Telugu Current Affairs Highlights 02 May 2018

Telugu Current Affairs Highlights 02 May 2018

Telugu Current Affairs Highlights 02 May 2018





>సినర్జీస్‌ కాస్టింగ్‌ సంస్థ అల్ల్యుమినియం అల్లాయ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కారు చక్రాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏటా 18 అంగుళాల 2.4 మిలియన్‌ చక్రాల తయారీ ఈ ప్లాంట్‌ ప్రత్యేకత
>వింబుల్డన్‌ ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. 2017తో పోలిస్తే 7.6 శాతం పెరుగుదలతో మొత్తం రూ. 309 కోట్లకు చేరింది. పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతకు తలా రూ.20.47 కోట్లు దక్కనుంది
>భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) నూతన ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర కుంతియా నియమితులయ్యారు
>మహారాష్ట్ర రాజధాని ముంబయి తీరంలో అరేబియా సముద్రంలో నిర్మించతలపెట్టిన ఛత్రపతి శివాజీ విగ్రహం ఎత్తును మరో 2 మీటర్లు(210 నుంచి 212 మీటర్లకు) పెంచాలని నిర్ణయించినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు
>అణు ఖనిజ అన్వేషణ, పరిశోధన సంస్థ (అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టర్‌ ఫర్‌ ఎక్స్‌ఫ్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌-AMD) డైరెక్టర్‌గా నియమితులైన ఎం.బి.వర్మ 2018 మే 1న బాధ్యతలు స్వీకరించారు
>హృద్రోగుల ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా పర్యవేక్షించే సరికొత్త యాప్‌ను ఐఐటీ-రూర్కీ విద్యార్థులు అభివృద్ధి చేశారు. దీనికి ధడ్‌కన్‌గా నామకరణం చేశారు
>పవన, సౌర విద్యుత్‌ను నిల్వచేసే జలాధార బ్యాటరీని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. అవసరమైనప్పుడు ఇవి గ్రిడ్‌కు విద్యుత్‌ను సరఫరా చేయగలవు
>పాఠశాలల్లో సైబర్‌ భద్రత, సురక్షితపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(NCERT) మార్గదర్శకాలను జారీ చేసింది
>కమ్యూనిస్టు మేధావి, ప్రముఖ ఆర్థికవేత్త అశోక్‌మిత్ర(90) 2018 మే 1న మృతి చెందారు. ఇందిరాగాంధీ హయాంలో 1970-72 వరకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఆర్థిక సలహాదారుగా, 1977-87 వరకు జ్యోతిబసు హయాంలో పశ్చిమబెంగాల్‌ ఆర్థికమంత్రిగా పనిచేశారు
>తెలంగాణలోని సిద్దిపేటలో 150 ఎంబీబీఎస్‌ సీట్లతో ప్రభుత్వ వైద్యకళాశాల నెలకోల్పడానికి భారతీయ వైద్య మండలి(MCI) అనుమతించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 7 ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేసినట్లు అయింది
>అత్యాధునిక సమాచార పరిజ్ఞానంతో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్‌ పోలీసు 2018 మే 1న కాగిత రహిత పరిపాలనను ప్రవేశపెట్టారు