Telugu Current Affairs Highlights 01 April 2018

Telugu Current Affairs Highlights 01 April 2018

Telugu Current Affairs Highlights 01 April 2018

>నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌గా 1992 బ్యాచ్‌ మణిపూర్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ వినీత్‌ జోషి నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 5 సం॥ల వరకు ఉండనున్నారు.
>15వ ఆర్థిక సంఘం జాయింట్‌ సెక్రటరీగా 1993 బ్యాచ్‌ అస్సాం-మేఘాలయ క్యాడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ రవి కోటా నియమితులయ్యారు.
>తెలంగాణలోని వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జెడ్పీ పాఠశాల విద్యార్థులు అరుదైన రికార్డును సాధించారు. ‘పై’(గణిత శాస్త్రంలో అంతంకాని ఆనావర్తన దశాంశం) విలువను చూడకుండా వంద, ఐదు వందల సార్లు చెప్పి మ్యాగ్స్‌ జీనియస్‌ ప్రపంచ రికార్డును సాధించారు.
>ఎక్సైజ్‌, కస్టమ్స్‌ కేంద్ర బోర్డు(CBEC) పేరును పరోక్ష పన్నుల, కస్టమ్స్‌ కేంద్ర బోర్డు(CBIC)గా మార్చారు. ఫైనాన్స్‌ బిల్లు 2018 ద్వారా రెవెన్యూ కేంద్ర బోర్డు చట్టం-1963కు, కేంద్ర జీఎస్‌టీ చట్టం-2017కు సవరణ చేయడం ద్వారా CBECని CBICగా మార్చారు.
>ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త ప్రొఫెసర్‌ టి.శివాజీరావు(86) 2018 మార్చి 31న విశాఖపట్నంలో మృతిచెందారు
>సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ అంత్యక్రియలు 2018 మార్చి 31న లండన్‌లోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ కళాశాలకు సమీపంలోని ఒక చర్చి వద్ద అంత్యక్రియలుజరిగాయి
>BCCI అవినీతి నిరోధక యూనిట్‌ (ACU)కు నూతన చీఫ్‌గా అజిత్‌సింగ్‌ నియమితులయ్యారు
>దాదాపు అర్ధశతాబ్దం కిందట హైజాక్‌కు గురైన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి పైట్‌గా ఉన్న కెప్టెన్‌ ఎమ్‌కే కచ్రూ (93) 2018 మార్చి 31న హర్యానాలోని ఫరీదాబాద్‌లో మృతి చెందారు
>హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధక విద్యార్థి రాహుల్‌ గాయమ్‌కు ఫోర్బ్స్‌ జాబితాలో 30వ స్థానం దక్కింది. 2018లో ఆసియా పరిధిలో ఉన్న 300 మంది యంగ్‌ ఇన్నోవేటర్లలో తొలి 30 మందిలో ఒకరిగా నిలిచారు
>బౌద్ధ గురువు దలైలామా భారత్‌కు వచ్చి 60 ఏళ్లవుతున్న సందర్భంగా టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం ఏడాదికాల ‘థాంక్యూ ఇండియా’ ప్రచారాన్ని 2018 మార్చి 31న ధర్మశాలలో ప్రారంభించింది