ఏప్రిల్ 20 నుంచి వీరికి లాక్‌డౌన్ మినహాయింపు


Vyoma Daily Online Video Classes in Telugu

లాక్ డౌన్ సమయం లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కోసం వ్యోమ డైలీ నుండి ప్రత్యేక ఆఫర్ 70% తగ్గింపు మరియు 3 నెలల అదనపు వాలిడిటీ తో
https://www.vyomadaily.com/

 

 

 

APPSC Online Classes in Telugu

  1. APPSC Group 2 Online Coaching Classes
  2. AP SI & Constable Online Coaching Classes
  3. AP SI & Constable General studies Online Classes
  4. AP SI & Constable Maths Part Online Coaching Classes

India extends coronavirus lockdown until May 3

కరోనావైరస్ కట్టడిలో భాగంగా మరోసారి లాక్‌డౌన్ మే 3 వరకూ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగించినట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. మే 3 వరకూ అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో ఈ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

February 2020 Free  Telugu Current Affairs Online Videos Classes

ఫ్రీ ఆన్‌లైన్‌ వీడియో క్లాసుల కొరకు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి

Click Here 

మే 3వ తేదీ వరకు రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు బంద్ చేస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది.

మర్గదర్శకాల్లో కొన్నింటి పరిశీలిస్తే…

* గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.
* నిర్మాణరంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులకు మాత్రమే ఉపయోగించుకోవాలని పేర్కొంది.
* కాఫీ తేయాకుల్లో 50 శాతం మ్యాస్ పవర్‌కు అనుమతి ఇంచింది.
* పట్టణ పరిధిలో లేని అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా అనుమతి ఇచ్చింది.
* ఆన్‌లైన్‌ షాపింగ్, ఈ కామర్స్‌కు అనుమతి
* నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దు.
* ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదు.
* ఆరోగ్య కేంద్రం, ఔషధాల విక్రయాలు యధాతథంగా కొనసాగింపు.
* ఔషధ పరిశ్రమలలో ఉత్పత్తికి అనుమతులు
* వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలకు అనుమతి.
* ఆక్వా ఉత్పత్తులు క్రయ విక్రయాలకు, బ్యాంకు కార్యకలాపాలకు అనుమతి
* వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవు
* ఉపాధి హామీ పనులు, భవన నిర్మాణ పనులకు షరతులతో కూడిన అనుమతులు
* గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టు నిర్మాణ పనులకు అనుమతి.
* ఎరువులు, పరుగుల మందులు, విత్తనోత్పత్తి దుకాణాలు తెరిచేందుకు అనుమతి.
* పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించవచ్చు.
* విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుమందుల దుకాణాలకు అనుమతి
* బ్యాంకుల కార్యకాలాపాలు యథాతథం
* అనాథ, దివ్యాంగ, వృద్ధాశ్రమాల నిర్వహణకు అనుమతి
* రోడ్ల పక్కన దాబాలు, వాహన మరమ్మత్తుల దుకాణాలకు అనుమతి
* గోదాములు, శీతల గోదాములకు అనుమతి
* వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి
* ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్‌మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి
* గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి

వ్యోమడైలీ ఆన్‌లైన్‌ వీడియో క్లాసెస్

* పబ్లిక్‌లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని గైడ్‌లైన్స్‌లో పేర్కొంది.
* మతప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం
* సభలు, సమావేశాలకు ఎలాంటి అనుమతిలేదని స్పష్టం చేసింది.
* విద్యాసంస్థలు కూడా తమ కార్యకలాపాలు నిర్వహించవద్దని స్పష్టం చేసింది
* హాట్‌స్పాట్లను ప్రకటించే అధికారం రాష్ట్రాలదే అని ప్రకటించిన కేంద్రం.
ఇప్పుడు విడుదల చేసిన గైడ్‌లైన్స్.. ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొంది.
* మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు మూసివేత.
* సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం, పెద్ద ఎత్తున ప్రార్థనలు నిలిపివేత, ట్యాక్సీ సర్వీసులకు అనుమతి నిరాకరణ.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా
*హాట్‌స్పాట్స్, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో గతంలో సూచించిన మార్గదర్శకాలను పాటించాల్సిందే.
* హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్ జోన్‌లను గుర్తించే బాధ్యత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలదే
* ఉపాధి కూలీలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి
* విద్యాసంస్థలు కార్యకలాపాలు నిర్వహించవద్దు… లాంటివి కీలకంగా పేర్కొంది… కేంద్రం మార్గదర్శకాలను కింద జత చేయడం జరిగింది.
* ఏప్రిల్‌ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు అనుమతి
* వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరణ
* ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరణ
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.