Telangana Razakars , Nizam, Hyderabad State
Telangana Razakars , Nizam, Hyderabad State
The Razakars were a private militia organised by Qasim Razvi to support the rule of Nizam Osman Ali Khan, Asaf Jah VII and resist the integration of Hyderabad State into the Dominion of India. They also attempted to make the Nizam accede his princely state to Pakistan instead of India.
రజాకార్:
1927లో నవాబు సధార్ యార్ జంగ్… మజిల్స్ -ఇత్తె హాదుల &- ముస్లిమీన్ ( MIM ) స్థాపించబడినది . తొలిదశలో ఈ సంస్థ సంస్కృతిక రంగానికి ,ముస్లిం ల వికాసానికి ప్రయత్నo చేసింది .
తరువాత కాలంలో దీనికి “బహదూర్ఆలీ జంగ్” అధ్యక్షుడయ్యాడు . ఇతనే ఇక్కడ మొట్టమొదటిసారిగా “రజాకార్” అనే పదం ఉపయోగించాడు . రజాకార్ అంటే “స్వచ్చంధ సేవకుడు” వీళ్ళు నిజాం కార్యక్రమాలకు స్వచ్చంధంగా సహకరించడానికి పనిచేయడానికి పూనుకున్నవారు గా గుర్తింపబడ్డారు .
Who is Khasim Razvi:
తర్వాతికాలం లో ఈ సంస్థ కు “ఖాసీం రజ్వీ” అధ్యక్షత వహించాడు . ఇతడు పెద్ద మతోన్మాది ,అంతకుముందున్న బహదూర్ ఆలీ జంగ్ … “అనీ మాలిక్” అనే నినాదం ఇచ్చాడు,అంటే ప్రతీ ముస్లిం పరిపాలకుడే అని అర్ధం .
ఖాసీం రజ్వీ ..రజాకార్లను సైనిక శక్తిగా మార్చాడు ,ఇతని స్వస్థలం మహారాష్ట్రలోని లాదూర్ . రజాకార్లలో మొత్తం 50,000 మంది సైనికులు ఉండేవారు . విసూనూరి దేశముఖ్ ,రాంచెందర్ రెడ్డి దీనికి డిప్యూటీ కమేండర్ లుగా పనిచేశారు .
ఖాసీం రజ్వీ .. ఆస్ట్రేలియా లోని సిడ్నీకాటన్ వద్ద ఆయుధాలను కొనొగోలు చేశాడు
రజాకార్ల దౌర్జన్యాలను భరించలేక హైదరాబాద్ కింగ్ కోఠి లోని మెయిన్ రోడ్డుపై 1947డిసెంబర్ 4న నిజాం నవాబుపై బాంబులదాడి జరిగింది . ఈ దాడిలో నారాయణ పవార్ ,జగదీశ్వర్ ఆర్యా ,గండయ్య లు పాల్గొన్నారు !
రాజాకార్లు నిజాం ప్రధానమంత్రి -నవాబ్ చెత్తారిపై “శ్యామంజిల్” లో దాడి చేశారు. దీనిపై నిజాం స్పందించలేదు . 9 ఆగస్టు 1948 వరంగల్ లో బత్తిని మొగిలయ్య గౌడ్ ని హత్య చేశారు
ఆగస్టు 22,1948 లో కాచిగూడ లో ఒక ప్రముఖ పత్రిక విలేఖరి అయిన “షోయాబుల్లా ఖాన్” అనే వ్యక్తిని రజాకార్లకు వ్యతిరేకముగా రాసినందుకు నిర్దాక్షిణంగా హత్య చేశారు .
వీరి ఆకృత్యాల ఫలితముగానే తెలంగాణా ఉద్యమకారులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు సాయుధపోరాటానికి నాంది పలికారు, వీళ్ళను అణగద్రొక్కడానికి రజాకార్లును ఉపయోగించి దారుణ మారణఖాండకు తెర తీశారు . అనేకమంది అమాయకపు హిందువులను ,చిన్నాపెద్దా అనీ తారతమ్యంలేకుండా కనబడ్డవారిని కనపడ్డట్టుగా చిత్రవధలతో కాల్చి చంపుతూ శవాల గుట్టలు పేర్చారు .
అనేక హిందూమతాల దేవాలయాలు ధ్వంసం చేశారు ,ఆస్తుల భూములు ,లాగేసుకున్నారు .ప్రజలను భయబ్రాంతులను చేస్తూ,బలవంతపు మతమార్పిడులు కూడా చేశారు
రజాకార్ల మూలంగా భైరాంపల్లి ,పరకాల ,పేరుమడ్ల ,సంకీర్త ,ధర్మారం ,ఊయలవాడ ,భువనగిరి ,సూర్యాపేట ,మొదలగు గ్రామాలపై దాడులు జరిపి వేలాది మంది హిందువులను నిర్ధ్యాక్షిణముగా చంపేశారు !… ఆడవారిని పసిపిల్లలను గర్భవతులను మొగుడు చూస్తుండగా కత్తులతో కడుపులు కోసి పసి పిల్లలను బయటికి లాగారు.
రజాకార్ల దురాగతాల్ని నెహ్రూ 1947 సెప్టెంబర్ 7న నిరసించారు. అయినా మంతనాల పేరుతో ఒక సంవత్సర కాలంపాటు తాత్సారం చేసారు. హైదరాబాద్ సమీపంలో అమీరుపేట గ్రామంలోకి మహ్మద్ అస్లం, మహ్మద్ కరీం అనే రజాకర్లు ప్రవేశించారు. ఆ గ్రామాన్ని అతలాకుతలం చేసారు. భైరవునిపల్లిలో 96 మందిని నిలబెట్టి కాల్చి చంపి బావిలో సమాధి చేయడం, పరకాల మరో జలియన్ వాలాబాగ్ కాగా, రేణిగుంట, ఉమ్రీ, ఎర్రుపాలెం, అప్పంపల్లి వంటి ప్రాంతాలు రక్తంలో తడిసాయి.
బీబీనగర్, నిజామాబాద్ దుస్సంఘటల్ని ఖండిస్తూ మజ్లిస్ రజాకార్ల దురంతాలను ఎండగడుతూ, ‘ఇమ్రోజ్ పత్రిక’లో వార్తలొచ్చాయి. నానజ్ గ్రామాన్ని రజాకార్లు కోల్పోయిన ఘటనను ఇమ్రోజ్ పత్రికలో రాసినందుకు షోయబ్ ఉల్లాఖాన్‌ను అతి కిరాతకంగా రజాకార్లు హత్య చేసారు.
ఒకవైపు దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుంటే ఇక్కడ రజాకార్ల దురాగతాల పరంపర కొనసాగింది. షోయబుల్లాఖాన్ హత్య తర్వాత నెహ్రూ మేల్కొన్నాడు. ఇక్కడి ప్రజల్లో కూడా ఆందోళన తీవ్రమైంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు, రైతులు నిజాం ప్రభుత్వానికి, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. తమ సంస్కృతి సంప్రదాయాలను భాషను, వేషాన్ని, దేశాన్ని, దేవాలయాలను విధ్వంసం చేస్తున్న నిజాం రజాకార్లపై తిరగబడ్డారు.ఆర్యసమాజ్ కార్యకర్త నారాయణరావ్ పవార్ నిజాం కోచ్‌మీద బాంబు విసరగా, అతను త్రుటిలో తప్పించుకున్నాడు.
బైరానుపల్లి :
దాశరథి నిజాం గురుంచి:
ఓనిజాము పిశాచమా!….కానరాడు! …నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు…. నా తెలంగాణ కోటి రతనాల వీణ!
నిజాం ఎక్కడినుండి వచ్చాడు :
క్రీ.శ 1656లో బతుకుతెరువుకోసం “ఖలీజ్‌ఖాన్” అనే మతోన్మాది టర్కీలోని బోఖరా నుండి భారత్‌కు వచ్చాడు. నాటి మొగల్ పాలకుడైన “షాజహాన్” కొలువులో చేరి పదవి పొందాడు. అతని మనుమడే “ఖమ్రుద్దీన్”. ఈవ్యక్తే ‘నిజాముల్ ముల్కు’ అనే బిరుదు పొందాడు. వీళ్ల వంశం పేరు ఆసఫ్జాహి. ఆ తర్వాత ఔరంగజేబు పాలనలోకి వచ్చాక దక్కన్ ప్రాంతానికి సుబేదారుగా, ఔరంగజేబు మరణం తర్వాత 1724లో దక్కన్ నవాబులయ్యారు. 1724లో స్వాతంత్య్రం ప్రకటించుకొన్న ఈ నవాబు 1748లో మరణిస్తే అతని పుత్రులు, రాజబంధువులు, వారి బంధువులు – నైజాం సంస్థానం నిండా జాగీర్దార్లు, ముఖ్తేదార్లుగా ప్రకటించుకున్నారు. ఈ నవాబుల్లో చివరివాడు, ఏడవవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్.
ఆసఫ్ జా వారసులు నిజాం అనే పేరుతో హైదరాబాదును పాలించారు. ఏడుగురు నిజాముల పాలనలో హైదరాబాదు ఆర్థికంగాను, సాంస్కృతికంగాను కూడా అభివృద్ధిని సాధించింది. నిజాంసాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, వంటి పెద్ద జలాశయాలను నిర్మించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పై సర్వేలు కూడా వీరి కాలంలో మొదలయ్యాయి.
ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII (1911-1949):
హైదరాబాదులో చేపట్టిన అభివృద్ధి పనులు:
- డెక్కన్ క్వీన్, నిజాం రాజ్య రోడ్డు రవాణా సంస్థకు చెందిన 1932నాటి బస్సు(విజయవాడ బస్సు కాంప్లెక్స్ ఆవరణలో ప్రదర్శితమవుతోంది.
- ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ మరియు హిమాయత్ సాగర్ సరస్సులు నిర్మించడినవి.
- ఉస్మానియా విశ్వవిద్యాలయం 1917 సంవత్సరంలో స్థాపించబడినది. 1917 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధునిక యుగంలో మొఠ్ఠమొదటి సారి ఒక భారతీయ భాష (ఉర్దూ) లో కోర్సులు చెప్పడం ప్రారంభించింది. నలందా, తక్షశిలల తరువాత మొదటి సారి భారతీయులు ఒక భారతీయ భాషలో ఉన్నత విద్య పొందగలిగారు
- సిర్పూరు పేపరు మిల్స్, బోధన్ చక్కెర ఫాక్టరీ, అజంజాహీ నూలు మిల్లులు, చార్మినార్ సిగరెట్ ఫాక్టరీ మొదలైన కర్మాగారాలు నెలకొల్పబడినవి.
- నిజాం స్టేట్ రైల్వే నెలకొల్పబడినది.
- హైదరాబాదులో తన పేరు మీదగా ఉస్మానియా ఆసుపత్రి స్థాపించాడు.
Operation Polo:
ఇక్కడి పెద్దలు కేంద్రానికి వెళ్లి నెహ్రూను, సర్దార్‌పటేల్‌ను కలిసి తెలంగాణ పరిస్థితి వివరించారు. సర్దార్ పటేల్, మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలో భారత సైన్యాన్ని హైదరాబాద్‌కు తరలించారు. 1948 సెప్టెంబర్ 13న సైన్యం దిగింది. మూడు రోజులు ఎదిరించిన నిజాం సైన్యం చేతులెత్తేసింది. ఎలాంటి రక్తపాతం జరక్కుండానే 1948 సెప్టెంబర్ 17న నిజాం తల వంచాడు. ‘‘నేనెవరికీ భయపడను’’ ‘‘నేనే దేవుణ్ణి’’ అని ప్రచారం చేసుకొన్న ఏడవ నిజాం- ఉక్కుమనిషి సర్దార్ పటేల్ ముందు విమానాశ్రయంలో తల వంచి నమస్కరించి స్వాగతం పలికాడు. 1947 ఆగస్టు 15వ తేదీన రావలసిన స్వాతంత్య్రం తెలంగాణ ప్రజలకు 1948 సెప్టెంబర్ 17న వచ్చింది..!
nice sir thnq