Telugu Current Affairs Highlights 06 April 2018

97 total views, 2 views today

Telugu Current Affairs Highlights 06 April 2018

Telugu Current Affairs Highlights 06 April 2018

>మహిళల మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన్ మంత్రి మాత్రు వందన యోజన (PMMVY) కింద లబ్ధిదారులకు రూ. 271.66 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 11,47,386 మంది లబ్ధిదారులకు చెల్లింపు జరిగింది
>21వ కామన్వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను భారతదేశానికి తొలి స్వర్ణాన్ని అందించింది
>అజర్‌బైజాన్‌ రాజధాని బాకూలో 2018 ఏప్రిల్‌ 5న జరిగిన అలీనోద్యమ(NAM) దేశా 18వ మధ్యకాలిక మంత్రుల సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పాల్గొన్నారు
>దేశవ్యాప్తంగా 2018 ఏప్రిల్‌ 5న బాబూ జగ్జీవన్‌రామ్‌ 111వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
>వర్చువల్‌ కరెన్సీపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొరడా ఝుళిపించింది. బిట్‌ కాయిన్‌ తరహాలో సొంత డిజిటల్‌ కరెన్సీని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. బిట్‌ కాయిన్‌ వంటి వర్చువల్‌ కరెన్సీ కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులు, సంస్థలకు సేవలను మూడు నెలల్లోగా నిలిపేయాంటూ బ్యాంకు, ఇతరత్రా నియంత్రణ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
>తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొదటిదశ అటవీ అనుమతులు లభించాయి
>బ్రిటన్‌ సంస్థ కేంబ్రిడ్జి అనలిటికా(CA) ద్వారా 5 కోట్లమంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతకు భంగం వాటిల్లిందని ఇప్పటివరకు అంచనా వేయగా ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. దాదాపు 8.7 కోట్లమంది డేటా అనుచిత రీతిలో సీఏకు చేరినట్లు ఫేస్‌బుక్‌ స్వయంగా ప్రకటించింది
>ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రిటైర్డు ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని విజయవాడలో 2018 ఏప్రిల్‌ 5న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆవిష్కరించారు.
>కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (52)ను రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ న్యాయస్థానం దోషిగా తేల్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం సెక్షన్‌ 9/51 కింద ఆయనకు 5 సం॥ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.

One thought to “Telugu Current Affairs Highlights 06 April 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.