Telugu Current Affairs Highlights 05 April 2018

Telugu Current Affairs Highlights 05 April 2018

Telugu Current Affairs Highlights 05 April 2018

>ఆంద్రప్రదేశ్‌ యువజన అభ్యుదయశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతోన్న సాహస యాత్ర ‘మిషన్‌ ఎవరెస్టు-2017’ కార్యక్రమానికి ఒక యువతి సహా ఆరుగురు ఎంపికయ్యారు. 2018 ఏప్రిల్‌ 9న ప్రారంభమయ్యే వీరి ఎవరెస్టు పర్వతారోహణ జూన్‌ 1 నాటికి పూర్తవుతుంది.
>మధ్యప్రదేశ్‌లో ఐదుగురు బాబాలకు బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర సహాయ మంత్రి హోదా కల్పించింది. నర్మదానంద్‌ మహారాజ్‌, హరిహరానంద్‌ మహారాజ్‌, కంప్యూటర్‌ బాబా, భయ్యూ మహారాజ్‌, పండిట్‌ యోగేంద్ర మహంత్‌కు మంత్రి హోదా లభించింది
>ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా ట్రైబ్యునల్‌ సభ్యుడు లావు రవిబాబు 2018 ఏప్రిల్‌ 4న హైదరాబాద్‌లో మృతి చెందారు
>ఒడిశాలోని విఖ్యాత పూరీ శ్రీక్షేత్రంలోని రత్నభాండాగారం తుపు 2018 ఏప్రిల్‌ 4న తెరిచారు. 15 మందితో కూడిన అధ్యయన బృంద సభ్యులు లోపలికి ప్రవేశించారు
>కల్యాణక్ష్మి పథకం కింద రూ.1,00,116కు పెంచిన మొత్తానికి సంబంధించి పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలోనే మొదటి చెక్కును సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండంలోని సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో 2018 ఏప్రిల్‌ 4న అందజేశారు.
>ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.బి.రామన్నదొర గెలుపొందారు
>ఐసీఐసీఐ బ్యాంక్‌ విదేశాల్లోని భారతీయుల కోసం సోషల్‌ పే అనే కొత్త సేవను ప్రవేశపెట్టింది. దీని ద్వారా భారత్‌లోని తమ స్నేహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు డబ్బులు పంపించడానికి సామాజిక మాధ్యమాల్ని వాడుకోవచ్చని తెలిపింది. వాట్సాప్‌, ఇ-మెయిల్‌ ఉపయోగించుకుని డబ్బు పంపవచ్చని ఖాతాదారులకు సూచించింది.
>21వ కామన్వెల్త్‌ క్రీడలు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ నగరంలో 2018 ఏప్రిల్‌ 4న ప్రారంభమయ్యాయి.