ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కనీస అర్హత పై ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.గతంలో ఉన్న నిబంధనలను ఇప్పుడు సవరించింది.
ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే కనీస విద్యా అర్హత 10వ తరగతి ఉత్తీర్ణతగా ఉండేది. అయితే ఏపీ సర్కార్ దీనిపై ఉన్న నిబంధనలను సవరించి కనీస అర్హత ఇంటర్మీడియెట్‌గా నిర్ణయించింది.
అకడమిక్ క్యాలెండర్‌లోనూ మార్పులు
కరోనావైరస్ పిల్లల చదువులకు ఈ మహమ్మారి బ్రేక్ వేసింది. విద్యాసంవత్సరం అర్థాంతరంగా ముగిసింది. 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి.
విద్యాసంవత్సరంకు సంబంధించిన క్యాలెండర్‌లో మార్పులు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఒక ఏడాది జూన్ 12 నుంచి దాని తర్వాత ఏడాది జూన్ 11వరకు ఒక విద్యాసంవత్సరం ఉండేది. అయితే కరోనా వైరస్ కారణంగా విద్యాసంవత్సరంలో మార్పులు చేసింది ప్రభుత్వం.
ఇక నుంచి ఆగష్టు నుంచి జూలై వరకు విద్యాసంవత్సరం కొనసాగుతుంది. అంటే అకడెమిక్ క్యాలెండర్‌లో రెండు నెలల కోల్పోయింది. దీంతో కొత్త విద్యాసంవత్సరంగా ఆగష్టు 1 నుంచి వచ్చే ఏడాది జూలై 31వరకు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు 10వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే 1995 వరకు ఇలాంటి విద్యాసంవత్సరమే అంటే ఆగష్టు 1 నుంచి జూలై 31వరుక ఫాలో అయ్యేవారు.