sc st atrocities act 2018 – Scheduled Castes and the Scheduled Tribes awareness preparations of All TSPSC and APPSC

14 total views, 1 views today

SC-ST Atrocities act 2018 – Scheduled Castes and the Scheduled Tribes awareness preparations of All TSPSC and APPSC

Image result for SC-ST Atrocities act 2018

 

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యథావిధిగా ఉంచేందుకు తీసుకురావాల్సిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈనెల 9న దళిత సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన అట్రాసిటీ చట్టం ఇదివరకు ఎలాగైతే ఉందో… అలానే కొనసాగించేలా కేంద్రం మరో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఈ ఏడాది మార్చిలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అభిప్రాయపడిన సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దళితులపై దాడి చేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే అందుకు కారణమైన వారిని ఎలాంటి విచారణ చేయకుండా అరెస్టు చేయడం సరికాదని తన తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఇప్పుడున్న చట్టాన్ని నీరుగారిస్తే భవిష్యత్తులో దళితులపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని విపక్షాలు, దళిత సంఘాలు హెచ్చరించాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.