Indian Civil Services exam and Selection Process guide

Indian Civil Services exam and Selection Process guide

indian civil services జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ప్రభుత్వ పథకాల్లో కీలకపాత్ర వహించడంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఉన్న వారు సివిల్ సర్వీసెస్ టార్గెట్ గా పెట్టుకోవచ్చు.

దేశ స్థాయిలో అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాలకు ఎంపిక చేసేందుకు సివిల్ సర్వీసెస్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతి యేడాది యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. యేటా దాదాపు 10 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ప్రిలిమ్స్ పూర్తవగానే మెయిన్స్ కోసం మొత్తం ఉన్న ఉద్యోగాల సంఖ్యకు 1:10 మందిని పిలుస్తారు. ఇది పూర్తయ్యాక ఇంటర్య్యూకి 1:3 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపికచేస్తారు.

అర్హతలు:

1) భారతీయ పౌరుడై ఉండాలి.
2) కేంద్రం, రాష్ట్ర లేదా డీమ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదివిన వారు కూడా సివిల్స్ ప్రిలిమ్స్ రాయడానికి అర్హులు.
3) 21 యేళ్ళకు తగ్గకుండా 32 యేళ్ళకి మించకుండా ఉండాలి. అయితే OC అభ్యర్థులకు 32 యేళ్ళ వరకే వయో పరిమితి ఉంటే… OBCలకు 35యేళ్ళు, SC,STలకు 37 యేళ్ళ వరకూ సివిల్స్ రాసుకోవచ్చు.
4) OC అభ్యర్థులు 6సార్లు మాత్రమే సివిల్స్ రాసుకోడానికి అర్హత ఉంది. OBCలకు 9సార్లు రాసుకునే వీలుంది. SC,STలు మాత్రం ఎన్నిసార్లయినా రాయొచ్చు. వారికి పరిమితి లేదు.

ఎంపిక విధానం :

సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం సంపాదించడానికి మూడు స్టేజ్ లు దాటాల్సి ఉంటుంది.

1) ప్రిలిమినరీ టెస్ట్

(2) మెయిన్స్ రిటన్ ఎగ్జామ్

(3) ఇంటర్వ్యూ

ప్రతి యేటా యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ 700 నుంచి వెయ్యి పోస్టుల వరకూ ప్రకటిస్తుంది.

మొదటి ప్రాధాన్యత : టాప్ లో నిలిచిన 70-100 మంది అభ్యర్థులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) ఎంపిక చేసుకునే అవకాశముంటుంది. రెండో ప్రాధాన్యత: ఇండియన్ పోలీస్ సర్వీసెస్ మూడో ఛాయిస్ : ఇండియన్ ఫారెన్ సర్వీసెస్, నాలుగో ప్రాధాన్యత : ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్. ఆ తర్వాత అభ్యర్థులను మిగిలిన సర్వీసులకు కేటాయిస్తారు. మొత్తం 25 సర్వీసులు ఉంటాయి.

ప్రతియేటా ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ టెస్ట్ కి నోటిఫికేషన్ వెల్లడిస్తుంది. ఆగస్టు లో ప్రిలిమినరీ టెస్ట్  నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు 100 మార్కులు. రెండు గంటలు టైమ్ ఉంటుంది. జనరల్ స్టడీస్ పేపర్ 1 & 2లు కటాఫ్ మార్కులు దాటితే మెయిన్స్ కు అర్హత పొందుతారు.

1) జనరల్ స్టడీస్1(200మార్కులు):

జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు (Current Affairs), భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర, భారత, ప్రపంచ భౌగోళిక శాస్త్రం, ఇండియన్ పాలిటీ, ప్రభుత్వ పాలన, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీ రాజ్ వ్యవస్థ, జనరల్ సైన్స్, ఆర్థిక, సామాజిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు, పర్యావరణ అంశాలు లాంటి సబ్జెక్టులు ఉంటాయి.

వంద మార్కుల ఆబ్టెక్టివ్ టైప్… మల్టీఫుల్ ఛాయిస్ ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్ కు 0.33 మార్కులు చొప్పున కట్ అవుతాయి.

2) జనరల్ స్టడీస్ 2(200మార్కులు) :

ఇందులో ఇంగ్లీష్ కాంప్రహెన్షివ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేవ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డిసిషన్ మేకింగ్ – ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ (10వ తరగతి స్థాయిలో ఉంటాయి), డేటా ఇంటర్ ప్రిటేషన్ (ఛార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్, డాటా సఫీషియన్సీ) కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానానికి 2.5 మార్కులు, తప్పయితే మాత్రం 0.33మార్కులు తగ్గిస్తారు. 2 గంటల టైమ్ ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్ష నుంచి మెయిన్స్ కు వెళ్ళడానికి జనరల్ స్టడీస్ మొదటి పేపర్ లో 50-55 శాతం మార్కులకు కటాఫ్ ఉంటుంది. కనీసం 60శాతం మార్కులు సాధిస్తే మెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే జనరల్ స్టడీస్ -2లో క్వాలిఫై అవడానికి 33శాతం మార్కులు సాధించాలి.

సివిల్ సర్వీసెస్ పాత ప్రశ్నాపత్రాలు UPSC వెబ్ సైట్ లో ఉంటాయి.

సివిల్స్ మెయిన్స్ & ఇంటర్వ్యూ:
ప్రిలిమినరీ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్ రాయడానికి అర్హులు. ఇందులో 9 పేపర్లు ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)తో కలిపి మొత్తం 1750 మార్కులు.

1) Paper-A – Indian Language (Qualifying)-300 Marks
2) Paper B – English (Qualifying) – 300marks
3) Paper I – Essay – 250 Marks
4) Paper II – General Studies -I – 250 Marks
5) Paper III – General Studies – II – 250 Marks
6) Paper IV- General Studies – III – 250 Marks
7) Paper V – General Studies – IV – 250 Marks
8) Paper VI – Optional Subject paper 1 – 250 Marks
9) Paper VII – Optional Subject Paper 2 – 250 Marks
Total Marks : 1750 Marks
Interview : 275 Marks
Grand Total : 2025 Marks

పూర్తి వివరాలకు : http://www.upsc.gov.in/