
కరోనాపై పోరులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే తన వంతు సహకారం అందిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరాలో ఆలస్యం జరగకుండా పార్సిల్ ఎక్స్‌ప్రెస్, గూడ్సు రైళ్లను నడుపుతున్న దక్షిణమధ్య రైల్వే తాజాగా వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. దేశంలో వివిధ ప్రాంతాలకు ఆహారధాన్యాల్ని మరింత వేగంగా రవాణా చేసేందుకు ‘జై కిసాన్’ పేరుతో రెండు ప్రత్యేక గూడ్సు రైళ్లను ప్రారంభించింది. మొదటి జై కిసాన్ గూడ్సు రైలు ఆహారధాన్యాలతో తెలంగాణలోని డోర్నకల్ జంక్షన్ నుంచి బయల్దేరి సదరన్ రైల్వే జోన్ (సెవురు, చెట్టినాడ్ స్టేషన్లు)కు వెళ్లినట్లు దక్షిణమధ్య రైల్వే మంగళవారం వెల్లడించింది. రెండో జై కిసాన్ రైలు కూడా డోర్నకల్ నుంచే బయల్దేరి సదరన్ రైల్వే జోన్(దిండిగల్, ముడియపక్కమ్ స్టేషన్లు)కి వెళ్లింది. సాధారణంగా ఒక గూడ్సు రైలు 42 వ్యాగన్లతో వెళుతుంది. వీటి సామర్థ్యం 2,600 టన్నుల ఆహారధాన్యాలు. కొత్త విధానంలో 84 వ్యాగన్లలో 5,200 టన్నుల ఆహారధాన్యాలు ఒకేసారి వెళతాయి. ఈనెల 1 నుంచి 13 వరకు 160 సరుకు రవాణా రైళ్ల ద్వారా 4.38 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించింది. రెండు వేర్వేరు గమ్యస్థానాల నుంచి లోడ్ చేసిన రెండు సరుకు రవాణా రైళ్లను సమీపంలోని జంక్షన్ పాయింట్ వద్ద జతచేస్తారు.
పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఈ – బుక్స్ ని క్రింద ఇవ్వబడిన లింకు నుండి పొందవచ్చు
https://www.vyomadaily.com/s/pages/ebooks
2. NCERT ఆబ్జెక్టివ్ జనరల్ సైన్స్ PDF (7th to 10th Classes) – Vivana Publications.
3. ఇండియన్ ఎకానమీ సర్వే -2019 -2020 మరియు కేంద్ర బడ్జెట్ 2020-21
4. TSPSC Group 1 Prelims & Mains Guidance Telugu Medium
ప్రిలిమ్స్ & మెయిన్స్ గైడెన్స్ (తెలుగు మీడియం)
5. Basic English Grammar e-book | Vivana Publication