Telugu Current Affairs Highlights 04 April 2018

Telugu Current Affairs Highlights 04 April 2018

Telugu Current Affairs Highlights 04 April 2018

>దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISC) నిలిచింది.కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(NIRF) ద్వారా దేశంలోని వివిధ విద్యా సంస్థలకు ఇచ్చిన ర్యాంకులను ఆ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ 2018 ఏప్రిల్‌ 3న న్యూడిల్లీలో విడుదల చేశారు
>ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందనే ఆరోపణలకు పరిష్కారంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వర్చువల్‌ ఐడీ (VID)బీటా వర్షన్‌ను విడుదల చేసింది.
>ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు చెందిన పాకిస్థాన్‌లోని రాజకీయ ఫ్రంట్‌ మిల్లీ ముస్లిం లీగ్‌´(MML)ను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించింది
>15 రాష్ట్రాలకు చెందిన మొత్తం 41 మంది నూతన సభ్యులు 2018 ఏప్రిల్‌ 3న రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు
>కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో సభానాయకునిగా 2018 ఏప్రిల్‌ 3న మరోసారి నియమితులయ్యారు
>బంగారం దిగుమతులు చేయకుండా యాక్సిస్‌ బ్యాంక్‌పై రిజర్వు బ్యాంక్‌ నిషేధం విధించింది
>జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ తన బ్యాంకింగ్‌ కార్యకలాపాలను 2018 ఏప్రిల్‌ 3న ప్రారంభించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది
>తెలంగాణలోని పేద యువతులకు వివాహ సాయం కోసం అమలవుతున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద సాయం రూ.1,00,116కి పెంచుతూ ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 3న ఉత్తర్వులు జారీచేసింది.
>జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణం తాత్కాలిక నిబంధనేమీ కాదని సుప్రీంకోర్టు 2018 ఏప్రిల్‌ 3న స్పష్టం చేసింది
>అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన హబుల్‌ అంతరిక్ష టెలిస్కోపు విశ్వంలో అత్యంత సుదూర ప్రాంతంలో ఉన్న ఒక నక్షత్రాన్ని విశ్వంలో అత్యంత సుదూర ప్రాంతంలో ఉన్న ఒక నక్షత్రాన్ని గుర్తించింది.ఈ నక్షత్రం కాంతి భూమిని చేరడానికి ఏకంగాs 900 కోట్ల సంవత్సరాలు పడుతుంది.
>ఉమ్మడి రాష్ట్ర మైనార్టీ ఆర్థిక సంస్థకు సంబంధించి ఉద్యోగులు, కార్యాలయాల విభజనకు AP ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 2న ఉత్తర్వులు జారీ చేసింది