Telugu Current Affairs Highlights 04 May 2018

Telugu Current Affairs Highlights 04 May 2018

Telugu Current Affairs Highlights 04 May 2018

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ప్రమోద్‌ కే నాయర్‌ రాష్ట్రపతి ప్రదానం చేసే విజిటర్స్‌ అవార్డు అందుకున్నారు
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా డిల్లీ మరోసారి అపఖ్యాతి మూటగట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం గాలిలో ప్రతీ 10 మైక్రో మీటర్లకు వార్షిక సగటున 292 మైక్రోగ్రాముల ధూళి అణువులతో ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరాల్లో డిల్లీ 3వ స్థానంలో నిలిచింది. అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 14 భారత్‌లోనే ఉన్నాయని నివేదికలో వెల్లడైంది.
ఫేస్‌బుక్‌లో ఎక్కువమంది అనుసరించే ప్రపంచ నాయకుడిగా భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి రికార్డు సృష్టించారు. మోడిని ఫేస్ బుక్లో 4.32 కోట్ల మంది అనుసరిస్తున్నారు
గురుకులాల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నియామక బోర్డును (టెరీ-ఆర్‌బీ) ఏర్పాటు చేసింది.
ప్రధాని నరేంద్రమోడి 2017 ఏప్రిల్‌లో భువనేశ్వర్‌లోని లింగరాజ్‌ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో ‘నేతలు పోస్ట్‌ చేసిన ఫొటో’ల్లో 2017లో అత్యంత ప్రాచుర్యం పొందిన చిత్రంగా నిలిచింది
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(క్రీడల శాఖ) ఎల్వీ సుబ్రమణ్యం 2018 మే 3న జీఓ 34 జారీ చేశారు
ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు 2018 మే 3న నిరాకరించింది
మాజీ టెస్టు ఓపెనర్‌ జస్టిన్‌ లాంగర్‌ ఆసీస్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. 2018 మే 22న బాధ్యతలు స్వీకరించనున్న లాంగర్‌ 4 సం॥ల పాటు పదవిలో ఉంటాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పరిహసించేలా తీర్చిదిద్దిన వివాదాస్పద నగ్న విగ్రహం వేలంలో రూ.18 లక్షలకు అమ్ముడుపోయింది.
జాతీయ పింఛను పథకం(NPS) ఖాతాదారులు ఉన్నత చదువులు, వ్యాపారం నిమిత్తం తమ సొమ్మును పాక్షికంగా వెనక్కు తీసుకునే వీలు కల్పిస్తూ పింఛను నిధి, నియంత్రణ, అభివృద్ధి సంస్థ (PFDRA) నిర్ణయం తీసుకుంది.
పింఛనుదారులు ఇక నుంచి తమ పాస్‌బుక్‌ను ఉమాంగ్‌ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవచ్చని EPFO 2018 మే 3న వెల్లడించింది
ఆస్ట్రేలియాకు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్‌ డేవిడ్‌ గుడాల్‌ కారుణ్య మరణం కోసం 2018 మే 2న స్విట్జర్లాండ్‌ బయల్దేరారు
లోక్‌సభలో ప్రవేశపెట్టిన చిట్‌ఫండ్‌ సవరణ బిల్లును ఆర్థిక రంగ పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనకు పంపిస్తూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు
ప్రయాణికులకు పర్యావరణహిత పళ్లాల్లో ఆహారం అందజేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇంతవరకు ప్లాస్టిక్‌ పళ్లాల్లో ఆహారం ఇస్తుండగా, ఇకపై చెరకు పిప్పితో తయారు చేసిన పళ్లాల్లో సరఫరా చేయనుంది
ఆదిలాబాద్‌ జిల్లా కుప్టి మండలం నేరడిగొండ గ్రామ సమీపంలో నిర్మించనున్న కుప్టి బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.794.33 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది
అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి, ఆసియా క్రీడల్లో పతకం సాధించిన అర్జున అవార్డు గ్రహీత వి.జ్యోతిసురేఖకు రూ.76.53 లక్షలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులనిచ్చింది
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులతో ఓ కమిటీని నియమించారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ దీనికి ఛైర్మన్‌గా ఉంటారు.