క్వారంటైన్ అంటే ఏమిటి | క్వారంటైన్ చరిత్ర
Quarantine of History
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచమంతటా పాకడంతో ఇప్పుడు దాని పర్యవసనంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. కరోనా వైరస్ అనుమానితులను క్వారంటైన్ లోకి తరలించారు. ఈ జనాలకు కరోనా వ్యాధి సోకె వరకు జనాలకు కర్ఫ్యూ అంటే ఏంటో తెలుసు.. కానీ లాక్ డౌన్ పూర్తిగా కొత్త. ఇక క్వారంటైన్ అనేది అస్సలు తెలియదు. కానీ ఇప్పుడు విదేశాల నుంచి కరోనా వెంటపెట్టుకొచ్చిన వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు.
యూరప్ ఖండంలో కొన్ని వందల ఏళ్ల క్రితమే క్వారంటైన్ అమలు చేసినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఇలా యూరప్ లో క్వారంటైన్ కోసం ప్రత్యేకంగా ఎత్తైన గోడలు విశాలమైన గదులతో క్వార్టర్లు నిర్మించారు. ఆ క్వార్టర్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
వ్యోమడైలీ ఆన్‌లైన్ వీడియో క్లాసెస్
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
వైరస్ విస్తృతంగా వ్యాపించిన దేశాన్ని సందర్శించిన లేదా, వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా మసలుకున్న వ్యక్తులు ఆ వైరస్‌కు ప్రభావితమై ఉంటారనే కారణంతో బలవంతంగా దిగ్బంధంలో ఉంచడం లేదా స్వీయ దిగ్బంధం విధించుకోవడం క్వారంటైన్. కదలికల్ని నియంత్రించడం దీని ముఖ్య ఉద్దేశం. ఫ్లూ లక్షణాలు కనిపించినపుడు కనీసం 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచిస్తారు.