Telugu Current Affairs Highlights 02 April 2018

Telugu Current Affairs Highlights 02 April 2018

Telugu Current Affairs Highlights 02 April 2018

>స్వల్ప కాలంలో వృద్ధి పరంగా అంతర్జాతీయంగా టాప్‌ 30 నగరాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, పుణె 4, కోల్‌కతా 5, డిల్లీ 8, చెన్నై 14, ముంబై 20వ స్థానంలో ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ JLL (జోన్స్‌ లాంగ్‌ లాసల్లే) తెలిపింది.
>సంతోష్‌ ట్రోఫీ ఫుట్‌బాల్‌ టోర్నీలో కేరళ విజేతగా నిలిచింది. 2018 ఏప్రిల్‌ 1న కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో కేరళ జట్టు బెంగాల్‌ జట్టును ఓడించింది
>మానవులను అంగారకుడిపైకి చేరవేసే శక్తిమంతమైన రాకెట్‌ డిజైన్‌ను అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ మరింత మెరుగుపరచింది
>అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిపుణులు ప్రత్యేక పాలిమర్ల సాయంతో ప్లాస్టిక్‌ను ఉష్ణ వాహకంగా మార్చేశారు.
>ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల రోజువారీ వేతనాన్ని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడున్న రూ.197 వేతనాన్ని రూ.205కు పెంచుతు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
>మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో చైనా ఉండగా, స్వల్ప కాలంలోనే భారత్‌ రెండోస్థానానికి చేరిందని ఇండియన్‌ స్యొలార్‌ అసోసియేషన్‌ (ICA) జాతీయ అధ్యక్షుడు పంకజ్‌ మొహింద్రూ కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా, ఐటీ శాఖా మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు లేఖ ద్వారా తెలియజేశారు
>డా॥ యలమంచిలి శివాజీ రాసిన ‘తలచుకుందాం.. ప్రేమతో’ పుస్తకాన్ని 2018 ఏప్రిల్‌ 1న విజయవాడలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఆవిష్కరించారు
>రాజ్యసభ ఎంపీ పదవి నుంచి ఇటీవలే విరమణ పొందిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ సభ్యకాలంలో వేతనం, ఇతర భృతులుగా
>సరకు అంతర్రాష్ట్ర రవాణా కోసం ఇ-వే బిల్లుల జారీ ప్రక్రియ 2018 ఏప్రిల్‌ 1న దేశవ్యాప్తంగా మొదలైంది. మొదటిరోజు 1.71 లక్షలకు పైగా ఇ-వే బిల్లులు జారీ అయ్యాయి.
>అంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో గల శివాజీ స్ఫూర్తి కేంద్రంలో రూ.3 కోట్లతో నిర్మించిన శివాజీ ధ్యాన మందిరాన్ని 2018 ఏప్రిల్‌ 1న మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ప్రారంభించారు
>తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జెన్‌కో 62.5 మెగావాట్ల బీ-థర్మల్‌ విద్యుత్కేంద్రం ఉత్పత్తిలో రికార్డు సాధించింది. 2017-18 వార్షిక సంవత్సరంలో 419 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యానికి గాను 2018 మార్చి 31 అర్ధరాత్రి వరకు 474.76 మిలియన్‌ యూనిట్లు సాధించింది.
>గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటుసంపాదించుకున్న మాగంటి జాహ్నవి ఇటీవల కాలి(పాదం)తో 140 అడుగుల అతిపెద్ద చిత్రం గీసింది
>భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన అధునాతన కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-6ఏతో సంబంధాలు తెగిపోయాయి

One thought to “Telugu Current Affairs Highlights 02 April 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.