అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం

అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం) ప్రతి ఏట ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలు వారసత్వ సంపద పరిరక్షణకోసం ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వారసత్వ దినోత్సవం నిర్వహించాలని ప్రకటించాయి. ప్రపంచంలోని వివిధ దేశాలలోని ఉన్న వివిధ పురాతన కట్టడాల పరిరక్షణ కోసం. ‘ఐక్యరాజ్య సమితి’ (యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్), ‘అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం’ సంయుక్త ఆధ్వర్యంలో ఆఫ్రికాలోని ట్యూనీషియాలో 1982, ఏప్రిల్ 18న ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ప్రతినిధులు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి సలహాలు, సూచనలు ఇచ్చారు. అలా సదస్సు ప్రారంభమైన ఏప్రిల్‌ 18వ తేదీని ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’గా ప్రకటించాలని యునెస్కోకి ప్రతిపాదనలు పంపగా. 1983లో ఆమోదించి ఏప్రిల్ 18వ తేదిని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవాన్నే ‘వరల్డ్‌ హెరిటేజ్‌’ డే అనడం ఆనవాయితీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 ప్రపంచ స్థాయి పురాతన కట్టడాలు, స్థలాలను గుర్తించి వాటిని పరిరక్షిస్తున్నారు.

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984, జనవరి 27న అప్పటి భారతదేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చైర్మన్‌గా భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ (ఇండియన్ నేషనల్ ట్రస్టు ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ -ఇంటాక్) అనే సంస్థ ఏర్పాటుచేయబడింది. ఈ ఇంటాక్ సంస్థకు దేశవ్యాప్తంగా 190 చాప్టర్లు ఉన్నాయి. దీనికితోడుగా, భారతదేశ వారసత్వ సంపద విలువ, వాటి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలిపించేందుకు ‘భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ’, ‘రాష్ట్ర పురావస్తు శాఖ’లు దేశంలో ప్రతి సంవత్సరం వారసత్వ వారంను కూడా నిర్వహిస్తున్నాయి.

ప్రపంచ వారసత్వ కట్టడాలను United Nations Educational Scientific and Cultural Organisation (UNESCO) గుర్తిస్తు౦ది

ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భారతదేశ ప్రదేశాలు
సాంస్కృతిక ప్రదేశాలు

ఆగ్రా కోట (1983)
అజంతా గుహలు (1983)
ఎల్లోరా గుహలు (1983)
తాజ్ మహల్ (1983)
మహాబలిపురం వద్ద గల కట్టడాల సముదాయం (1984)
కోణార్క సూర్య దేవాలయం (1984)
గోవా చర్చులు, కాన్వెంట్లు (1986)
ఫతేపూర్ సిక్రీ (1986)
హంపి వద్ద గల కట్టడాల సముదాయం (1986)
ఖజురహో కట్టడాలు (1986)
ఎలిఫెంటా గుహలు గుహలు (1987)
గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ (1987)
పట్టడకళ్ కట్టడాల సముదాయం (1987)
సాంచిలోని బౌద్ధ కట్టడాలు (1989)
హుమాయూన్ సమాధి (1993)
కుతుబ్ మీనార్ కట్టడాలు (1993)
భారతీయ పర్వత రైల్వేలు (1999)
బోధ గయాలోని మహాబోధి ఆలయ సముదాయం (2002)
భింబెట్కా రాతి గృహాలు (2003)
చంపానేర్ పవాగాద్ ఆర్కియాలజికల్ పార్క్ (2004)
ఛత్రపతి శివాజీ టెర్మినస్ (గతంలో విక్టోరియా టెర్మినస్) (2004
ఎఱ్ఱకోట (2007)
జైపూర్ జంతర్ మంతర్ (2010)
రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్ (2013
Great Himalayan National Park Conservation Area
Rani-ki-Vav (the Queen’s Stepwell) at Patan, Gujarat
Archaeological Site of Nalanda Mahavihara at Nalanda, Bihar
The Architectural Work of Le Corbusier, an Outstanding Contribution to the Modern Movement
Historic City of Ahmadabad
Victorian Gothic and Art Deco Ensembles of Mumbai
Jaipur City, Rajasthan

సహజసిద్ధమైన ప్రదేశాలు
Kaziranga National Park
Keoladeo National Park
Manas Wildlife Sanctuary
Sundarbans National Park
Nanda Devi and Valley of Flowers National Parks
Western Ghats
Khangchendzonga National Park

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.