Geographical geographies of India భారతదేశ భౌగోళిక భూస్వరూపాలు
■ భారతదేశాన్ని ప్రధానంగా ఆరు నైసర్గిక భాగాలుగా విభజించవచ్చు
1. హిమాలయాలు
2. గంగాసింధు మైదానాలు
3. ద్వీపకల్ప పీఠభూమి
4. తీరమైదానం
5. తూర్పు, పశ్చిమ కనుమలు
6. దీవులు
హిమాలయాలు
ఇవి అతితరుణ ముడత పర్వతాలు – హిమాలయాలు ఉన్నచోట ఒకప్పుడు టెథిస్ అనే సముద్రముండేది.
– అంగోరా, గోండ్వానా అనే ఖండఫలకాలు దగ్గరగా రావడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయని ఖండచలన సిద్ధాంతం (వెజ్నర్) తెలియజేస్తుంది.
– ఇవి టెర్షయరీ యుగానికి (60 మిలియన్ సంవత్సరాలు) చెందినవి.
– హిమాలయాలు జమ్ము-కాశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకూ 2400 కిలోమీటర్ల పొడవుతో, 150 -400 కిలోమీటర్ల వెడల్పుతో ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి.
– హిమాలయాల్లో మూడు శ్రేణులు ఉన్నాయి
1. హిమాద్రి (ఉన్నత హిమాలయాలు)
2. హిమాచల్ (నిమ్న హిమాలయాలు)
3. శివాలిక్ (బాహ్య హిమాలయాలు)
1. హిమాద్రి (ఉన్నత హిమాలయాలు)
హిమాద్రి 25-40 మిలియన్ సంవత్సరాల క్రితం ఓలిగోసియన్ యుగంలో ఏర్పడ్డాయి.
– ఇవి ఉత్తరాన ఉన్న అత్యంత పురాతన, అవిచ్ఛిన్న, ఎత్తయిన శ్రేణి. వీటి సగటు ఎత్తు 6100 మీటర్లు వెడల్పు 120-190 కిలోమీటర్లు.
– ఇవి వాయవ్య దిశలో నంగా ప్రభాత్ శిఖరం నుంచి ఈశాన్యంలో నామ్యాబార్వా వరకూ కొడవలి ఆకారంలో విస్తరించి ఉన్నాయి.
– ఇవి అరుణాచల్‌ప్రదేశ్ వద్ద వంపు (జడపిన్ను) తిరిగి ఫొటోయేబమ్గా పిలవబడుతున్నాయి.
– గ్రానైట్, షీస్ట్, నీసే వంటి స్పటికాకార శిలలతో ఏర్పడినాయి.
– హిమాద్రి అనేక ఎత్తయిన శిఖరాలకు ప్రసిద్ధి.
ఎవరెస్ట్ శిఖరం
ఇది హిమాద్రిశ్రేణిలో కలదు. నేపాల్‌లో ఉంది.
– టిబెట్‌లో ‘చోమోలుగ్మా’ అని చైనాలో ‘కోమోలుగ్మా’, నేపాల్‌లో సాగర్వంత అని పిలుస్తారు.
– దీనిని 1865 వరకూ పీక్ 15గా వ్యవహరించేవారు. 1865 సర్వాజనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఆండ్రూస్ సలహా మేరకు ఎవరెస్ట్ అని పేరు పెట్టారు.
– 1953 మే 29న ఎడ్మండ్ హిల్లరీ (సర్వాజిలాండ్), టెన్సింగ్ నార్వే (నేపాల్) మొదట అధిరోహించారు.
– ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన అతిపిన్న వయస్కురాలు మాలవత పూర్ణ (13 సంవత్సరాల 11 నెలలు).
2. హిమాచల్ (నిమ్న హిమాలయాలు)
దీని సగటు ఎత్తు 1500 – 4500 మీటర్లు. వెడల్పు 60-80 కిలోమీటర్లు.
– హిమాద్రికి దక్షిణంగా మియోసిన్ యుగంలో ఏర్పడ్డాయి.
– గ్రానైట్, నీస్ శిలలతో ఏర్పడ్డాయి.
– సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, చక్రాటా, రాణిఖేట్, అత్మోరా, డార్జిలింగ్ వంటి వేసవి విశ్రాంతి స్థావరాలు ఉన్నాయి.
ఎ. పిర్ పంజాల్ శ్రేణి : జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో పొడవైనది. దీనిపొడవు 400 మీటర్లు. దీనిలో బనియన్ కనుమ గలదు.
హిమాద్రికి, పీరపంజల్కి మధ్యలో కాషిర్లోయ ఉన్నది. దీనికి భూతల స్వర్గం అనిపేరు.
బి. దేవధార్ శ్రేణి : పిర్పంజల్ యొక్క నైరుతిభాగంలో హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది. కలు, కాంగ్రాలోయలు, సిమ్లా, వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి.
సి. నాగటిబ్బా శ్రేణి : ఉత్తరాఖండ్, నేపాల్‌లో ఉంది.
డి. ముస్సోరి శ్రేణి : ఉత్తరాఖండ్‌లో ఉంది.
ఇ. మహాభారత శ్రేణి : నేపాల్‌లో ఉంది.
– బదరీనాథ్, కేదారనాథ్ పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి.
– హిమాచల్ పర్వతాలలో సతత హరిత ‘ఒకే శృంగాకార’ అడవులతో నిండి ఉన్నాయి.
3. శివాలిక్ పర్వతశ్రేణి (బాహ్య హిమాలయాలు)
వీటి సగటు ఎత్తు 1500 మీటర్లు. వెడల్పు 15 – 50 కిలోమీటర్లు.
– ఇవి పోస్ట్ ప్లీయోసిన్ కాలంలో ఏర్పడ్డాయి.
– పోట్వార్ పీఠభూమి (పాకిస్తాన్) నుంచి దిహంగ్ గార్జ్ (అరుణాచల్‌ప్రదేశ్) వరకూ విస్తరించి ఉన్నాయి.
– ఇవి తక్కువ వయస్సుకు చెందినవి. ఇక్కడ భూకంపాలు అధికంగా సంభవిస్తాయి.
– శివాలిక్ పర్వతాలలో తేమతో కూడిన ఆకురాల్చు అడవులు ఉన్నాయి.
– నిమ్న హిమాలయాలు, శివాలిక్ హిమాలయాలకు మధ్య లోయలు ఉన్నాయి.
ఉత్తరాఖండ్ – డెహ్రాడూన్, పాట్లీడూన్, కోట, చాకంభ
జమ్ము-కాశ్మీర్ – కోట్లెడూన్, ఉదంపూర్ గలవు.
– వీటికి అనేకపేర్లు ఉన్నాయి.
జమ్మూకాశ్మీర్ – జమ్మూకొండలు
ఉత్తరాఖండ్ – డుండూవా కొండలు, డాంగే, దండకొండలు
నేపాల్ – చురియా, యురియా కొండలు
అరుణాచల్‌ప్రదేశ్ – అబోర్, డీప్లా, మిరి, మిష్మి కొండలు
టాన్సా హిమాలయ మండలం
– ఇవి హిమాద్రికి ఉత్తరంగా ప్రారంభమై నైఋతీ దిశగా విస్తరించి ఉన్నాయి.
– ఇవి జమ్ముకాశ్మీర్, టిబెట్ ప్రాంతంలో ఉన్నాయి.
– వీటిపొడవు 1000 కిలోమీటర్లు. సగటు ఎత్తు 3000 మీటర్లు. వెడల్పు 40 కిలోమీటర్లు. వీటిలోని పర్వతశ్రేణులు.
కారంకోరం శ్రేణి
ఉన్సా హిమాలయాలలో పొడవైనది ఆసియాఖండం వెన్నెముక.
– వీటికి కృష్ణగిరి పర్వతాలని పేరు. ఎత్తయిన శిఖరం కె2 శిఖరం/కృష్ణగిరి/ గాడ్విన్ ఆస్పిన్ ఎత్తు 8611 మీటర్లు.
– కె2 శిఖరాన్ని చైనాలో క్వాగర్, పాకిస్తాన్లో చోగీరి అని పిలుస్తారు. కె2 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది.
– కె2 భారత్‌లో ఎత్తయిన శిఖరం దీని తర్వాత కాంచనజంగ్ 8598, మీటర్లు ఉంటుంది.
– కారంకోరంలోని హిమనీనదం సియాచిన్ భారతదేశంలో పొడవైనది, ఎత్తయినది.
– సియాచిన్ ప్రపంచంలో ఎత్తైన యుద్ధక్షేత్రం. ప్రపంచం యొక్క మూడో ధృవంగా పిలుస్తారు. ఇది సుబ్రాలోయలో ఉంది.
లడక్ శ్రేణి
కారంకోరంకి దక్షిణంగా సింధు, ష్యోక్ నదుల మధ్య ఉంది.
– వీటిని టిబెట్‌లో కైలాసకొండలు అని అంటారు.
– లడక్ భారతదేశంలో అతిపెద్ద శీతల ఎడారి.
– సింధునది లడక్ శ్రేణిలో 5200 మీటర్ల లోతైన విస్తీర్ణాన్ని ఏర్పరుస్తుంది.
జస్కోరా శ్రేణి
ఇవి లడక్‌కు దక్షిణంగా ఉన్నాయి. లడక్, జస్కోరా నడుమ సింధునది ప్రవహిస్తుంది.
కైలాస పర్వతశ్రేణి
ఈ శ్రేణిలో మానస సరోవరం ఉంది. అనేక నదుల జన్మస్థలం.
హిందుకుషే పర్వతశ్రేణులు
వీటిలో కైబర్ బీలాన్ కనుమలు ఉన్నాయి. భారతదేశంలోకి విదేశీయులు ఈ కనుమల ద్వారానే ప్రవేశించారు.
– ప్రపంచంలో ఎత్తయిన పీఠభూమి టిబెట్ పీఠభూమి (పామీర్) ట్రాన్స్ హిమాలయాలలో ఉన్నాయి. పామీర్ ప్రపంచపు పైకప్పు.
■హిమాద్రిలోని ఇతర ఎత్తయిన శ్రేణులు
ఎవరెస్ట్ – 8848 మీటర్లు
కాంచన గంగ – 8598 మీ (సిక్కిం)
మకాలు – 8463 మీ (నేపాల్)
చోగొయి – 8201 మీ (నేపాల్)
ధవళగిరి – 8167 మీ (నేపాల్)
మనస్లూ – 8156 మీ (నేపాల్)
నంగ ప్రభాత్ – 8126 మీ (జమ్మూ కాశ్మీర్)
అన్నపూర్ణ – 8078 మీ (నేపాల్)
నామ్చా బార్వా – 7756 మీ (అరుణాచల్‌ప్రదేశ్)
నందాదేవి – 7817 మీ (జమ్మూ కాశ్మీర్)
కె2 – 8611 మీ (ఉత్తరాఖండ్)
బదరీనాథ్ – 7138 మీ
నందకోట – 6861 మీ (ఉత్తరాఖండ్)
హిమాద్రిలోని కనుమలు
జోజిలా, బుర్జిలా – జమ్మూ కాశ్మీర్ (బుర్జిల్ కనుమ శ్రీనగర్‌ను లేV్‌ాతో కలుపుతుంది).
షిప్కిలా, బారాషిప్చిలా – హిమాచల్‌ప్రదేశ్ (బారాలచా కనుమ మనాలిని లేV్‌ాను కలుపుతుంది).
నాథులా, జలెప్లా – సిక్కిం (పశ్చిమబెంగాల్లోని కాలింగ్పాంగ్ను టిబెట్‌లోని లాసాతో కలుపుతుంది).
బోమిడిలా, పోంగ్నూ – అరుణాచల్‌ప్రదేశ్ (ఈ కనుమ ద్వారా బ్రహ్మపుత్ర భారత్‌లోకి ప్రవేశిస్తుంది).
నీతి లాపు, దాద్లా, లీపులేక్ – ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ (ఈ కనుమలు భారత, నేపాల్, చైనా సరిహద్దుల వద్ద కలుపుతుంది).
నమూనా ప్రశ్నలు
1. ఎవరెస్ట్‌ను నేపాల్‌లో ఏమని పిలుస్తారు ?
ఎ. జోంగ్మా బి. చోమోలుగ్మా
సి. సాగర్మాత డి. కోమోలుంగ్మా
2. భారత్‌లో ఎత్తయిన శిఖరం ?
ఎ. ఎవరెస్ట్ బి. కె2
సి. ధవళగిరి డి. అన్నపూర్ణ
3. శివాలిక్ హిమాలయాలను ఏ రాష్ట్రంలో మిష్మి డాప్లా కొండలు అని పిలుస్తారు ?
ఎ. హిమాచల్‌ప్రదేశ్ బి. ఉత్తరాఖండ్
సి. అరుణాచల్‌ప్రదేశ్ డి. సిక్కిం
4. కాంచనగంగ ఏ రాష్ట్రంలో ఉంది ?
ఎ. ఉత్తరప్రదేశ్ బి. జమ్మూ కాశ్మీర్
సి. సిక్కిం డి. బీహార్
5. ఆసియా ఖండం యొక్క వెన్నెముకగా పిలువబడే హిమాలయాలు ?
ఎ. కారంకోరం బి. హిందుకుష్
సి. హిమాద్రి డి. జస్కోర్
6. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లను కలిపే కనుమ ?
ఎ. బోలాన్ బి. కైబర్
సి. ఘోమల్ డి. రోహతంగ్
7. సట్లేజ్నది ఏ కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది ?
ఎ. ఖైబర్ బి. బోలాన్
సి. షిష్కిలా డి. నీతిలాపే
8. చారధామ్ క్షేత్రాలు బదరీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునాద్రి ఈ హిమాలయాలలో ఉన్నాయి ?
ఎ. కాశ్మీర్ బి. పంజాబ్
సి. అస్సోం డి. కుమాపున్
9. కుంకుమపువ్వు పండే ప్రాంతం ?
ఎ. సుబ్రలోయ బి. పీరపంజల్
సి. కాశ్మీర్‌లోయ డి. గస్రేభమ
10. పీర్‌పంజల్ నైఋతిగా ఉన్న పర్వతశ్రేణి ?
ఎ. దేలదార్ బి. మహాభారత
సి. శివాలిక్ డి. పోటకాయ
సమాధానాలు : 1.సి, 2.బి, 3.సి, 4.సి, 5.ఎ, 6.బి, 7.సి, 8.డి, 9.సి, 10.ఎ.
ATTENTION APPSC GROUP-2 MAINS ASPIRANTS! DO YOU KNOW APPSC CONDUCTING MAINS EXAMS ONLINE ONLY? YOU MUST PRACTICE ONLINE EXAMS TO GAIN THE CONFIDENCE AND BE A WINNER!.
[maxbutton id=”1″ text=”Register for Test Series” url=”https://vyoma.net/exams/appsc/”]
Thank you this is really very usefull