కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ
ప్లాస్మా థెరపీ అంటే ఏంటి?
కరోనా వైరస్‌కు వాక్సిన్‌ను కనిపెట్టడానికి ప్రపంచ దేశాలతో పాటుగా భారత్‌లో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరో ఏడాది నుంచి 18 నెలల సమయం పట్టవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ‘ప్లాస్మా థెరపీ’ అనే కొత్త చికిత్సా విధానాన్ని అమలులోకి తేవడానికి భారత్ సిద్దమవుతుంది.
ప్రమాదకర కరోనా వైరస్ దేశవ్యాప్తంగా రోజురోజుకు విస్తరిస్తోంది. కోవిడ్-19 సోకి తీవ్ర విషమ స్థితిలో ఉన్న రోగులకు ప్లాస్మా థెరపీ ఇఛ్చి వారిని మళ్ళీ ఆరోగ్యవంతులను చేసేందుకు ప్లాస్మా థెరపీ ఉపయోగిస్తున్నారు. కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్నవారి రక్తంలోని యాంటీ బాడీలను వినియోగించి చికిత్స చేస్తారు. ఈ థెరపీ క్లినికల్ ట్రయల్స్ కు శ్రీకారం చుట్టిన కేరళ ఈ తరహా ప్రయోగానికి దేశంలోనే తొలి రాష్ట్రం గా నిలిచింది. తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరుణాల్ ఇన్స్ టి ట్యూట్ ఫర్ మెడికల్ అండ్ సైన్సెస్ టెక్నాలజీ ప్రయోగాలు చేపడుతుందని, ప్లాస్మా థెరపీ ప్రాజెక్టుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం తెలిపిందని కేరళ ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఈ చికిత్సను తొందర్లోనే అందుబాటులోకి తేవడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రయత్నాలు చేస్తుంది. అసలు ప్లాస్మా థెరఫీ అంటే ఏమిటి ? కరోనా సోకిన వ్యక్తుల శరీరంపై ఇది ఏ విధంగా పని చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, అదే వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు.
వైరస్ సోకిన వ్యక్తుల శరీరంలో రోగ నిరోధక శక్తి లేకపోతే ప్లాస్మా థెరపీ ద్వారా వారికి రోగ నిరోధక శక్తి పెంచుతారు. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై కోవిడ్-19 వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే, వారిలోని రోగనిరోధక కణాలు (తెల్ల రక్త కణాలు) దాడి చేసి ఆ వైరస్‌ను నాశనం చేస్తాయి.
స్పష్టమైన నిబంధనలు
సాధారణంగా ఏ ఇద్దరు వ్యక్తులలో రోగనిరోధక శక్తి ఒకే విధంగా ఉండదు. స్త్రీ, పురుషులలో ఒక విధంగా, యుక్త వయస్కులు, వృద్దులలో ఒక విధంగా ఇది పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి లోపించిన కారణంగానే కరోనా మరణాలలో వృద్ధుల రేటు అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ కారణంగా విషమించిన వ్యక్తుల ఆరోగ్యాన్ని ప్లాస్మా థెరఫీ ద్వారా తిరిగి మాములు స్థితికి చేరేలా చేస్తున్నారు.
కరోనా వైరస్ సోకి దానిని తట్టుకుని ఆరోగ్యవంతులైన వ్యక్తుల శరీరంలో నుండి రక్తాన్ని సేకరిస్తారు. రక్తంలోని సీరంను వేరు చేసిన అందులోని రోగ నిరోధక కణాలను బయటకు తీస్తారు. ఆ కణాలను ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్న వ్యక్తుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ విధంగా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఇది పని చేస్తుంది. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు. అయితే ఎవరి నుంచి పడితే వారి నుంచి ఈ రక్తాన్ని సేకరించలేరు. కేవలం కరోనా నెగిటివ్ వచ్చిన 28 రోజుల తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలు, వైరస్ లక్షణాలు లేని వ్యక్తులను ఎంపిక చేసుకుంటారు. అతని నుంచి రోగ నిరోధక కణాలను సేకరించి రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు.
సార్స్, ఎబోలా రోగులకు ప్లాస్మా తరహా ట్రీట్మెంట్:
1918లో ఫ్లూ జ్వరం మహమ్మారిలా వ్యాపించినప్పుడు దానికి ఆధునిక వైద్యం అందుబాటుకు రాలేదు. అప్పుడు కోలుకున్న రోగుల ప్లాస్మాను వ్యాధిగ్రస్తుల రక్తంలోకి ఎక్కించి నయం చేశారు వైద్యులు. 2002లో సార్స్ వచ్చినప్పుడు, 2014లో ఎబోలా వచ్చినప్పుడు కూడా ఇదే తరహా ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు కోవిడ్ 19 వైరస్‌కు కూడా ప్లాస్మా థెరపీ సమర్థంగా పనిచేస్తుందంటున్నారు వైద్యనిపుణులు. ఇలా చైనా, దక్షిణ కొరియాలో చికిత్స చేసిన పేషెంట్లకు నయం కాగా.. భారీ స్థాయిలో దాన్ని వాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోనూ దీనిపై పెద్ద ఎత్తున ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.
ప్లాస్మాను ఎలా తీస్తారు?
ఎలాంటి సమస్య లేదని నిర్ధరించుకున్న తర్వాత, దాత నుంచి ఆస్పెరిసిస్ అనే విధానం ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. ఈ సాంకేతిక విధానంలో రక్తం నుంచి ప్లాస్మా లేదా ప్లేట్‌లెట్లను వేరు చేస్తారు. మిగతా రక్తం మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతుంది.
“ప్లాస్మాలో మాత్రమే రోగనిరోధక కణాలు ఉంటాయి. ఒక దాత నుంచి దాదాపు 800 మిల్లీ లీటర్ల ప్లాస్మా తీస్తాం. దానిని ఒక్కొక్కరికి 200 మి.లీ చొప్పున, నలుగురు రోగులకు ఎక్కించవచ్చు. అందుకే నాలుగు ప్యాకెట్లలో నింపుతాం” అని డాక్టర్ అనూప్ కుమార్ వివరించారు.
అలా సేకరించిన ప్లాస్మాను కోవిడ్ -19తో బాధపడుతున్న రోగులకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, మరెవరికీ ఇవ్వకూడదని డాక్టర్ దేబాషిష్ గుప్తా చెప్పారు.
పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఈ – బుక్స్ ని క్రింద ఇవ్వబడిన లింకు నుండి పొందవచ్చు
4. TSPSC Group 1 Prelims & Mains Guidance Telugu Medium
ప్రిలిమ్స్ & మెయిన్స్ గైడెన్స్ (తెలుగు మీడియం)