ రద్దుతో నిర్మాణ రంగంలో కార్యకలాపాలు జోరందుకుంటాయని అంచనా వేస్తున్నారు. 2025 సంవత్సారానికల్లా దేశం నిర్దేశించుకున్న5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సర్వే పై రాషష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు సంబంధించిన స్థితిగతులను తెలుసుకోవడంలో ఆర్థిక సర్వే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

2020 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6 నుంచి 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. భారత జీడిపీ వృద్ధిరేటు 4.7గా ఉంటుందని ఐఎంఎఫ్ వేసిన అంచనాను ఆర్థిక సర్వే  తోసిపుచ్చింది. సంస్కరణలను త్వరితగతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని సర్వే కోరింది. 2019లో 3.2 శాతంగా ఉన్న ద్రవ్యోల్భణం 2019 డిసెంబర్ నాటికి 2.6 శాతానికి స్వల్పంగా తగ్గినట్టు పేర్కొంది.

✺  మార్కెట్లు అందుబాటులోకి తీసుకురావడం, వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థల్లో విశ్వాసాన్ని పెంపొందించడం

అనే ఇతివృత్తంతో 2019-20 సర్వేను తీసుకొచ్చారు.

✺ 5ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి నైతికవిలువలతో కూడిన సంపద చాలా కీలకం

✺ ఏప్రిల్‌1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6-6.5శాతం మధ్య ఉండవచ్చని అంచనా.

✺ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రపంచంలోని పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటాయి.

✺ ఈ సారి ఆర్థిక కవర్‌ పేజీలను ఊదారంగులో తయారు చేశారు.

✺ ద్రవ్యలోటు విషయంలో కొంత సడలింపు ఉండాలని సర్వే సూచించింది.

✺ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయాలు అంచనాల కంటే తగ్గే అవకాశం ఉంది.

✺ వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ పన్ను ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

✺ ప్రస్తుత ఆర్థిక వృద్దిరేటు 5శాతం ఉంది.

✺2011-12 నుంచి 2017-18 మధ్యలో 2.62 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగింది.

✺ ‘తాలినామిక్స్‌’ పేరుతో అర్థశాస్త్రాన్ని సామాన్యూడికి అన్వయించే ప్రయత్నం చేశారు. ఒక ప్లేటు భోజనం కొనుగోలు చేసేశక్తి 29శాతం

మెరుగుపడిందని ఈ సర్వే పేర్కొంది.

✺ 2022 నాటికి వ్యవసాయదారుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

✺ ప్రభుత్వం చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపార సంస్థలకు రుణసదుపాయం, సాంకేతికతను అందించడం, ఈవోడీబీ, మార్కెట్లను

అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉంది.

✺ హైవేలు, రోడ్లపై పెట్టుబడులు 2014-15 నుంచి 2018-19 వరకు మూడు రెట్లు పెరిగాయి.

✺ భారత వాణిజ్య పరిమాణంలో 95శాతం మొత్తం, కరెన్సీ విలువలో 68శాతం సరుకులు సముద్రమార్గంలోనే రవాణా చేశారు.

✺ భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక మందిని రవాణా చేసిన సంస్థగా రికార్డు సృష్టించింది. 120 కోట్ల టన్నుల సరకు, 840 కోట్ల మంది

ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.

✺ భారత్‌లో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతంగా జరగాలని సర్వే వెల్లడించింది. లాభదాయకత, సామర్థ్యం, పోటీతత్వం, నైపుణ్యం

పెంచడానికి ఇది అవసరం అని వెల్లడించింది.

✺ ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకం అని సర్వే చెప్పింది. లబ్ధిదారులు తక్కువ ఖర్చుపెడతారు.. తక్కువ పొదుపు చేస్తారు.. తక్కువ

పెట్టుబడి పెడతారని చెప్పింది.

✺ మాఫీలు రుణ వ్యవస్థను దెబ్బతీస్తాయని వెల్లడించింది.

✺ ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గణనీయమైన మెరుగుదల సాధించాం. భారత్ ర్యాంక్ 79 స్థానాలు మెరుగుపడింది. 2014లో 142వ స్థానం నుంచి 2019లో 63వ స్థానానికి చేరుకున్నాం.
✺ 2020 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6-6.5 శాతంగా ఉండొచ్చు.
✺ ప్రతి సంవత్సరం అధిక పన్ను ఆదాయ వృద్ధి సాధ్యం కాదు.
✺ ఇన్వెస్ట్‌మెంట్లకు మూలధనం తగ్గింపు వల్ల దేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.
✺ ఆర్థిక వృద్ధిని కోరుకుంటే.. కచ్చితంగా ద్రవ్య లోటు లక్ష్యాన్ని సడలించుకోవాల్సిందే. ద్రవ్య లోటు లక్ష్యానికి కట్టుబడి ఉండటమా? లేదా ఆర్థిక వృద్ధా? రెండింటిలో ఏదో ఒకటే సాధ్యమౌతుంది.
✺ 2019-2020 ఆర్థిక వ్యవస్థ పన్ను వసూళ్లు అంచనా వేసిన దాని కన్నా తగ్గొచ్చు.
✺ ఇళ్ల ధరలు పెరిగాయి. దీని వల్ల బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల బ్యాలెన్స్‌షీట్లు ప్రక్షాళన అవుతాయి.
✺ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి 2.5 శాతంగా అంచనా వేశారు.
✺ 2011-12 నుంచి 2017-18 మధ్య కాలంలో దేశంలో 2.62 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది.
✺ వ్యవసాయ రంగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో తగ్గొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 2.8 శాతంగా ఉండొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.9 శాతంగా నమోదు కావొచ్చు.
✺ 2014 నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 4.1 శాతంగా ఉండొచ్చు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఎక్కువ.
✺ చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద ఎమర్జింగ్ గ్రీన్ బాండ్ మార్కెట్‌గా అవతరించింది.
✺ 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ్ పథకం కింద 47.33 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది.
✺ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద 2014 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్లకు పైగా టాయిలెట్లను నిర్మించారు.
✺ 2018లో ఏకంగా 1,24,000 కంపెనీల ఏర్పాటు జరిగింది. ఈ విషయంలో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో నిలిచింది.

✺ చైనా సహా పలు దేశాల నుంచి దిగుమతవుతున్న 50 రకాల వస్తువులు, ఉత్పత్తులపై దిగమతి సుంకాలను పెంచేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఎలక్ర్టానిక్స్‌, ఎలక్ర్టికల్‌ పరికరాలు, రసాయనాలు, హ్యాండీక్రాఫ్ట్స్‌ వంటి పలు వస్తువులపై సుంకాల పెంపునకు రంగం సిద్ధమైందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించే వార్షిక బడ్జెట్‌లో ఈ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.కస్టమ్స్‌ డ్యూటీలను పెంచడం వల్ల మొబైల్‌ ఫోన్‌ చార్జర్లు, పారిశ్రామిక రసాయనాలు, ల్యాంప్‌లు, ఫర్నీచర్‌, క్యాండిల్స్‌, జ్యూవెలరీ, హ్యాండీక్రాఫ్ట్‌ ఐటెమ్స్‌ సహా పలు వస్తువులు, ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఆటో ఇండస్ట్రీ

రాబోయే యూనియన్ బడ్జెట్‌లో తమకు ప్రోత్సాహకాల కల్పించాలని ఆటోమొబైల్ పరిశ్రమ భావిస్తోంది. సుదీర్ఘ మందగమనం, 2019 లో రెండు దశాబ్దాలు కనిష్టానికి పడిపోయిన అమ్మకాలు నేపథ్యంలో ఆటో రంగ పునరుద్ధరణకు  కొన్ని ఆర్థిక చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వాన్ని కోరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా వాహనలపై జీఎస్‌టీ భారం తగ్గింపు,  లిథియం-అయాన్ బ్యాటరీల దిగుమతిపై సుంకం రద్దు చేయడం వంటి చర్యలను  పరిశ్రమ  ఆశిస్తోంది.

దాదాపు ఏడాది కాలంగా తిరోగమనాన్ని ఎదుర్కొంటున్న ఆటో మొబైల్‌  పరిశ్రమ, పాత వాహనాల వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకు ప్రోత్సాహక ఆధారిత స్క్రాపేజ్ విధానంతోపాటు వాహనాల రీ-రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని భావిస్తోంది.  అలాగే బీఎస్‌-6 ఉద్గార నిబంధనల  అమలును పరిశ్రమ స్వాగతిస్తోంది.  ఈ చొరవ వాహన వ్యయంలో 8-10 శాతం పెరుగుదలకు దారితీస్తుందని, తద్వారా ప్రభుత్వానికి జీఎస్‌టీ  వసూళ్లు పెరుగుతాయని భావిస్తోంది. అయితే, ఈ అదనపు ఖర్చు డిమాండ్ తగ్గడానికి దారి తీస్తుందనీ,  ఈ క్రమంలో ఏప్రిల్ నుండి  బీఎస్‌ 6 వాహనాలపై  ప్రస్తుతం వసూలు చేస్తున్న 28 శాతం జీఎస్‌టీని 18 శాతానికి తగ్గించాలని కోరుతోంది.

కాగా  2019 లో వాహనాల అమ్మకాలు 20 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. గత వారం  సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అన్ని వాహన విభాగాల్లో నూ 13.77 క్షీణతను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఆదాయపు పన్నులు నాలుగు శ్లాబ్‌లలో ఉండాలి

వ్యక్తిగత ఆదాయపు పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌సీ గర్గ్‌ అభిప్రాయపడ్డారు. సెస్సులు, సర్‌చార్జీలు లేకుండా దీన్ని నాలుగు రేట్లకు పరిమితం చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ విధానాన్ని ఇప్పటికే సముచిత స్థాయిలో హేతుబద్ధీకరించినందున.. ఇక ఆ విషయంలో తదుపరి చర్యలేమీ ఆశించడానికి లేదని గర్గ్‌ చెప్పారు. అయితే, వ్యక్తిగత ఆదాయపు పన్నుల విషయంలో కొన్ని కీలకమైన సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆదాయపు పన్నుకు సంబంధించి ఎనిమిది శ్లాబ్‌లు ఉన్నాయి. గరిష్టంగా 40% రేటు ఉంటోంది. రూ. 5 లక్షలకు లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను విధించరాదని గర్గ్‌ ప్రతిపాదించారు. రూ. 5–10 లక్షల మధ్య ఆదాయ వర్గాలపై 5 శాతం, రూ. 10–25 లక్షల ఆదాయాలపై 15 శాతం, రూ. 25–50 లక్షలపై 25 శాతం, రూ. 50 లక్షల పైబడిన ఆదాయంపై 35% రేటు విధిస్తే సముచితంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు.

https://vyomaonline.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.