Telugu Current Affairs Highlights 03 May 2018

Telugu Current Affairs Highlights 03 May 2018

Telugu Current Affairs Highlights 03 May 2018

>బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ గుంటూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2018 మే 2న గుంటూరు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో కలెక్టర్‌ కోన శశిధర్‌కు శ్రీకాంత్‌ రిపోర్టు చేశాడు.
>నిరుద్యోగులైన గిరిజన యువత స్వయం ఉపాధి కోసం ట్రైకార్‌ ఆధ్వర్యంలో తేలికపాటి, చిన్న తరహా వాణిజ్య వాహనాలు అందజేయాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది
>స్వచ్ఛ రైల్వే స్టేషన్లలో దేశంలో 2వ స్థానంలో నిలిచిన సికింద్రాబాద్‌ స్టేషన్‌ మరో అవార్డును సొంతం చేసుకుంది. అలంకరణ విభాగంలో భారతీయ రైల్వేలో 3వ స్థానం దక్కించుకుంది.
>బ్యాడ్మింటన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఇద్దరు మలేసియా క్రీడాకారులకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(BWF) భారీ శిక్షలు ఖరారు చేసింది.మళ్లీ ఆడే అవకాశం లేకుండా 25 ఏళ్ల జుల్ఫాడ్లి జుల్కిఫ్లిపై 20 ఏళ్లు, 31 ఏళ్ల టాన్‌ చున్‌ సియాంగ్‌పై 15 ఏళ్ల్ల నిషేధం విధించింది.
>కొరియాలో 2018 మే 13న ప్రారంభమయ్యే ఆసియా హాకీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు సునీత లక్రా కెప్టెన్‌గా వ్యవహరించనుంది
>దేశంలో సంచలనం రేపిన జర్నలిస్టు జ్యోతిర్మయ్‌ డే హత్యకేసులో గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌, మరో 8 మందికి ముంబయిలోని మోకా న్యాయస్థానం జీవితఖైదు, రూ.26 లక్షల వంతున జరిమానా విధించింది
>కామన్వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం, డబుల్స్‌లో రజతం గెలిచిన తెలుగుతేజం ఆర్‌.సాత్విక్‌ సాయిరాజ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందిస్తూ ప్రభుత్వం తరఫున రూ.40 లక్షల బహుమతి అందిస్తామని ప్రకటించారు
>అమెరికా విశ్వవిద్యాలయాల్లో 2.1 లక్షల మందికి పైగా భారతీయులు చదువుకుంటున్నట్లు వెల్లడైంది. అమెరికాలో చైనీయుల తర్వాత భారత విద్యార్థుల సంఖ్యే అధికమని తేలింది.
>పుట్టినరోజు వంటి వేడుకల్లో రంగురంగుల పేపర్లు, ప్లాస్టిక్‌ ముక్కలను వెదజల్లేందుకు ఉపయోగించే స్వల్పస్థాయి విస్ఫోటక పరికరాలైన పార్టీ పాపర్లపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(CPCB) నిషేధం విధించింది
>ప్రధాని నరేంద్రమోడి నేతృత్వాన 2018 ఏప్రిల్‌ 3న కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది.
>రూ.5,082 కోట్లతో చెన్నై, గౌహతి, లక్నో విమానాశ్రయాల విస్తరణకు ఆమోదం
>ప్రధానమంత్రి వయ వందనా యోజన (PMVVY)లో పెట్టుబడుల పరిమితిని రూ.7.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది
>12వ పంచవర్ష ప్రణాళికలో లక్షించిన ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన(PMSSY) 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగింపు
>నైరుతి డిల్లీలోని నజఫ్‌గఢ్‌లో రూ.95 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం
>12వ పంచవర్ష ప్రణాళికలో లక్షించిన ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన(PMSSY) 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగింపు
>మైనారిటీ వర్గాలకు సామాజిక, ఆర్థిక వసతులు కల్పించేందుకు చేపడుతున్న బహుళ రంగాల అభివృద్ధి కార్యక్రమం(MSDP) పేరును ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమంగా మార్చుతూ, పునః వ్యవస్థీకరించేందుకు అంగీకారం